Sunday, November 7, 2010

మహా పండితులు తిట్టుకొనే విధానం

ఒక తుంటరి అబ్బాయి ఈ క్రింది పద్యంలో
"ఒసే! దరిద్రపు దానా! కొంచం సున్నం తెచ్చి పెట్టవే!" ... అంటే

పర్వత శ్రేష్ఠ పుత్రికా పతివిరోధి
యన్న పెండ్లాము అత్తను గన్న తల్లి(/తండ్రి)
పేర్మి మీరిన ముద్దుల పెద్దబిడ్డ
సున్న మించుక తేగదే సుందరాంగి(/సన్నుతాంగి)

( పార్వతి, శివుడు, మన్మథుడు, బ్రహ్మ, సరస్వతి, లక్ష్మి,
సముద్రుడు(/అతని భార్య), జ్యేష్ఠా దేవి (దరిద్ర దేవత) )

ఆ గడుసరి అమ్మాయి ఇలా అని సున్నం ఇచ్చిందట !(తమలిపాకులోకి)
"ఓరి కుక్కా! ఇదుగో సున్నం!"

శతపత్రంబుల మిత్రుని
సుతు జంపినవాని బావ సూనుని మామన్
సతతము దాల్చెడు నాతని
సుతువాహన వైరి వైరి సున్నంబిదిగో
( కమలము, సూర్యుడు, కర్ణుడు, అర్జునుడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు,
చంద్రుడు, శివుడు, గణపతి, ఎలుక, పిల్లి, కుక్క ) 

Saturday, October 16, 2010

శాలివాహన (వాటర్ పెయింటింగ్)


ఆంధ్రుల తొలి తెలుగు రాజులు శాతవాహనులు.ఆయితే వీళ్ళెవరనేదాని మీద బోల్డంత గందరగోళం ఉంది.శాలివాహనుడు విక్రమాదిత్యున్నే ఓడించిన రాజని ఒక కథ బహుళ ప్రచారంలో ఉంది.మన పురాణాల ప్రకారం శాలివాహనుడు విక్రమాదిత్యుని మనవడు, అగ్నివంశపు రాజు.విదేశీ చరిత్రకారుల ప్రకారం గౌతమీపుత్ర శాతకర్ణే శాలివాహనుడు.కొంతమంది స్వదేశీ చరిత్రకారులు దీనితో విభేదిస్తారు.అయితే ఇంద్రదత్తమైన సింహాసనం పొంది,భేతాళున్ని వశం చేసుకున్న విక్రమాదిత్యుడెవరు అనేదానిమీదే చరిత్రకారులకు ఏకాభిప్రాయం లేదు.
అటువంటప్పుడు అతన్ని ఓడించి శక శకానికి శ్రీకారం చుట్టిన శాలివాహనుడెవరో తెలుసుకోవడం కష్టం.వీళ్ళు ఎవరైనా ఆంధ్రజాతికి వీళ్ళే మొదటి తెలుగు పాలకులన్నది సుస్పష్టం.
ఆ శాలివాహనుడి ఊహాచిత్రమే ఈ చిత్రం.


Friday, October 1, 2010

కర్ణాభిమన్యుల జన్మరహస్యం,ఏకలవ్యుని మరణం ఇతర విశేషాలు



తిహాసం అంటే 'ఇది ఇలాగే జరిగిందని ' అర్థం.పంచమవేదమైన మహాభారతం ఎన్నో అద్భుతమైన గాథలకు మారుపేరు.భారతంలో లేనిది ఎక్కడా లేదు,ఎప్పుడూ జరుగబోదు కూడా.పూర్వం దేవలోకంలో నాలుగువేదాలని ఒక వైపు,మహాభారతాన్ని ఒక వైపు వేసి తూస్తే,త్రాసు భారతం వైపే మొగ్గిందట.అటువంటి మహోన్నతమైన గ్రంథంలోంచి కొన్ని విశేషాలు ఇక్కడ.

  • మహాభారతం వ్రాయడానికి వేదవ్యాసునికి మూడేళ్ళు పట్టింది.
  • వేదాలను నాలుగు భాగాలుగా విభజించినందువలన వ్యాసునికా పేరు వచ్చింది.ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు(నల్లగా ఉంటాడు,ద్వీపంలో పుట్టినవాడు).
  • అమృతం కోసం గరుత్మంతుడు అమృతభాండం ఉంచిన దర్భలను ఆబగా నాకి పాముల నాలుకలు రెండవుతాయి.
  • యాగశాలకున్న వాస్తుదోషం కారణంగా సర్పయాగం ఆగిపోతుందని యాగారంభానికి ముందే లోహితుడనే వాస్తుశాస్త్ర నిపుణుడు జనమేజయున్ని హెచ్చరిస్తాడు.
  • బ్రాహ్మణులు కల్లు త్రాగరాదని,త్రాగితే నరకప్రాప్తి తథ్యమని శుక్రాచార్యులు శాపమిస్తాడు.
  • కులాంతర వివాహాలు ఆనాడే ఉన్నాయి.యయాతి క్షత్రియుడు.దేవయాని బ్రాహ్మణ కన్య.'బ్రాహ్మణులు క్షత్రియ కన్యలను వివాహమాడవచ్చు కానీ,రాజులు బ్రాహ్మణ కన్యలను వివాహమాడరాద 'ని యయాతి అంటే శుక్రాచార్యులు అతని సందేహాన్ని తీర్చి వారిద్దరి వివాహానికి ధర్మబద్ధతను కల్పిస్తాడు.
  • శకుంతలకు దుర్వాస మహర్షి శాపమివ్వటం,దుష్యంతుడు ఆమెను మరచిపోవటం, జాలర్లు తెచ్చిన ఉంగరం చూసి అతనికి అంతా గుర్తుకు రావటం..ఇదంతా మహాకవి కాళిదాసు కల్పనా వైచిత్ర్యం.వ్యాస భారతంలో కథ వేరు.అసలు దుర్వాస మహర్షి ప్రస్తావనే లేదు.దుష్యంతుడు ప్రజాపవాదుకి భయపడి నిండు సభలో శకుంతల ఎవరో తెలియనట్లు నటిస్తే,ఆకాశవాణి వారి వివాహాన్ని గురుంచి సభికులందరికీ చెబుతుంది.దుష్యంతుడు అప్పుడు అంగీకరిస్తాడు.
  • దుష్యంతుని కుమారుడు భరతుడు.అతనికి పుట్టిన కొడుకులెవ్వరు ప్రయోజకులు కాకపోవటంతో ,ఆగ్రహించి భరతుడే వారందరినే చంపి,గొప్ప యాగం చేసి,భరధ్వాజుని ద్వారా భూమన్యుడనే కొడుకుని పొందుతాడు.
  • మహాభారతం ఒక విధంగా దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధం అనుకోవచ్చు.అమృతం పొందిన దేవతలకు ఎదురొడ్డి నిలువలేక దైత్యులు,దానవులు భూప్రపంచంలో వివిధ రూపాలతో జన్మించి తమ ఆధిక్యాన్ని నిరూపించుకుంటూంటే,దుష్టశిక్షణ,శిష్టరక్షణ చేసి భూభారం తగ్గించటానికి దేవతలు కూడా మానవజన్మలెత్తుతారు.

    ధృతరాష్ట్రుడు - హంస అనే గంధర్వుడు
    పాండురాజు - వాయుదేవుని అంశ
    కుంతి,మాద్రి -సిద్ధి,ధృతి
    గాంధారి - మతి
    విదురుడు - యమధర్మరాజు
    ద్రోణుడు - బృహస్పతి
    కృపాచార్యుడు - ఏకాదశరుద్రుల అవతారం
    ద్రుపదుడు,విరాటుడు - వాయుదేవుని అంశ

    దుర్యోధనుడు - కలిపురుషుని అంశ
    దుర్యోధనుడి సోదరులు 99 మంది - రాక్షసులు
    శకుని - ద్వాపరయుగాంశ సంభూతుడు
    ఆశ్వత్థామ - రుద్రుడు,యముడు,కామ క్రోధాంశ సంభూతుడు
    శల్యుడు - ప్రహ్లాదుని తమ్ముడు సంహ్లాదుడు
    శిఖండి -గుహ్యకుడనే రాక్షసుడు
    ధృష్టద్యుమ్నుడు - ఆగ్ని అంశ
    ద్రౌపది తనయులు - విశ్వులు

    కంసుడు - కాలనేమి అనే రాక్షసుడు
    పదహారువేల మంది గోపికలు - అప్సరసలు
    జరాసంధుడు - దానవులలో మొదటివాడు విప్రచిత్తి
    రుక్మి (రుక్మిణీదేవి అన్న) - క్రోధుని కుమారుడు
    సాత్యకి (శ్రీకృష్ణుని తమ్ముడు)- మరుత్తులు
  • కర్ణుడు పూర్వజన్మలో సహస్రకవచుడనే రాక్షసుడు.నరనారాయణులు అతనితో అనేక సంవత్సరాలు యుద్ధం చేసి 999 కవచాలు చేధిస్తారు.మిగిలిన ఒక్క కవచంతో అతను పారిపోయి సూర్యునిలో దాక్కుంటాడు.నరనారాయణులే కృష్ణార్జునులుగా జన్మిస్తారు.
  • కర్ణుడి అసలు పేరు వసుసేనుడు.జన్మతహ వచ్చిన కవచ కుండలాలను శరీరం నుంచి చీల్చి ఇంద్రునికి దానం చేస్తాడు కాబట్టి అతనికి కర్ణుడనే పేరు వచ్చింది.దుర్యోధనుని ప్రాపకం పొందేనాటికే అతనికి కవచ కుండలాలు లేవు. దానమిచ్చేశాడు.మన సినిమాలలో,సీరియల్స్ లో దుర్యోధనుడి చెంత వున్న కర్ణున్ని కవచ కుండలాలలో చూపించి,
    యుద్దసమయంలో అతను వాటిని ఇంద్రునికి దానం చేసినట్లు చూపిస్తారు.
  • పెళ్ళికి ముందే గాంధారి శివుని గూర్చి తపస్సు చేసి నూటొక్క పిల్లల్ని కనే వరం పొందుతుంది.
  • గాంధారి, ఆమె చెల్లెళ్ళు పదిమందితో కలిపి ధృతరాష్ట్రునికి వందమంది భార్యలు.
  • అభిమన్యుడు చంద్రుని కుమారుడైన వర్ఛస్సు అంశతో జన్మించినవాడు.కుమారుని విడిచి ఉండలేని చంద్రుడు అతనికి పదహారోయేడు కలిగినవెంటనే తిరిగివచ్చేయాలని షరతు విధిస్తాడు.తత్పలితంగా అభిమన్యుడు పద్మవ్యూహంలో మరణిస్తాడు.
  • కర్ణుడు సైతం ద్రోణాచార్యుడి వద్ద కొంతకాలం విద్యనభ్యసించాడు.కురుపాండవుల అస్త్రవిద్యాప్రదర్శనం కంటే ముందు అతనెవరో ద్రోణుడికి తెలుసు.
  • ఏకలవ్యుడు శ్రీకృష్ణుడి పినతండ్రైన దేవశ్రవుని(వసుదేవుని తమ్ముడు)కుమారుడు.క్రోధుని కుమారులలో ఒకరి అంశతో జన్మించినవాడు.జరాసంధుని సైన్యాధిపతైన హిరణ్యధ్వజుడనే నిషాదరాజు ఇతన్ని పెంచుకుంటాడు.శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకెళుతున్నప్పుడు,అడ్డుపడి జరాసంధుని తరపున పోరాడి అతని చేతిలో ప్రాణాలు కోల్పోతాడు.
  • హిడింబ అసలు పేరు కమలపాలిక.
  • ఘటోత్కచుడికి నెత్తిన జుట్టు లేదు.బోర్లించిన కుండలా బట్టతలతో ఉంటాడు కాబట్టే అతనికా పేరు.

Wednesday, September 29, 2010

సాధారణముగా ఒక పదమునకు ఒకే అర్ధముండును. కానీ కొన్ని పదములకు ఒకటి కంటే ఎక్కువ అర్ధములుండును. అట్టి పదముల అనేక అర్ధములను నానార్ధములు అని అందురు. తెలుగుదనం వారి సౌజన్యం తో కొన్ని ఇక్కడ ఇస్తున్నాను. ఇవి మన పద్యాలు రాయడానికి ఉపయోగ పడతాయి.

అంకము - నాటకభాగము, సమీపము, చిహ్నము, అంకె.
అంగము - శరీరము, ఉపాయము, భాగము, అవయవము.
అంటు - మైల, తాకు, నేలపైపాతిన కొమ్మ.

వాల్మీకి ఉత్తరకాండకు, లవకుశ సినిమాకు గల తేడాలు


వాల్మీకి ఉత్తరకాండకు,మన ఎంటీవోడి లవకుశ సినిమాకు చాలా తేడాలున్నాయి.వాటితో పాటూ రావణుడి గురుంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ పొందుపరిచాను.

  • శూర్పణఖ విభీషణుడికి అక్క.
  • రావణ,కుంభకర్ణ,శూర్పణఖా,విభీషణులు కన్యాపుత్రులు.

Sunday, September 26, 2010

తెలుగు భాష చరిత్ర

తెలుగు,భారత దేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రవిడ భాష. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజ భాష. "త్రిలింగ" పదము నుంచి "తెలుగు" పదం వెలువడిందని అంటారు.తేనె వంటిది కనుక "తెనుగు" అనాలని కొందరు అంటారు. క్రీస్తు పూర్వం 200 నాటి శిధిలాలలొ తెలుగు భాష ఉండటంబట్టి ఈ భాష ప్రాచీనత మనకి తెలుస్తుంది ఏమైనా తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్రీ.పూ. మొదటి శకంలో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత్ పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు,

Friday, September 24, 2010

తెలుగు లో మొట్టమొదటిగా లభించిన పద్యం. (first poem found in telugu)

తెలుగు బాష లో మొదట రాయబడినదని చెప్పబడే పద్యం తెలుసు కుందాము.
క్రీస్తు శకం ౮౪౮ వ సంవత్సరం లో పండరంగుని అద్దంకి శాసనం లోని తరువోజ పద్యం.

తెలుగు భాషలో నవలా ప్రక్రియ -- Novel in Telugu Literature




తెలుగు భాషలో నవలా ప్రక్రియ మొదలై నూరు సంవత్సరాలు దాటింది. నవల అనే సాహిత్య ప్రక్రియను మనం పాశ్చాత్య దేశాల నుండి దిగుమతి చేసుకున్నాం. నవల్లో మన తెలుగు నవలా రచయితలపై పాశ్చాత్య రచయితల ప్రభావంతో పాటు వంగ, మహారాష్ట్ర, కన్నడ, ఉర్దూ రచయితల ప్రభావం ఎంతగానో ఉంది. నేడు తెలుగు సాహిత్యంలో ప్రజల గౌరవాదరణలను పొందుతున్న ఏకైక సాహితీ ప్రక్రియ నవల అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

Thursday, September 23, 2010

వాల్మీకి రామాయణానికీ - వ్యవహార రామాయణానికీ గల తేడాలు


  • దశరథ మాహారాజుకు మొత్తం 353 భార్యలు.
  • దశరథుడికి కైకంటే చాలా ఇష్టం.పట్టమహిషైన శ్రీరాముని తల్లి కౌసల్య కంటే కైకంటేనే ఆయనకు ప్రీతి.కౌసల్య పట్ల ఆయనకు ఉదాసీన భావం ఉండేది.రాణివాసంలో కైక మాటలకే ప్రాధాన్యత.

epic browser - భారతదేశపు మొదటి వెబ్ బ్రౌజర్!!!

Epic browser ఇది మన బ్రౌజర్ ... భారతదేశపు మొదటి వెబ్ బ్రౌజర్ !!! భారతీయులకోసం ప్రత్యేకంగా రూపొందించిన Mozilla ఆధారిత వెబ్ బ్రౌజర్. బెంగళూర్ కి చెందిన Hidden Reflex వారు ఈ Epic ని రూపొందించారు.

ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు -2

భాగవతం,మహాభారతం



  1. మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్
  2. నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్
  3. జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్
  4. మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్

sumathi satakam


1. కవి మొదటి వాక్యము

శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగాఁ
ధారళమైన నీతులు
నోరూరగఁ జవులుబుట్ట నుడివెద సుమతీ.

తా: ఓ మంచి గుణాలు గలవాడా! శ్రీ రామచంద్రుని యొక్క దయ చేత,ప్రజలందరు ఆశ్చర్యపడునట్లు ప్రఖ్యాతమైన ధారళమైన నీతులను,వినువారికి నోరు నుండి నీళ్ళు ఊరునట్టి విదముగా తెలిపెదను.

Tuesday, September 21, 2010

poem written by Devulapalli Ramanuja Rao from his essay మా ఊరు ఓరుగల్లు, from the book he wrote called పచ్చ తోరణం

కాబోలు నియ్యది కాకతీయులొకప్డు
కరకు నెత్తుట కత్తికడుగు చోటు

nenu saitham(Sri Sri)

నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్చనలుపోతానూ..
నేను సైతం భువన ఘొషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తానూ…

వేదంలా ఘోషించే గోదావరీ

వేదంలా ఘోషించే గోదావరీ
ఆమరదామంలా శొభిల్లె రాజమహేంద్రీ
శతాబ్దాల చరిత గల సుందర నగరం
గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి(sirivennala)

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం

ఓ మహాత్మా ఓ మహర్షి(Sri Sri)

ఏది చీకటి ఏది వెలుతురు
ఏది జీవితమేది మ్రుత్యువు
ఏది పున్యం ఏది పాపం

చాటువులు(chatuvulu)

అప్పట్లో రాయల సీమలో వర్షాలు లేక పోతే, శ్రీ నాధుడు శివునిపై రాసిన పద్యం --

"సిరి గల వానికి చెల్లును,
తరుణులు పదియారు వేలు తగ పెండ్లాడన్,
తిరిపెమునకిద్దరాండ్రా,
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్.."

Monday, September 20, 2010

తొలి కావ్యం

సంస్కృతంలో కావ్యానికి చెప్పబడిన లక్షణాలనే తెలుగుకి అన్వయించి కావ్యం, ప్రబంధం అన్నారు. ఆ తర్వాత ప్రబంధం వేరుగా ప్రత్యేక లక్షణాలు చెప్పారు. నన్నయ రాసిన మహాభారతాన్ని కొంతమంది కావ్యేతిహాసమంటే,

Sunday, September 19, 2010

ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయులు

ఇతరమతాల బారినుండి హిందూ మత సంరక్షణకు కన్యాకుమారి నుండి కటకము వరకు రాయలసీమలో తెలుగుజాతి వీరులను నిల్పిన విజయనగర సామ్రాజ్యపు పట్టుకొమ్మలు కంచి, చంద్రగిరి, పెనుగొండ, గుత్తి రాయదుర్గము, పంపానగర విజయనగరము. ''కంచి'' ఐక్యమత్య విధానంతో శివకంచి విష్ణు కంచి, వేగవతీ నది తీరాన నిల్పిన పుణ్య భూమి.

Saturday, September 18, 2010

తొలి ప్రబంధం

పదహారవ శతాబ్దం నాటి రాయలకాలాన్ని విమర్శకులు ప్రక్రియాపరంగా ‘ప్రబంధయుగం’ అన్నారు. రాయలకాలంలో వెలువడిన వాటికే ప్రబంధాలనే పేరు వచ్చింది. రాయలు రాసిన ‘ఆముక్తమాల్యద’ కూడా ప్రబంధం అన్నారు. నిజానికి ఇది ఆధునిక విమర్శకుల సృష్టితప్ప వేరొకటి కాదు. తిక్కన తన భారతాన్ని ‘ప్రబంధమండలి’ అన్నాడు. ఎఱ్ఱనకు ‘ప్రబంధపరమేశ్వరుడు’ అనే బిరుదు వుంది. అవచి తిప్పయసెట్టి శైవ ప్రబంధం రాయమంటే

తమిళ తంబికి వణక్కం

'త్రిలింగ దేశం మనదేనోయ్‌ తెలుంగులంటే మనమేనోయ్‌'' సుమారు డెబ్బయి సంవత్సరాలకు పూర్వం పైడిపాటి సుబ్బరామశాస్త్రి వ్రాసిన పాటనా చెవులలో ఇప్పటికీ మారుమోగుతున్నది. తెలుగు భాష జాతి అత్యంత ప్రాచీనమైనది. కాని ఏం ప్రయోజనం?

Friday, September 17, 2010

తొలి శతకం(first satakam in telugu)

తెలుగులో తొలి శతకమేది? అనే ప్రశ్నకి సమాధానం చెప్పడం కష్టమే. కొందరు మల్లికార్జున పండితారాధ్యుడనే శివ కవి రాసిన ‘శివతత్త్వసారము’ తొలి శతకమన్నారు. అజా, రుద్రా, శివా అనే మకుటాలతో 489 పద్యాలుగల

Thursday, September 16, 2010

తొలి వచనములు(first prose in telugu)

ప్రథమాంధ్ర వచన వాజ్ఞయాచార్యుడిగా ప్రథమాంధ్ర వచన నిర్మాతగా పేరొందిన కృష్ణమాచార్యులు కాలాన్ని కొందరు క్రీ.శ.1290 ప్రాంతంగా, మరికొందరు 1260-65 ప్రాంతంగా భావించారు. ఆంధ్ర రచయితల సంఘం పక్షాన ఆచార్య ఎం.కులశేఖరరావుగారు ‘సింహగిరి వచనములు’ పేర

తొలి వ్యాకరణ గ్రంథం(first book on telugu grammar)

తెలుగులో కంటే ముందుగా తమిళ, కన్నడ భాషలలో వ్యాకరణాల రాయబడ్డాయి. పదకొండవ శతాబ్దం వరకు తెలుగు భాషకి వ్యాకరణాలు వెలువడలేదు (ఎవరన్నా రాసినా దొరకలేదు). మన వాజ్ఞ్మయపు తొలినాళ్లలో అన్నీ వివాదాస్పదమైనవే. అలాగే ‘ఆంధ్రశబ్ద చింతామణి’ అనే వ్యాకరణ గ్రంథ

Wednesday, September 15, 2010

ఆది ద్రావిడం అరవల సొమ్మా? Does Adidravidam belong only to Tamils?

రాయీ, మన్నూ పుట్టకముందే పుట్టిన ప్రపంచపు తొలిభాష తమిళ్‌. ఇది ప్రపంచ భాషలన్నింటిలోకీ అత్యంత ప్రాచీనమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి నిస్సంకోచంగా ప్రభుత్వ ఉత్తర్వులలో ప్రకటించారు. అదే మాటను ప్రపంచ తమిళ మహాసభల సందర్భంగా ఉద్ఘోషించి చెప్పారు. ఇది తమిళ తంబిల భేషజానికి ఎన్ని తరాలు మారినా మారని వారి అలవి మీరిన

తెలుగు వెలుగులేవి?(telugu velugulevi?)

 ఏభాషా అంత తేలికగా వాగ్వ్యవహారం నుంచి జారిపోదు. సువ్యవస్థితమైన భాష ఏర్పడడానికి ఎంతకాలం పడుతుందో, అంతకంటే ఎక్కువ కాలమే జన వ్యవహారం నుంచి భాష మృగ్యమైపోవడానికి పడుతుంది. ఈ దశలో పతనం కూడా అంచెలంచెలుగానే ఉంటుంది. నేడు మన తెలుగు భాష దుస్థితికి

తెలుగులో తొలి రచన

సంస్కృతంలో తొలి ఇతిహాసం రామాయణమైతే తెలుగులో తొలి ఇతిహాసం భారతం. నన్నయ రాసిన ఆంధ్ర మహాభారతమే తెలుగులో తొలి ఇతిహాసం. నన్నయకి ‘ఆదికవి’ అనే బిరుదు అనంతరకాలంలో వచ్చిందే. మారన ‘‘ఆంధ్ర కవితా గురుడు’’ అన్నాడు. తిక్కన ‘‘ఆంధ్ర కవిత్వ విశారదుడు’’

తెలుగులో తోలి రామాయణం (First ramayana in telugu)

గోన బుద్ధారెడ్డి రచించిన ‘రంగనాథ రామాయణం’ తెలుగులో తొలి రామాయణం. ఇతడు క్రీశ 1210 ప్రాంతంలో జన్మించినవాడుగా చె ప్తారు. ఈ రంగనాథ రామాయణం కొంతకాలం ఎవరు రాసారు? అనే అంశంపై

అంకెలు , సంఖ్యలు అర్థ గర్భితమైన శ్లోకాలు (How our ancestors gave us the knowledge about the number system?)

పెద్ద పెద్ద సంఖ్యలంటే మనవాళ్ళకి బొత్తిగా భయం లేదని గతంలో ఒకసారి చెప్పేను. పెద్ద పెద్ద సంఖ్యలని కుదించి చిన్న చిన్న మాటలలో చెప్పడంలో మన పూర్వీకులు దిట్టలు. సంఖ్యలని చిన్న చిన్న మాటలలో కుదించి చెప్పవలసిన అవసరం ఎందుకొచ్చిందో ముందు చెబుతాను.

Tuesday, September 14, 2010

Sneha geetham kavitha

ప్రకృతి ఆహ్లాదంతో పరవశించే నా హృదయం,
*పరుగులు తీస్తుంది చూడాలని నీ చిన్న రూపం,
కోకిలమ్మ సరాగాలతో కమనీయమైన నా శోత్రం
*వినాలంటుంది నీ తియ్యని రూపం

తెలుగు సాహిత్యం దశలు(ages in telugu literature)

ప్రాచీన సాహిత్యం తెలుగు  అమరావతి స్తూపంలో గల '' నాగబు'' శబ్దం తో ప్రారంభం అయ్యింది..నన్నయ్య ముందున్న కాలాన్ని " ప్రాజ్నన్నయ యుగం" అని అంటారు.      అంటే పదకొండవ శతాబ్దికి ముందున్న కాలం నుండి తెలుగు ఉంది..తెలుగు భాషా సాహిత్యాలను తెలుసుకోవడానికి ప్రధానంగా శాసనాలే ఆధారాలు...ఇతర భాషల్లో వెలువడిన గ్రందాలవల్ల, సాహిత్యం వల్ల కూడా అన్నాతి వాఘ్మయ స్ధితిగతులు తెలుసుకోవచ్చు..ప్రాకృత భాషలో హాలుని గాదా సప్తశతిలో తెలుగు మాటలున్నాయి.. తెలుగు భాషలో పాటలున్నట్లు తెలియజేయబడింది...కావున మనకు తెలిసినంతవరకు క్రీ.శ. ఒకటవ శతాబ్ది నాటికే తెలుగు వాంగ్మయం  ఉందన్న మాట. శాతవాహనులు, ఇక్ష్వాకులు, మొదలైన వారు శాసనాలను సంస్కృత ప్రాక్రుతాలలో వేయించినా ఉర్ల పేర్లు, మనుషుల పేర్లు, మొదలైనవి తెలుగువారిని గుర్తుచేస్తాయి.. రేనాటి చోళులు, తూర్పు చాళుక్యులు మదలైనవారు తెలుగులో శాసనాలను వేయించారు. .మొత్తం మీద నన్నయకు ముందు తెలుగు భాషా సాహిత్యాలున్నాయి.. శాసన కవిత వాడుకలో ఉండేది.. తెలుగు భాష జనవ్యవహారంలో బాగా ఉంది. క్రీ. పూ..200 నుండి 6 వ శతాబ్దం దాకా ప్రారంభ దశ గాను, 6నుండి 9  వరకు వికాస దశ గాను 9  నుండి సాహిత్య వికాస దశ గాను చెప్పవచ్చు..
ఇక ఆధునిక సాహిత్యం విషయానికి వస్తే నవ్య సాహిత్యం, అభినవ సాహిత్యం, అనికూడా అంటారు.  కానీ ఆధునికం అనే పదమే స్థిరపడిపోయింది.. అయితే ఆధునికం కాలానిదా? లేక స్వభావానిదా? అనే చర్చకు వస్తే ఆధునిక భావాలు కలిగినదే ఆధునిక కవిత్వం అవుతుందని, అంటే ఆధునిక కాలంలో వెలువడినంతమాత్రాన పురాణాలు, పద్యకావ్యాలు లాంటివి ఆధునిక సాహిత్యం ఎలా అవుతాయి.? అని ప్రశ్నిస్తున్నారు.. అందుకే "ఆధునిక" అనే పదం కాలానికే కాకుండా స్వభావానికి కూడా వాడుతున్నాము.. 19 వ శతాబ్దం నుండి వెలువడిన సాహిత్యమే ఆధునిక సాహిత్యం అని చెప్పుకోవచ్చు..
రాను రాను సృష్టి క్రమంలో సృష్ట్యాది కాల నిర్ణయంలో భిన్న రాజచరిత్ర నిర్ణయంలో సంఘ ధర్మ నీతులలో ఆర్ధిక రాజకీయాలలో, సారస్వత పదాలలో ఒక విశిష్టమైన సంస్కారంతో కూడిన సిద్దాంతాల మీద నుండి మన జాతి నడిచింది.. ఇప్పటికి మనపై ఆంగ్లేయులు ప్రభావం ఉండటం చేత మన భాష పట్ల మనకు అభిమానం పోయింది. అయినా మన సాహిత్యానికి ఎందరో స్పూర్తి దాతలు, ఎందరెందరో కవిపండితులు,  రచయిత, రచయిత్రులు తమ అత్యున్నత సాహిత్యంతో సమాజ సేవ చేస్తూనే ఉన్నారు. వారందరినీ ఆదికవి నన్నయ్య నుండి... నేటి నారాయణ  రెడ్డి గారి  వరకు తెలుగు సాహిత్యం.. విరాజిల్లుతునే ఉంది.. తేనెలూరు తెలుగు భాషకు ఎల్లలు లేవు క్రీ.పూ 200 నుండి ఆరవ శతాబ్దం  వరకు ప్రారంబ దశగాను తొమ్మిది  నుండి సాహిత్య దశ గాను చెప్పవచ్చు '

Nee gnapakam kavitha

వేకువఝామున పిల్ల తెమ్మెర నువ్వే
నా ముంగిలి తాకే తొలి సూర్యకిరణం నువ్వే
నా కిటికిలోంచి తొంగిచూసే మల్లె పరిమళం నువ్వే
గోధూళి వేళ ఆకాశపు అరుణిమ నువ్వే
రాత్రంతా నన్నల్లరి పెట్టే వెన్నెల నువ్వే
కానీ నేనే
నీకేమీ కాను....

Monday, September 13, 2010

తెలుగు భాసః ప్రాచీనత

కన్నడకె హోరాడు కన్నడద కంద
కన్నడవ కాపాడు నన్న ఆనంద
జోగుళద హరకెయిదు మరెయదిరు చిన్న
మరెతెయాదరె నీను మరెతంతె నన్న
మాతృమూర్తిని, మాతృభూమిని, మాతృభాషను అభిమానించడంలో ఒక అనిర్వచనీయమైన ఆనందం ఉందని అందరం ఒప్పుకుంటాం. అయితే “మాతృభాష గురించి మరచిపోతే కన్నతల్లిని మరచిపోయినట్టే”నని చెబుతున్న పై కన్నడ జోలపాట వంటి కవితలు మన తెలుగులో తక్కువేనని చెప్పవచ్చు. అందుకు సమాధానంగా మన భాష పట్ల మనకు అభిమానమే కాని తమిళ, కన్నడ సోదరులవలె దురభిమానం లేదని నిగర్వంగా చెప్పుకుంటాం. కానీ, తెలుగు ప్రాచీనతకు సంబంధించి గత రెండుసంవత్సరాలుగా వస్తున్న అశాస్త్రీయ సిద్ధాంతాలు, వాటికి తెలుగు పత్రికల్లోనూ, సాహితీ సదస్సుల్లోనూ, తెలుగు మహాసభల్లోనూ కలుగుతున్న ప్రచారం, ఆదరణ చూస్తే భాషా దురభిమానంలో మనం మన పక్క రాష్ట్రాల వారిని మించిపోతున్నట్టనిపిస్తుంది. ఎంతో అనుభవజ్ఞులైన తెలుగు సాహితీ వేత్తలు, విశ్వవిద్యాలయాధికారులు కూడా ఈ రకమైన సిద్ధాంతాలకు వత్తాసు పలకడంతో ఈ వాదాల అశాస్త్రీయతను ఎత్తిచూపిస్తూ మరోసారి రాయడంలో తప్పులేదనిపించింది.
తెలుగు వారి గతాన్ని సుమేరియన్ల నుండి అమెరికన్ల వరకు ఆపాదిస్తూ సిద్ధాంతాలు చేస్తున్న వారిలో ప్రముఖులు: సంయుక్త కూనయ్య, జీ. వీ. పూర్ణచంద్ గార్లు. అర్ధ సత్యాలను, అభూత కల్పనలను అత్యంత తాజా పరిశోధనల సారాంశంగా, తెలుగు ప్రాచీనతను నిరూపించే సిద్ధాంతాలుగా ఇంటర్‌నెట్ లోనూ, తెలుగు పత్రికల్లోను కనిపించే వీరి రచనలు శాస్త్ర దృష్టితో పరిశీలించేవారికి నిరాశనే మిగిలిస్తాయని చెప్పాలి. తెలుగు భాషను హరప్పా, ఈజిప్టు, సుమేరియన్‌, ఈలమ్‌ నాగరికతల భాషలతో పాటు ప్రాచీన అమెరికన్‌ రెడిండియన్ల భాషల తోనూ, ఇటలీలో ఎట్రుస్కన్‌, కేనరీ దీవుల్లో గువాంచీ, బ్రిటన్‌లో కెల్టులు, క్రేట్‌లో మినోవన్లు, లెబనాన్‌లో ఫినీషియన్లు, మారిటేనియాలో బర్బరుల భాషలతోనూ ముడిపెడుతూ సాగే రచనా ధోరణి తులనాత్మక భాషాశాస్త్రంతో కొద్దిగా పరిచయం ఉన్న వారెవరికైనా ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ వ్యాసాల్లో అమెరికా అంటే ‘ఆర్‌-మెరక’ (మెరకనేల) అంటూ తెలుగు వ్యుత్పత్తిని ఇవ్వజూపడం, ఆఫ్రికాలోని‌ మండింగ్‌ భాషలలో ‘నత్తరు’ అనే పదం తెలగు ‘ నెత్తురు’ కు సంబంధించిందని వాదించడం నిజంగానే నవ్వు తెప్పించే విషయాలు.
తలలు పండిన భాషావేత్తలు కూడా వ్యాఖ్యానించడానికి సందేహించే మహా భాషాకుటుంబ (Super linguistic family) సిద్ధాంతాలకు భాషాశాస్త్రాన్ని ఇప్పుడిప్పుడే అభ్యసిస్తున్నవారు దూరంగా ఉంటేనే మంచిది. కానీ ఊహాత్మకంగా (speculative) ప్రతిపాదింపబడిన కొన్ని మహా భాషాకుటుంబ సిద్ధాంతాలను పూర్ణచంద్ వంటివారు పూర్తిగా నిరూపింపబడిన సత్యాలుగా ఉటంకించడమే కాక , వాటికి తమ, తమ కల్పనలను జోడించి తమకు తోచిన విధంగా చరిత్రలు రాయబూనడం దుస్సాహసమే అవుతుంది. ఉదాహరణకు, పూర్ణచంద్ విశేషంగా ప్రస్తావించే మాక్‌ఆల్పిన్ ఈలమో-ద్రావిడ మహాకుటుంబ సిద్ధాంతంలోని తీవ్రమైన లోపాలను జ్వలబిల్ , కృష్ణమూర్తి వంటి ప్రముఖ భాషావేత్తలు ఎత్తిచూపారు[1]. పూర్ణచంద్ గారే పేర్కొన్న మరో భాషావేత్త వక్లావ్ బ్లేజక్ (Václav Blažek) కూడా ఈలమో-ద్రావిడ మహాకుటుంబ సిద్ధాంతాన్ని తోసిరాజని, ఈలమో-ఆఫ్రోఏషియాటిక్ మహాకుటుంబ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు[2] . అయితే, ఈ రెండు మహాకుటుంబ సిద్ధాంతాలను అంగీకరించే భాషావేత్తల కంటే విభేదించే భాషావేత్తలే ఎక్కువ[3]. అలాగే జపాన్ భాషకు , తమిళ భాషకు సంబంధాన్ని చూపిస్తూ సుసుము ఓనో (Susumu Ohno) తయారు చేసిన సిద్ధాంతాన్ని వేరే భాషావేత్తలెవరూ పెద్దగా అంగీకరించలేదు[4]. చారిత్రక శకానికి పూర్వమైన (Prehistoric) ఏ సంబంధానికైనా ఆధారాలు తమిళ ధాతువులతో కాక మూల-ద్రావిడ (Proto-Dravidian) ధాతువులతో నిర్మించాలని వారి ప్రధాన ఆక్షేపణ. ప్రపంచంలోని ఇతర భాషా కుటుంబాలకు, సూటిగా తెలుగు భాషతో సంబంధం అంటగడుతూ సంయుక్త కూనయ్య, పూర్ణచంద్ వంటి వారు చేసే సిద్ధాంతాలకు కూడా సరిగ్గా ఇదే అభ్యంతరం వర్తిస్తుందని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.
చిత్తశుద్ధితో తులనాత్మక భాషాశాస్త్రాన్ని అధ్యయనం చేసి, శాస్త్ర ప్రమాణాల గురించి కొంత శిక్షణ పొందడం ద్వారా ఈ రకమైన అపరిపక్వమైన వాదాల ఆకర్షణ నుండి బయటపడవచ్చునని నాకనిపిస్తుంది. భాషాశాస్త్రంలోని మౌలికాంశాలను కొంతైనా లోతుగా అభ్యసించిన వారికి సోదర పద (cognate) నిరూపణకు ‘శబ్ద సామ్యం ‘ కన్నా ధ్వని సూత్ర (sound laws) శీలమైన ‘ధ్వన్యనుగుణ్యత’ (sound correspondence) ముఖ్యమని తెలుస్తుంది; గత రెండు శతాబ్దాలుగా భాషాసంబంధ నిరూపణకు అత్యంత కీలకమైన ఉపకరణంగా వాడుతున్న ‘తులనాత్మక పద్ధతి’ (Comparative Method) గురించి కొంతైనా అవగాహన కలుగుతుంది. భాషాశాస్త్రాన్ని ఒక విజ్ఞానరంగంగా అధ్యయనం చేయడం ద్వారా శాస్త్ర విమర్శకు నిలువలేని వాదాలను పసిగట్టగలిగే నిపుణత కొంత చేకూరుతుంది. సంక్లిష్టమైన పూర్వ చరిత్రల పునర్నిర్మాణానికి చారిత్రక, భాషాత్మక ఆధారాలతో ఆర్కియాలజీ, ఆంత్రోపాలజీ, జెనెటిక్స్ మొదలైన ఇతర విజ్ఞాన శాస్త్ర ఆధారాలను అనుసంధానం చేయగలిగే పరిశోధనలు మాత్రమే చిక్కుముడులు విప్పగలవని అర్థమౌతుంది.
పూర్ణచంద్ తదితరులకు తెలుగు ప్రాచీనత గురించి ఉన్నటువంటి తపనా, ఆసక్తీ మెచ్చుకోదగ్గవే అయినప్పటికీ వారు ఉదాహరించే విషయాలు నిష్పాక్షిక శాస్త్రీయ పరిశీలనకు తట్టుకోగలవిగా ఉన్నప్పుడే వారి ప్రయత్నాలు సార్థకం కాగలవు. సహేతుకమైన సిద్ధాంతాలతో, శాస్త్రబద్ధమైన ఆధారాలతోనే తెలుగు భాష మూలాలను వెతికే ప్రయత్నాలకు ప్రోత్సాహం ఇవ్వడం తెలుగు భాషాభిమానులుగా మన అందరి కర్తవ్యం అనేది మరచిపోరాదు.

తెలుగు బాష వయసు ఎంత? (age of telugu language)

భాషను స్త్రీతో పోలుస్తారు. కానీ ఆడవాళ్ళ వయస్సు మొగవాడి జీతం అడగకూడదంటారు. ఆ రకంగా ఇది అడగకూడని ప్రశ్నే. అంతేకాక ఒక భాష ఎప్పుడు పుట్టింది అన్నది చాలా అసంబద్ధమైన (absurd) ప్రశ్న అని కొంతమంది భాషావేత్తలు అంటారు. “ప్రవాహినీ భాషా” అన్నట్లు భాష చరిత్రగతిలో మార్పులు చెందుతూ కొత్త కొత్త రూపాలు సంతరించుకొంటుందనీ, ఏ మార్పు ఎప్పుడు వచ్చింది అని అడగటం మాత్రమే సబబైన ప్రశ్న అని వారి వాదన. ఇటువంటి పరిశుద్ధ(Purist) వాదాన్ని పక్కనబెడితే, తెలుగు ఒక ప్రత్యేక భాషగా ఒక నియతస్థితిని, స్వయంప్రతిపత్తిని ఎప్పుడు ఏర్పరుచుకుందో ఆ కాలనిర్ణయం గురించి ప్రస్తుత భాషా పరిశోధకుల ఊహాగానాలను చర్చించడం ఈ వ్యాసం ముఖ్యోద్దేశ్యం.
భారతదేశంలోని భాషల చరిత్ర, భారతదేశపు పూర్వ చరిత్ర చాలా కాలంగా వివాదస్పదమైన అంశంగా మారింది. ఈ అంశంపై వచ్చిన వాదప్రతివాదాలు రాజకీయ, సాంఘిక ఉద్యమాలకు, భాషోన్మాదాలకు దారి తీసాయి. తమిళనాడులో ప్రారంభమైన ద్రావిడ ఉద్యమం ఇందుకు ఒక ఉదాహరణ. కాని ఆర్య, ద్రావిడ పదాలు భాషా కుటుంబాలని సూచించే పదాలే గాని, రెండు వేర్వేరు జాతులని సూచించే పదాలు కావని శాస్త్రవేత్తల నమ్మకం. జన్యుశాస్త్రంలో సాధించిన అభివృద్ధి ఆధారంగా ఈ దశాబ్దంలో జరుపుతున్న పరిశోధనలు భారతదేశంలో ఆర్య, ద్రావిడ అని రెండు విభిన్నమైన జాతులు లేవన్న శాస్త్రజ్ఞుల అభిప్రాయాలని ధ్రువపరుస్తున్నవి [4, 6].
ఇంతటి వివాదస్పదమైన అంశం గురించి రాయటానికి నాకే భాషాశాస్త్రంలో గానీ జన్యుశాస్త్రంలో గానీ పట్టభద్రత లేదు. నేను చదువుకున్న చదువుకు చేసే ప్రోగ్రామింగ్‌ పనికి, భాషా చరిత్రతో ఎటువంటి సంబంధం లేదు. నాకున్న అర్హతల్లా ప్రఖ్యాతి గాంచిన భాషావేత్తలైన భద్రిరాజు, ఎమెనో, స్జోబెర్గ్‌ తదితరులు రాసిన కొన్ని పుస్తకాలు, పేపర్లు గత పదేండ్లుగా చదవటం మాత్రమే.
కానీ తెలుగు భాష పుట్టుపూర్వోత్తరాల గురించిన కనీస వివరాలు చాలామంది తెలుగువాళ్ళకే తెలిసినట్టులేదు. ఈ మధ్య ఇండియాలో ఒక టీవీ ప్రోగ్రాంలో ఎక్కువమంది మాట్లాడే ద్రావిడ భాష ఏది అన్న ప్రశ్నకు సమాధానం “తెలుగు” అంటే మా అన్నయ్య ఆఫీసులో చాలా మంది ఒప్పుకోలేదట. తెలుగు ద్రావిడ భాషే కాదని వారి వాదన. ఇంతే కాక ఈ మధ్య భారతదేశ చరిత్ర గురించి, భారతీయ భాషల గురించి వింత వాదనలు, శాస్త్రవిమర్శకు నిలువలేని సిద్ధాంతాల ప్రచారాలు ఇంటెర్నెట్‌లోనూ బయటా జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రచారాల నేపథ్యంలో తెలుగుభాష గురించి చాలామంది భాషావేత్తలు ఒప్పుకునే వివరాలను నాకు తెలియవచ్చినంత తేటపరచాలని ఈ వ్యాసరచనా సాహసానికి పూనుకున్నాను.

తెలుగు సంస్కృత భవం కాదు

పూర్వకాలం నుండి తెలుగు సంస్కృత జన్యం అన్న అభిప్రాయం ఉందని చాలామంది నమ్మకం. ఇందుకు ఉదాహరణగా “తల్లి సంస్కృతంబు యెల్ల భాషలకు” అన్న కేతన పద్యాన్ని, “జనని సంస్కృతంబు సర్వభాషలకు” అన్న క్రీడాభిరామ పద్యాన్ని చూపిస్తారు. కానీ నిశితంగా చూస్తే నన్నయ్య కాలం నుండి కూడా తెలుగు సంస్కృత భాషల మధ్య అంతరం కవులకు స్పష్టంగా తెలుసునని మనకు తెలుస్తుంది. సంస్కృత ఛందస్సు వేరు, దేశి ఛందస్సు వేరు. సంస్కృత పదాలు వేరు (తత్సమాలు, తద్భవాలు), అచ్చతెలుగు పదాలు వేరు (దేశ్యాలు, గ్రామ్యాలు). తెలుగు సంధులు వేరు, సంస్కృత సంధులు వేరు. తెలుగు పదాన్ని, సంస్కృత పదాన్ని కలిపి రాయకూడదు. రాస్తే దుష్టసమాసం అవుతుంది. దేశి కవిత, మార్గ కవిత అని కవిత్వంలో రెండు భిన్న ధోరణులు ఉండేవని కూడా మనకు తెలుసు. చాలామంది కవులు ఈ రెండు ధోరణులకు మధ్యస్థంగా ఇరు పక్షాలు మెచ్చే రీతిలో కవిత్వం రాస్తున్నామని కూడా చెప్పుకున్నారు (ఉదా: శ్రీనాథుడు, పోతన, కొరవి గోపరాజు, మొల్ల).
పూర్వ కవుల అభిప్రాయం ఏమైనప్పటికీ 19వ శతాబ్దం వచ్చేసరికి తెలుగు సంస్కృత భవమే అన్న నమ్మకం చాలా బలంగా ఉండేది. ఈ నమ్మకాలకు ప్రతికూలంగా తెలుగుకు సంస్కృత ప్రాకృతాలతో జన్య జనక సంబంధం లేదని మొదటిసారి చెప్పిన ఘనత Francis White Ellis (1816) కు దక్కుతుంది. తరువాత ఎల్లిస్‌ పరిశోధనను కొనసాగించిన అలగ్జాండర్‌ క్యాంప్‌బెల్‌ ఇలా అన్నారు:
“It has been generally asserted, and indeed believed, that the Teloogoo has its origin in the language of the vedams … My inquiries have led to opposite conclusion … Teloogoo abounds with Sanskrit words … nevertheless, there is reason to believe that the origin of the two languages is altogether different”
ఎలిస్‌, క్యాంప్‌బెల్ సంగ్రహంగా ప్రతిపాదించిన ఈ సిద్ధాంతానికి సమగ్రాధారాలతో కూలంకష చర్చతో స్థిరత్వాన్ని కల్పించింది బిషప్‌ రాబర్ట్‌ కాల్డ్‌వెల్‌. ఈయన తమిళ, కన్నడ, తెలుగు భాషలతో సహా 12 భాషలు ఒకే భాషా కుటుంబానికి చెందినవని, వాటికి సంస్కృతంతో జన్మ సంబంధం లేదని సశాస్త్రీయంగా నిరూపించాడు. ద్రావిడ భాషా పరిశోధనా పితామహుడిగా ప్రసిద్ధి కెక్కిన కాల్డ్‌వెల్‌ 1856లో రాసిన గ్రంథం “A Comparative grammar of Dravidian Languages” తొలి ద్రావిడ భాషా శాస్త్రజ్ఞుల పాలిటి ప్రమాణ గ్రంథం. తరువాత గత శతాబ్దంలో ఆధునిక శాస్త్ర పద్ధతులలో ద్రావిడభాషా పరిశోధనను జరిపి దానికి శాస్త్రీయతను కూర్చి స్థిరమైన పునాది ఏర్పరచిన వారిలో ముఖ్యులు: ఎం. బి. ఎమెనో, టి. బరో, భద్రిరాజు కృష్ణమూర్తి గార్లు. 2003లో భద్రిరాజు కృష్ణమూర్తి గారు రాసిన “Dravidian Languages” పుస్తకం, గత రెండు శతాబ్దాల్లో ద్రావిడ భాషాధ్యయనంలో సాధించిన అభివృద్ధిని సాధికారకంగా చర్చించి నేటి ప్రమాణ గ్రంథంగా నిలిచిందని చెప్పవచ్చు.

తెలుగు తమిళం నుండి పుట్టలేదు

తెలుగు సంస్కృతం నుండి పుట్టలేదు అంటే ఇది తమిళం నుండో కన్నడ నుండో పుట్టి ఉండాలి అన్న వాదం విన్నాను. తమిళం లో క్రీస్తు పూర్వము 3వ శతాబ్ది నుండి ప్రాచీన సాహిత్యం దొరుకుతుంది. కన్నడం లో ప్రాచీన గ్రంథం “కవిరాజ మార్గ” క్రీస్తు శకం 9వ శతాబ్దంలో రాయబడ్డది. కాబట్టి తెలుగు కన్నడ నుండో తమిళం నుండో పుట్టివుండాలని వీరి తర్కం. తమిళం ప్రాచీన భాషే ఐనా తమిళమే ప్రాచీన లక్షణాలను నిలుపుకొంది అనటం సరి కాదని, కొన్ని విషయాలలో తెలుగు మొదలైన ఇతర భాషలలోనే తమిళంలో లేని ప్రాచీన లక్షణాలు ఉన్నాయని భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం. 1906 లో Linguistic Survey of India లో ద్రావిడ భాషల పరస్పర సాన్నిహిత్యాన్ని గురించి రాస్తూ స్టెన్‌కొనో ఇలా అన్నారు
“Tamil has usually been considered to be the Dravidian language which has preserved most traces of the original form of speech from which all other Dravidian dialects are derived. Some points will be drawn attention to in the ensuing pages where this does not appear to be the case, and in many peculiarities other Dravidian languages such as Telugu have preserved older forms and represent a more ancient state of development. It would therefore be more correct to describe Tamil as a dialect like the other ones, without any special claim to antiquity.”
ఆ రకంగా తమిళ కన్నడ భాషలు తెలుగుకు సోదర భాషలే కాని మాతృకలు కావు. క్రీస్తు పూర్వం నాలుగు, ఐదువేల యేండ్లకు పూర్వం మూల ద్రావిడ భాష ఒకే భాషగా ఉండేదని, అది కాలక్రమాన ఇప్పటి ద్రావిడ భాషలుగా విడిపోయిందని భాషా శాస్త్రజ్ఞులు తులనాత్మక పద్ధతి ద్వారా నిర్ణయించారు.

ద్రావిడ భాషగా పుట్టి సంస్కృత పోషణలో పెరిగిన తెలుగు

తెలుగు ద్రావిడ భాష కాబట్టి సంస్కృత భాషా పదాలు వాడటం మానేసి అచ్చ తెలుగు పదాలే వాడాలని “వార్త” పత్రికలో ఒక వ్యాసం చదివాను. ఈ రకమైన వాదం తెలుగును రెండు మూడు వేల యేండ్లు వెనక్కి తీసుకువెళ్ళాలన్న ప్రయత్నమే. తెలుగు పుట్టినప్పటి నుండి వేలకొద్దీ సంస్కృత, ప్రాకృత పదాలు తెలుగులో వచ్చి చేరాయి. పద నిర్మాణంలోను, వాక్య నిర్మాణం లోనూ తెలుగు ఎన్నో సంస్కృత లక్షణాలను తనలో కలుపుకొంది. తెలుగు కవులందరూ సంస్కృత భాషను క్షుణ్ణంగా అభ్యసించిన వారే కాబట్టి ఆ భాషా ప్రభావం తెలుగు సాహిత్యం పై స్పష్టంగా కనిపిస్తుంది. ద్రావిడ భాషలో లేని Passive Voice (బడు ప్రయోగం), Relative Pronouns తెలుగులో వచ్చి చేరటం సంస్కృత ప్రభావాన్నే చూపిస్తుంది. పోతన రాసిన “ఎవ్వనిచే జనించు జగము … వానిన్‌ … శరణంబు వేడెదన్‌” అన్న పద్యము సంస్కృతంలో ఆలోచించి తెలుగులో రాసిన పద్యమని కూడా చెప్పవచ్చు.

ద్రావిడ భాషల వర్గీకరణ

రాబర్ట్‌ కాల్డ్‌వెల్‌ రాసిన Comparative Dravidian Grammar గ్రంథంలోనే తమిళ, మలయాళ, కన్నడ భాషలకు దగ్గరి సంబంధం ఉందని, తెలుగు తమిళ భాషలకు మధ్య చాలా వ్యత్యాసం ఉందనీ సూచించారు. 1906లో స్టెన్‌కొనో ద్రావిడ భాషలని తమిళ సముదాయం, తెలుగు సముదాయం అని రెండుగా విభజించారు. మూల ద్రావిడ భాష మొదట మూడు ఉపకుటుంబాలు గా చీలిందని ఇప్పుడు పండితులంతా అంగీకరిస్తున్నారు. 1975లో భద్రిరాజు కృష్ణమూర్తి గారు, తెలుగు-కువి-గోండీ భాషలను దక్షిణ-మధ్య ద్రావిడ భాషలుగా మూల దక్షిణ ద్రావిడం నుండి విడివడిన మరో ఉపశాఖకు చెందిందన్న కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ మధ్య ఆయన ద్రావిడ భాషలపై ప్రచురించిన గ్రంథరాజంలో తెలుగు దక్షిణ మధ్య ద్రావిడ ఉప కుటుంబానికి చెందిందని సాక్ష్యాధారాలతో నిరూపించారు. ఈ పుస్తకంలో 26 ద్రావిడ భాషలను ఇలా విభజించారు:


Classification of Dravidian Languages

తెలుగు భాష ఎప్పుడు పుట్టింది?

మొట్టమొదటి తెలుగు శాసనాలు

తెలుగు మాట కనిపించే మొట్ట మొదటి శాసనం క్రీస్తు శకం 200కి చెందినది. బ్రహ్మీ లిపిలో ఉన్న ఈ శాసనం గుంటూరు‌ జిల్లా అమరావతిలో దొరికింది. అంతకు పూర్వం అశోకుడు, బౌద్ధ మత ప్రచారానికి తన దూతలను ఆంధ్రదేశానికి పంపినట్లు అశోకుడి కాలం నాటి శాసనాల ద్వారా తెలుస్తోంది. పూర్తిగా తెలుగు భాషలో రాసిన శాసనాలు మనకు క్రీస్తు శకం ఆరవ శతాబ్దినుండి దొరుకుతున్నాయి. వీటిలో కడప జిల్లా ఎర్రగుడిపాడు (క్రీశ 575-600), కలమళ్ళ (క్రీశ 576-600) లో దొరికిన శాసనాలు మొట్ట మొదటివి. ఆరో శతాబ్దికి ముందు ఆంధ్ర ప్రాంతంలో శాసనాలు సంస్కృత ప్రాకృత భాషలలో వేసేవారు కానీ వాటిలో ఉన్న ఊళ్ళ పేర్లు, మనుష్యుల పేర్లు తెలుగువే. ఈ శాసనాలలో ఉన్న ఏళూరు, తాన్ఱికొన్ఱ (తాటికొండ) మొదలైన ఊళ్ళ పేర్లు ఆ రోజులలో సామాన్య ప్రజలు తెలుగే మాట్లాడే వారని నిరూపిస్తుంది.

ప్రాచీన కావ్యాలలో ఆంధ్ర/తెలుగు ప్రస్తావన

రామాయణంలో సుగ్రీవుడు సీతాదేవి ఉనికిని గూర్చి వెతుకవలసిన స్థలాలను పేర్కొనే సందర్భంలో వరుసగా దండకారణ్యం, గోదావరీ నది, తరువాత, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య దేశాలున్నట్టు చెప్పాడు. ధర్మరాజు రాజసూయం చేసే ముందు దక్షిణ దిగ్విజయ యాత్రకు సహదేవుని పంపినట్లు అతడు పాండ్యులు, ద్రవిడులతో పాటు ఆంధ్రులను, కళింగులను, ఓఢ్రులను జయించినట్లు భారతంలో ఉంది. బౌద్ధ సారస్వతంలో చోళరఠ్ఠం, కళింగరఠ్ఠం, ద్రమిళరఠ్ఠం తో పాటు గోదావరినదికి ఇరు వైపుల అళక, ముళక దేశాలున్నట్లు, ఇవి రెండు అంధక రాష్ట్రాలని “సుత్తనిపాత” గ్రంథంలో ఉంది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో మన దేశానికి వచ్చిన గ్రీక్‌ రాయబారి మెగస్తనీస్‌ మౌర్యుల తరువాత ఎన్నదగిన జాతి ఆంధ్ర జాతియని, వారి రాజు మిక్కిలి బలవంతుడని అతనికి 32కోటలున్నాయని పేర్కొన్నాడు.
ఆంధ్ర జాతి ప్రస్తావన మొట్టమొదటి సారి క్రీస్తు పూర్వం 7వ శతాబ్దానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో కనబడుతుంది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దికి చెందిన భరతుని నాట్యశాస్త్రంలో కూడా ఆంధ్ర భాషా ప్రస్తావన మనకు కనిపిస్తుంది. నాటకాలలో సంస్కృత ప్రాకృతాలే కాక సామాన్య ప్రజలు మాట్లాడే భాషలను వాడవచ్చని చెబుతూ, శకార, ఆభీర, చండాల, శబర, ద్రమిళ, ఆంధ్ర జాతుల భాషలను కూడా వాడవచ్చని ఇందులో ఉంది. ఐతే ఆంధ్ర రాజులు, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర జాతి అన్న పదాలలో ఆంధ్ర శబ్దం తెలుగుకు పర్యాయపదంగా తీసుకుంటే క్రీస్తు పూర్వం 7వ శతాబ్దికి ముందుగానే ఆంధ్ర/తెలుగు ప్రత్యేక జాతిగా గుర్తింపబడిందని చెప్పవచ్చు.

భాషా శాస్త్ర పరంగా తెలుగు కాలనిర్ణయం

తమిళంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండీ సాహిత్యం లభిస్తోంది. తమిళం లోనూ కన్నడలోనూ తాలవ్యీకరణ (palatalization) లో వ్యత్యాసం కనబడుతోంది కాబట్టి, అవి రెండు కనీసం మూడు నాలుగు వందల యేండ్ల ముందుగా విడివడి ఉండాలి. ఆ రకంగా పూర్వ-తమిళం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ప్రత్యేక భాషగా ఏర్పడి ఉండవచ్చు. కానీ దక్షిణ ద్రావిడ భాషలకూ, దక్షిణ-మధ్య ద్రావిడ భాషలకూ శబ్ద నిర్మాణంలోనూ, వాక్య నిర్మాణంలోనూ అనేక వ్యత్యాసాలు కనిపిస్తాయి. దక్షిణ ద్రావిడ భాషలైన తమిళ‌-కన్నడ లతో పోలిస్తే తెలుగు-కువి-గోండీ లలో కనిపించే వ్యత్యాసాలో కొన్ని[1,3,5]:
  1. వర్ణవ్యత్యయం (metathesis): తెలుగు-కువి-గోండి భాషలలో మూల ద్రావిడ ధాతువులోని అచ్చు తరువాతి హల్లు పరస్పరం స్థానం మార్చుకుంటాయి. (ఉదా: వాడు < *అవన్ఱు, వీడు <*ఇవన్ఱు, రోలు < ఒరళ్ <*ఉరళ్)
  2. తెలుగులో బహువచన ప్రత్యయం- లు. తమిళాది దక్షిణ భాషల్లో ఇది -కళ్‌, -గళు.
  3. క్త్వార్థక క్రియలు తమిళాదుల్లో -తు -ఇ చేరటం వల్ల ఏర్పడుతాయి. తెలుగు-కువి-గోండి భాషలలో -చి, -సి చేరటం వల్ల ఏర్పడుతాయి. ఉదా: వచ్చి, చేసి, తెచ్చి, నిలిచి వరుసగా తమిళంలో వన్దు , కెయ్దు, తన్దు, నిన్ఱు.
పైన పేర్కొన్న లక్షణాలన్నీ దక్షిణ మధ్య ద్రావిడ భాషలన్నిటిలో ఉండి దక్షిణ ద్రావిడ భాషలో లేనివి. అంటే ఈ మార్పులన్నీ తెలుగు-కువి-గోండి ఒకే భాషగా కలిసి ఉన్న రోజులలో మూల దక్షిణ ద్రావిడ భాషనుండి విడిపోయిన తరువాత వచ్చిన మార్పులన్న మాట. అన్ని ముఖ్యమైన మార్పులు రావటానికి కనీసం 400-500 సంవత్సరాలు పట్టవచ్చు. అంటే తెలుగు-కువి-గోండి భాషలు దక్షిణ మధ్య ద్రావిడ ఉప శాఖగా క్రీస్తు పూర్వం 1100 సంవత్సరంలో మూల దక్షిణ ద్రావిడం నుండి విడిపోవచ్చు. ఇదే నిజమైతే క్రీస్తు పూర్వం 700-600 వరకే తెలుగు ఒక ప్రత్యేక భాషగా స్వయంప్రతిపత్తిని కలిగి ఉండవచ్చునని మనం ఊహించవచ్చు[1]. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణం ఆంధ్ర జాతిని ప్రత్యేక జాతిగా పేర్కొనడం ఈ లెక్కతో సరిపోతుంది కూడా!
ఈ రకమైన కాలనిర్ణయం సాపేక్ష కాలమానాల (relative chronology) మీద ఆధారపడ్డదే కానీ పద, ధాతు వ్యాప్తి గణాంకాల (lexicostatistics) మీద ఆధారపడ్డది కాదు. ద్రావిడ భాషల పూర్వచరిత్ర పై ఇంకా పరిశోధనలు ఇతోధికంగా జరిగితే గాని తెలుగు భాషా జనన కాలనిర్ణయాన్ని నిష్కర్షగా చెప్పలేం.

Telugu kavithalu

Nuvve telugu kavitha


kanulu musi teriche daka kalalo nelavi kalavara pedatavu
kanulu terichina kshanam nunchi madilo nuvve vuregutunnavu
kadili vellina chotla medila bhavam nuvve
kavitha lo rasina prathi aksharaniki spurthivi nuvve
kalalo undi pothnante kalakalam nidurapona
nijamayi vastanante nidura marichi vechivundana

వివిధ కాలములలో తెలుగు లిపి(Telugu script in different times)

 అల్లసాని పెద్దన కాలములో తెలుగు లిపి (telugyu script in the time of allasani peddana)

ఎర్రన కాలములో ని తెలుగు లిపి (telugyu script in the time of Errana)

శ్రీ నాథుని కాలపు లిపి (telugyu script in the time of Sri natha )

తెలుగు భాష లో అక్షర విభజన(classification of Telugu alphabets)

Acchulu' are further classified as 'Haswamulu' , 'Deergamulu' , 'Vakramulu' , ' Vakratamulu'
Hallulu' are divided into 'Parushamulu', 'Saralamulu', 'Drutamu' , 'Stiramulu' , 'Kaevalastiramulu' , 'Anunaasikamulu' , 'Amtastamulu' and 'Ooshmamulu'.

 The Hallulu are further divided into Vargamulu.
 The Alphabet are further divided by their articulation as 'Kantyamulu' , 'taalavyamulu' , 'muurdanamulu' , 'damtyamulu' , 'oshtyamulu' , 'anunaasikamulu' , 'kamtataalavyamulu' , 'kantostyamulu' , 'damtostyamulu' . The classification of the alphabet is done according to the pronunciation of these alphabet, involving bringing articulatory organs together so as to shape the sounds of speech.
Telugu Vyanjana Ucchaarana

Telugu lessa




uggu paala numDi uyyaalaloe numDi
ammapaaTa paaDinaTTi bhaasha
taene vanTi mandu veenulaku vimdu
daeSabhashalamdu telugu lessa!

samskRutambuloeni chakkera paakambu
arava bhaashaloani amRutaraaSi
kannaDambuloeni taeTa telugu namdu
vaenavaela kavula veluguloe ruupomdi
daeSadaeSamulaloe vasigaamchina bhaasha
vaeyiyae mDla numDi vilasillu naa 'bhaasha '
daeSa bhaasha lamdu telugu lessa

Saturday, September 11, 2010

Telugu Pedda Samyakalu

10^10      సహస్ర కోటి (ఆర్బుదము)
10^11      న్యర్భుదము
10^12     ఖర్వము
10^13    మహా ఖర్వము
10^14    పద్మము
 10^15    మహా పద్మము
10^16    క్షోణి
 10^17   మహా క్షోణి
10^18    శంఖము
10^19    మహా శంఖము
 10^20    క్షితి
10^21    మహా క్షితి
10^22    క్షోభము
10^23   మహా క్షోభము
10^24    నిధి
10^25    మహా నిధి
10^26   పరతము
10^27   పరార్థము
10^28   అనంతము
 10^29 సాగరము
10^30  అవ్యాయము
10^31   అమృతము
10^32  అచింత్యము
10^33  అమేయము
10^34   భూరి
10^35    మహా భూరి

అన్నమయ్య సంకీర్తనాలు



















[Source: అన్నమయ్య పద సౌరభం - రెండవ భాగం
స్వరకర్త నేదునూరి కృష్ణమూర్తి
ప్రచురణ - నాదసుధాతరంగిణి]

1. అలమేలుమంగనీ వభినవరూపము (వాల్యూం 12-159)

అలమేలుమంగనీ వభినవరూపము
జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మ

గరుడాచలాధీశు ఘనవక్షముననుండి
పరమానంద సంభిరతవై
నెరతనములు జూపి నిరంతరమునాథుని
హరుషింపగ జేసి తిగదమ్మ

శశికిరణములకు చలువలచూపులు
విశదముగా మీద వెదజల్లుచు
రసికత పెంపున కరగించి ఎప్పుడు నీ
వశముజేసుకొంటి వల్లభునోయమ్మ

రట్టడి శ్రీవేంకటరాయనికి నీవు
పట్టపురాణివై పరగుచు
వట్టిమాకులిగిరించు వలపుమాటలవిభు
జట్టిగొని వురమునసతమైతివమ్మ
=====================

2. వలదననొరులకు (వాల్యూం 4-17)

వలదననొరులకు వశమటవే
తలచినట్లనిది దైవమెచేసె

తరుణికుచములను తామరమొగుడలు
విరిసేనోయని వెరపునను
సరగునపతినఖ చంద్రశకలములు
దరులుగలుగనిది దైవమెచేసె

పొలతివదనమను పున్నమచంద్రుడు
బలిమినెగయునని భయమునను
మెలుతచికురధ మ్మిల్లపురాహువు
తలచెదరగనిది దైవమెచేసె

వనితకువాడునొ వలపుతాపమున
తనులతికయనుచు తమకమున
ఘనవేంకటపతి కౌగిటచమటల
తనివి దీర్చనిది దైవమె చేసె
=====================

3. పురుషోత్తముడవీవు (వాల్యూం 2-53)

పురుషోత్తముడవీవు పురుషాధముడనేను
ధరలోననాయందు మంచితనమేది

అనంతాపరాధములు అటునేముసేసివి
అనంతమైనదయ అది నీది
నినునెఱగకుండేటి నీచ గుణము నాది
ననునెడయకుండేటి గుణము నీది

సకలయాచకమే సరుసనాకుపని
సకలరక్షకత్వము సరి నీపని
ప్రకటించినిన్ను దూరేపలుకేనా కెప్పుడూను
వెకలివైనను గాచేవిధమునీది

నేరమింతయు నాది నేరుపింతయు నీది
సారెకు అజ్ఞాని నేను జ్ఞానివి నీవు
యీరీతి వేంకటేశయిట్టేనను నేలితివి
ధారుణిలో నిండెను ప్రతాపమునీది
=====================

4. భక్తికొలది వాడే (వాల్యూం 1-410)

భక్తికొలది వాడే పరమాత్ముడు
భుక్తిముక్తి తానెయిచ్చు భువి పరమాత్ముడు

పట్టినవారిచే బిడ్డ పరమాత్ముడు
బట్టబయటి ధనము పరమాత్ముడు
పట్టపగటి వెలుగు పరమాత్ముడు
యెట్టనెదుటనే వున్నాడిదె పరమాత్ముడు

పచ్చిపాలలోనివెన్న పరమాత్ముడు
బచ్చనవాసినరూపు పరమాత్ముడు
బచ్చుచేతివొరగల్లు పరమాత్ముడు
యిచ్చుకొలదివాడువో యీ పరమాత్ముడు

పలుకులలోనితేట పరమాత్ముడు
ఫలియించునిందరికి పరమాత్ముడు
బలిమిశ్రీ వేంకటాద్రి పరమాత్ముడు
యెలమి జీవులప్రాణమీ పరమాత్ముడు
=====================

5. ఏమొకో చిగురుటధరమున (వాల్యూం 12-82)

ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా

కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన
చెలువంబిప్పుడిదేమో చింతింపరేచెలులు
నలువున ప్రాణేశ్వరునిపై నాటినయాకొనచూపులు
నిలువునపెరుకగనంటిన నెత్తురుకాదుకదా

పడతికి చనుగవమెరుగులు పైపై పయ్యెద వెలుపల
కడుమించిన విధమేమో కనుగొనరే చెలులు
వుడుగని వేడుకతో ప్రియుడొత్తిన నఖశశిరేఖలు
వెడలగవేసవికాలపు వెన్నెలకాదుకదా

ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల
వొద్దికలాగులివేమో ఊహింపరే చెలులు
గద్దరి తిరువేంకటపతి కొగిటియధరామృతముల
అద్దిన సురతపు చెమటల అందము కాదు కదా
=====================

6. తెలిసిన వారికి దేవుండితడే (వాల్యూం 3-480)

తెలిసిన వారికి దేవుండితడే
వలవని దుష్టుల వాదములేల

పురుషులలోపల పురుషోత్తముడు
నరులలోన నరనారాయణుడు
పరదైవములకు పరమేశ్వరుడు
వరుసమూఢుల కెవ్వరోయితడు

పలుబ్రహ్మలకును పరబ్రహ్మము
మలయునీశులకు మహేశుడితడు
ఇలనాత్మలలో నిటుపరమాత్ముడు
ఖలులకెట్లుండునో కానము యితడు

వేదంబులలో వేదాంతవేద్యుడు
సోదించకరిగాచుచో నాదిమూలము
యీదెస శ్రీ వేంకటేశుడిందరికి
గాదిలి మతులను గైకొనడితడు
=====================

7. కొలిచిన వారల (వాల్యూం 3-419)

కొలిచిన వారల కొంగుపైడితడు
బలిమి తారక బ్రహ్మమీతడు

యినవంశాంబుధి నెగసిన తేజము
ఘన యజ్ఞంబుల గల ఫలము
మనుజరూపమున మనియెడి బ్రహ్మము
నినుపుల రఘుకుల నిథానమితడు

పరమాన్నములోపలి సారపుజవి
పరగినదివిజుల భయహరము
మరిగినసీతా మంగళ సూత్రము
ధరలో రామావతారంబితడు

చకితదానవుల సంహారచక్రము
సకలవన చరుల జయకరము
వికసితమగు శ్రీవేంకట నిలయము
ప్రకటిత దశరథ భాగ్యంబితడు
=====================

8. అంతరంగమెల్ల (వాల్యూం 1-437)

అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటె
వింతవింత విధముల వీడునా బంధములు

మనుజుడై ఫలమేది మరిజ్ఞాని యౌదాకా
తనువెత్తి ఫలమేది దయగలుగుదాకా
ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాకా
పనిమాలి ముదిసితే పాసెనా భవము

చదివియు ఫలమేది శాంతము కలుగుదాకా
పెదవెత్తి ఫలమేది ప్రియమాడు దాకా
మదిగల్గి ఫలమేది మాధవుదలచు దాకా
యెదుట తాను రాజైతే ఏలేనాపరము

పావనుడై ఫలమేది భక్తి కలిగిన దాకా
జీవించి ఫలమేది చింత దీరుదాకా
వేవేల ఫలమేది వేంకటేశుగన్నదాక
భావించితా దేవుడైతే ప్రత్యక్షమౌనా
=====================

9. భక్తినీపై దొకటె పరమసుఖము (వాల్యూం 3-322)

భక్తినీపై దొకటె పరమసుఖము
యుక్తిజూచిన నిజం బొక్కటేలేదు

కులమెంత గలిగెనది కూడించు గర్వంబు
చలమెంత గలిగెనది జగడమే రేచు
తలపెంత పెంచినా తగిలించు కోరికలు
యెలమి విజ్ఞానంబు యేమిటాలేదు

ధనమెంత గలిగెనది దట్టమౌలోభంబు
మొనయు చక్కదనంబు మోహములు రేచు
ఘనవిద్య గలిగినను కప్పు పై పై మదము
యెనయగ పరమ పద మించుకయులేదు

తరుణులెందరు అయిన తాపములు సమకూడు
సిరులెన్ని గలిగినను చింతలేపెరుగు
యిరవయిన శ్రీవేంకటేశు నినుకొలువగా
పెరిగె నానందంబు బెళకులికలేవు
=====================

10. విశ్వరూపమిదివో (వాల్యూం 3-409)

విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో
శాశ్వతులమైతిమింక జయము నాజన్మము

కొండవంటి హరిరూపు గురుతైన తిరుమల
పండిన వృక్షములే కల్పతరువులు
నిండిన మృగాదులెల్ల నిత్యముక్తజనములు
మెండుగ ప్రత్యక్షమాయె మేలువోనాజన్మము

మేడవంటి హరిరూపు మించైనపైడి గోపుర
మాడనే వాలిన పక్షుల మరులు
వాడల కోనేటి చుట్ల వైకుంఠ నగరము
యీడమాకు పొడచూపె ఇహమేపోపరము

కోటిమదనులవంటి గుడిలో చక్కని మూర్తి
యీటులేని శ్రీ వేంకటేశుడితడు
వాటపు సొమ్ములు ముద్ర వక్షపుటలమేల్మంగ
కూటువైనన్నేలితి యెక్కువనోనాతాపము
=====================

11. అవధారు రఘుపతి (వాల్యూం 3-492)

అవధారు రఘుపతి అందరిని చిత్తగించు
యివలనిండే కొలువిదెనదె సముఖాన

రామరాఘవరామ రామచంద్రప్రభో
శ్రీమదయోధ్యాధిపతి సీతాపతి
ప్రేమనారదుడు పాడిపెక్కురంభాదులాడేరు
మోమెత్తి కపులెల్ల మ్రొక్కేరదివో

యినవంశకుల జాత ఇక్ష్వాకుకులతిలక
ఘనదశరథసుత కౌశికప్రియ
మునులు దీవించేరు ముందట భరతుడదె
వెనక లక్ష్మణుడు సేవించీ వింజామర

కందువకౌసల్యాగర్భ రత్నాకర
చెందిన శ్రీవేంకటాద్రి శ్రీనివాస
సందడి కుశలవులు చదివేరు వొకవంక
చెంది నీరాజసము చెప్పరాదు రామ
=====================

12. రామచంద్రుడితడు (వాల్యూం 10-147)

రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములీయ గలిగెనిందరికి

గౌతము భార్యపాలిటి కామధేనువితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి యితడు
యీతడు దాసుల పాలిటి యిహపర దైవము

పరగసుగ్రీవుపాలి పరమ బంధువితడు
సరిహనుమంతుపాలి సామ్రాజ్యము
నిరతి విభీషణునిపాలి నిధానము యీతడు
గరిమజనకు పాలి ఘనపారిజాతము

తలప శబరిపాలి తత్వపు రహస్యము
అలరిగుహునిపాలి ఆదిమూలము
కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి
వెలయ శ్రీవేంకటాద్రి విభుడితడు
=====================

13. పలువిచారము లేల (వాల్యూం 3-100)

పలువిచారములేల పరమాత్మనీవు నాకు
కలవు కలవు ఉన్న కడమలేమిటికి

నీపాదముల చెంత నిబిడమైతే చాలు
యేపాతకములైన ఏమిసేసును
యేపార నీభక్తి ఇంత గలిగిన చాలు
పై పై సిరులచ్చట పాదుకొని నిలుచు

సొరిదినీ శరణము జొచ్చితినంటే చాలు
కరుణించి యప్పుడట్టే కాతువు నీవు
సరుస నీముద్రలు భుజములనుంటే చాలు
అరుదుగా చేతనుండు అఖిలలోకములు

నేరకవేసిన చాలు నీమీద ఒక పువ్వు
కోరిన కోరికలెల్ల కొనసాగును
మేరతో శ్రీవేంకటేశ నిన్నుగొలిచితి నేను
యేరీతినుండిన గాని యిన్నిటా ఘనుడను
=====================

14. ఇతరములిన్నియు (వాల్యూం 1-86)

ఇతరములిన్నియు నేమిటికి
మతిచంచలమే మానుటపరము

ఎక్కడి సురపుర మెక్కడి వైభవ
మెక్కడి విన్నియునేమిటికి
యిక్కడనే పరహితమును పుణ్యము
గక్కున జేయగ గలదిహ పరము

యెవ్వరు చుట్టములెవ్వరు బంధువు
లెవ్వరిందరును నేమిటికి
రవ్వగు లక్ష్మీరమణుని దలపుచు
యివ్వలదా సుఖియించుట పరము

యెందరు దైవము లెందరు వేల్పులు
యెందరిందరును నేమిటికి
కందువెఱిగి వేంకటగిరి రమణుని
చిందులేక కొలిచినదిహ పరము
=====================

15. నారాయణాచ్యుతానంత (వాల్యూం 2-423)

నారాయణాచ్యుతానంత గోవింద హరి
సారముగ నీకునే శరణంటిని

చలువయును వేడియును నటల సంసారంబు
తొలకు సుఖమొకవేళ దుఃఖమొకవేళ
ఫలములివె యీ రెండు పాపములు పుణ్యములు
పులుసు దీపును గలపి భుజియించినట్లు

పగలు రాత్రులరీతి బహుజన్మ మరణాలు
తగుమేను పొడచూపు తనుదానె తొలగు
నగియించు నొకవేళ నలగించు నొకవేళ
వొగరు కారపు విడెము ఉబ్బించినట్లు

యిహము పరమును వలెనె యెదిటికల్లయు నిజము
విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని
సహజ శ్రీ వేంకటేశ్వర నన్ను కరుణింప
బహువిధంబుల నన్ను పాలించవే
=====================

16. ఏటి సుఖము (వాల్యూం 1-135)

ఏటి సుఖము మరి ఏటి సుఖము
ఒకమాట మాత్రము నటమటమైన సుఖము

కొనసాగు దురితములె కూడైన సుఖము
తను విచారములలో దాకొన్న సుఖము
పనిలేని యాసలకు బట్టయిన సుఖము
వెనక ముందర జూడ వెరగైన సుఖము

నిందలకులోనైన నీరసపు సుఖము
బొందికిని లంచంబు పుణికేటి సుఖము
కిందుపడి పరులముంగిలి గాచు సుఖము
పందివలె తనుదానె బ్రతికేటి సుఖము

ధృతిమాలి యిందరికి దీనుడగు సుఖము
మతిమాలి భంగములు మరపించు సుఖము
పతి వేంకటేశు కృప పడసినది సుఖము
యితరంబులన్నియును నీ పాటి సుఖము
=====================

17. నవనీతచోర (వాల్యూం 3-24)

నవనీతచోర నమోనమో నవమహిమార్ణవ నమోనమో

హరినారాయణ కేశవాచ్యుతకృష్ణ
నరసింహ వామన నమోనమో
మురహర పద్మనాభ ముకుంద గోవింద
నరనారాయణ నమోనమో

నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవ
నగధర నందగోప నమోనమో
త్రిగుణాతీతదేవ త్రివిక్రమ ద్వారక
నగరాధినాయక నమోనమో

వైకుంఠ రుక్మిణీ వల్లభ చక్రధర
నాకేశవందిత నమోనమో
శ్రీకర గుణనిధి శ్రీవేంకటేశ్వర
నాకజనుత నమోనమో
=====================

18. ఆలాగు పొందులును (వాల్యూం 1-30)

ఆలాగు పొందులును అటువంటి కూటములు
యీలాగు లౌటనేడిదె చూడనైతి

అడియాస చూపులకు నాసగించితిగాని
వెడమాయలనిలోను వెదకలేనైతి
కడువేడుకల దగిలి గాసిబొందితిగాని
యెడలేని పరితాప మెఱగలేనైతి

చిరునగవుమాటలకు చిత్తగించితిగాని
తరితీపులని లోను తలుపలేనైతి
వరుసమోహపు బసలవలల చిక్కితిగాని
గరువంపు పొలయలుక గానలేనైతి

శ్రీ వేంకటేశ్వరుని చింతజేసితిగాని
దేవోత్తమునిలాగు తెలియలేనైతి
యీ వైభవముపై నిచ్చగించితి గాని
యీ వైభవానంద మిది పొందనైతి
=====================

19. రాముడు లోకాభిరాముడు (వాల్యూం 2-219)

రాముడు లోకాభిరాముడు త్రైలోక్య
ధాముడు రణరంగ భీముడు వాడే

వరుడు సీతకు, ఫలాధరుడు మహోగ్రపు
శరుడు రాక్షస సంహరుడు వాడే
స్థిరుడు సర్వగుణాకరుడు కోదండ దీక్షా
గురుడు సేవకశుభకరుడు వాడే

ధీరుడు లోకైకవీరుడు సకలా
ధారుడు భవబంధదూరుడు వాడే
శూరుడు ధర్మవిచారుడు రఘువంశ
సారుడు బ్రహ్మసాకారుడు వాడే

బలుడు యిన్నిటా రవికులుడు భావించ, ని
ర్మలుడు నిశ్చలుడవికలుడు వాడే
వెలసి శ్రీ వేంకటాద్రి నిజనగరములోన
తలకొనె పుణ్యపాదతలుడు వాడే
=====================

20. కొలనిలోన (వాల్యూం 2-214)

కొలనిలోనమునుగోపికలు
మొలకనవ్వులతో మ్రొక్కిరి నీకు

పిరుదులు దాటిన పింఛపు టలకల
తురుములు వీడగ తొయ్యెలులు
అరిది నితంబులందునెదాచుక
మురిపెపు కరముల మ్రొక్కిరినీకు

నిద్దపు మానము నెలతలు లోగుచు
గద్దరి తొడలనె గట్టుచును
ముద్దుటుంగరంబుల కరములతో
ముద్దులు గునియుచు మ్రొక్కిరి నీకు

పాలిండ్ల పెనుభారంబుల
మూలపు మెరుగులు ముంచగను
వేలపు ప్రియముల వేంకటేశనిను
మూలకుపిలుచుచు మ్రొక్కిరి నీకు
=====================

21. అమరాంగనలదె (వాల్యూం 10-26)

అమరాంగనలదె ఆడేరు
ప్రమదంబుననదె పాడేరు

గరుడవాహనుడు కనక రథముపై
ఇరవుగ వీధుల నేగేని
సురలును మునులును సొంపుగ మోకులు
తెరలిచి తెరలిచి తీసేరు

ఇలధరుడదివో ఇంధ్రరథముపై
కెలయుచు దిక్కులు గెలిచీని
బలు శేషాదులు బ్రహ్మశివాదులు
చెలగి సేవలటు సేసేరు

అలమేల్మంగతో నటు శ్రీవేంకట
నిలయుడరదమున నెగడేని
నలుగడ ముక్తులు నారదాదులును
పొలుపు మీరకడు పొగడేరు
=====================

22. పసిడియక్షంతలివె (వాల్యూం 3-194)

పసిడియక్షంతలివె పట్టరో వేగమె రారో
దెసల పేరంటాండ్లు దేవుని పెండ్లికిని

శ్రీవేంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి
దైవికపు పెండ్లిముహూర్తము నేడు
కావించి భేరులు మ్రోసె గరుడధ్వజంబెక్కె
దేవతలు రారో దేవుని పెండ్లికిని

కందర్ప జనకునకి కమలాదేవికి పెండ్లి
పందిలిలోపల తలంబాలు నేడు
గంధమూ విడెమిచ్చేరు కలువడాలు గట్టిరి
అందుక మునులు రారో హరి పెండ్లికిని

అదె శ్రీ వేంకటపతికి అలమేలు మంగకును
మొదలి తిరుణాళ్ళకు మ్రొక్కేము నేడు
యెదుట నేగేరు వీరెయిచ్చేరు వరములివె
కదలిరారో పరుష ఘనుల పెండ్లికిని
=====================

23. పాపపుణ్యముల రూపము (వాల్యూం 1-28)

పాపపుణ్యముల రూపము దేహమిది దీని
దీపనంబణగింప తెరువెందులేదు

అతిశయంబైన దేహాభిమానము దీర
గతిగాని పుణ్యసంగతి బొందరాదు
మతిలోని దేహాభిమానంబు బిడుచుటకు
రతిపరా~జ్ముఖుడు గాక రవణంబు లేదు

సరిలేని మమకారజలధి దాటినగాని
అరుదైన నిజసౌఖ్యమది వొందరాదు
తిరువేంకటాచలాధిపుని గొలిచినగాని
పరగు బ్రహ్మానంద పరుడుతాకాడు
=====================

24. సకలశాంతికరము (వాల్యూం 3-377)

సకలశాంతికరము సర్వేశ నీపై భక్తి సర్వేశ
ప్రకటమై మాకు నబ్బె బతికించు నిదియె సర్వేశ

మనసులో పాపబుద్ధి మరియెంత దలచిన
నినుదలచినంతనే నీఱౌను
కనుగొన్న పాపములు కడలేనివైనాను
ఘనుడనిన్ను జూచితే కడకు దొలగును

చేతనంటి పాతకాలు సేనగానే జేసినాను
ఆతల నీకు మ్రొక్కితే నన్నియు బాయు
ఘాతలజెవుల వినగా నంటిన పాపము
నీతితో నీ కథ వింటే నిమిషానబాయును

కాయమున జేసేటి కర్మపు పాపములెల్ల
కాయపునీ ముద్రలచే గ్రక్కున వీడు
యేయెడ వేంకటేశ యేయేపాతకమైనా
అయమైన నీ శరణాగతిచే నణగు
=====================

25. చాలుచాలును (వాల్యూం 12-45)

చాలుచాలును భోగసమయమున మైమఱపు
పాలుపడునట యేటి బ్రతుకురా ఓరీ

ఇందుముఖినిను కౌగిలించి లోపలి జగము
కందునని నీ బిగువు కౌగిలే వదలె
పొందైన వారితో పొసగ కౌగిట జేర్ప
పొందుగాదట యేటి పొందురా ఓరీ

నెలత నీ వాలు కన్నులు మూసి జగమెల్ల
కలయ చీకట్లైన గక్కనను వదలె
వలచిన అంగనలు తమ వలసిన విలాసముల
వలను నెఱపనిదేటి వలపురా ఓరీ

కొమ్మ నీ ఉరముపై గోరు దివియుచునాత్మ
నిమ్మైన ననుతాక నిద్దరిని తాకె
దిమ్మరివి కోనేటి తిమ్మ నీపై ప్రియము
కుమ్మరించని దేటి కోర్కిరా ఓరీ
=====================

26. తరుణినీయలుక (వాల్యూం 12-70)

తరుణినీయలుకకెంతటిది ఇంతినీ వేళ
కరుణించగదర వేంకటశైలనాథ

ఒకమారు సంసారమొల్ల బొమ్మని తలచు
ఒక మారు విధిసేతలూహించి పొగడు
ఒక మారు తనుజూచి వూరకే తలవూచు
నొకమారు హర్షమున నొందిమేమఱచు

నినుజూచివొకమారు నిలువెల్ల పులకించు
తనుజూచి వొకమారు తలపోసి నగును
కనుదెరచి నినుజూచి కడు సిగ్గువడి నిలిచి
యిన్నియును తలపొసి యింతలో మఱచు

వదలైన మొలనూలు గదియించు నొకమారు
చెదరిన కురులెల్ల చెరుగునొకమారు
అదనెరిగి తిరువేంకటాధీశ పొందితివి
చదురుడవునిను బాయ జాలదొకమారు
=====================

27. ఆకటి వేళల అలపైన వేళలను (వాల్యూం 1-158)

ఆకటి వేళల అలపైన వేళలను
తేకువ హరినామమే దిక్కుమరి లేదు

కొఱమాలియున్నవేళ కులముచెడినవేళ
చెరవడి వొరులచే జిక్కిన వేళల
వొరపైన హరినామ మొక్కటే గతిగాక
మరచి తప్పిననైన మఱిలేదు తెఱగు

ఆపదవచ్చినవేళ యారడిబడినవేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామ మొక్కటే గతిగాక
మాపుదాకా బొరలిన మరిలేదు తెఱగు

సంకెళ బెట్టిన వేళ చంపబలిచిన వేళ
అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వెంకటేశు నామమే విడిపించగతిగాక
మంకుబుద్ధి పొరలిన మరిలేదు తెఱగు
=====================

28. అదె చూడరే (వాల్యూం details not given in the book! )

అదె చూడరే మోహన రూపం
పది కోట్లుగల భావజ రూపం

వెలయగ పదారువేల మగువలను
అలమిన ఘన మోహన రూపం
వలచిన నంద వ్రజము గొల్లెతల
కులుకు చూపులకు గురియగు రూపం

ఇందిరా వనిత నెప్పుడు తన ఉర
మందు నిలిపిన మోహన రూపం
కందువ భూసతి కౌగిటి సొంపుల
విందులు మరగిన వేడుక రూపం

త్రిపురసతుల బోధించి రమించిన
అపురూపపు మోహన రూపం
కపురుల శ్రీ వేంకటపతి యైయిల
ఉపమించగ రాని ఉన్నత రూపం
=====================

29. ప్రతిలేని పూజదలపంగ (వాల్యూం 12-300)

ప్రతిలేని పూజదల పంగకోటి మణుగులై
అతివ పరవశము బ్రహ్మానందమాయె

మానినీమణిమనసు మంచియాసనమాయె
ఆనందబాష్పజల మర్ఘ్యాదులాయె
మీనాక్షి కనుదోయి మించుదీపములాయె
ఆనన సుధారసంబభిషేకమాయె

మగువచిరునవ్వులే మంచి క్రొవ్విరులాయె
తగుమేనితావి చందనమలదుటాయె
నిగనిగనీతనుకాంతి నీరాజనంబాయె
జగడంపుటలుకలుపచారంబులాయె

ననుపైన పొందులె నైవేద్య తతులాయె
తనివోని వేడుకలు తాంబూలమాయె
వనిత శ్రీ వేంకటేశ్వరుని కౌగిట జేయు
వినయ వివరంబు లరవిరిమ్రొక్కులాయె
=====================

30. మరలిమరలి జయమంగళము (వాల్యూం 1-448)

మరలి మరలి జయమంగళము
సొరిదినిచ్చలును శుభమంగళము

కమలారమణికి కమలాక్షునకును
మమతల జయజయ మంగళము
అమరజననికిని అమరవంద్యునకు
సుముహూర్తముతో శుభమంగళము

జలధికన్యకును జలధిశాయికిని
మలయుచును శుభమంగళము
కలిమికాంత కాకలికి విభునికిని
సుళువుల యారతి శుభమంగళము

చిత్తజు తల్లికి శ్రీ వేంకటపతికి
మత్తిల్లిన జయ మంగళము
యిత్తల నత్తల యిరువురకౌగిటి
జొత్తుల రతులకు శుభమంగళము
==================================================
Source: అన్నమాచార్యుల సంకీర్తనలు TTD Publ. Series No.128
==================================================

31. విన్నపాలు వినవలె వింత వింతలు (రాగం - భూపాళం)

విన్నపాలు వినవలె వింత వింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా

తెల్లవారె జామెక్కె దేవతలు మునులు
అల్లనల్ల నంతనింత నదిగోవారే
చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు
మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా

గరుడ కిన్నరయక్ష కామినులు గములై
విరహపు గీతముల వింతాలాపాల
పరిపరివిధముల బాడేరునిన్నదివో
సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా

పొంకపు శేషాదులు తుంబురునారదాదులు
పంకజభవాదులు నీ పాదాలు చేరి
అంకెలనున్నారు లేచి అలమేలుమంగను
వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా
=====================

32. అలరులు గురియగ నాడెనదే (రాగం - శంకరాభరణం)

అలరులు గురియగ నాడెనదే
అలకల గులుకుల నలమేలుమంగ

అరవిరి సొబగుల నతివలు మెచ్చగ
అర తెర మరుగున నాడె నదే
వరుసగ పూర్వదు వాళపు తిరుపుల
హరి గరగింపుచు నలమేలుమంగ

మట్టపు మలపుల మట్టెలకెలపుల
తట్టెడి నడపుల దాటెనదే
పెట్టిన వజ్రపు పెండెపు దళుకులు
అట్టిట్టు చిమ్ముచు నలమేలుమంగ

చిందుల పాటల శిరిపొలయాటల
అందెల మ్రోతల నాడె నదే
కందువ తిరువెంకటపతి మెచ్చగ
అందపు తిరుపుల నలమేలుమంగ
=====================

33. కులుకక నడవరో కొమ్మలాలా (రాగం - దేసాళం)

కులుకక నడవరో కొమ్మలాలా
జలజల రాలీని జాజులు మాయమ్మకు

ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాదతాకు కాంతులాలా
పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మిద
అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు

చల్లెడి గందవొడియై జారీ నిలువరో
పల్లకి వట్టిన ముద్దు బణతులాల
మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర
గల్లనుచు గంకణాలు గదలీమాయమ్మకు

జమళి ముత్యాల తోడి చమ్మాళిగ లిడరో
రమణికి మణుల నారతు లెత్తరో
అమరించి కౌగిట నలమేలు మంగనిదె
సమకూడె వేంకటేశ్వరుడు మా యమ్మకు
=====================

34. చక్కని తల్లికి చాంగుభళా తన (రాగం - పాడి)

చక్కని తల్లికి చాంగుభళా తన
చక్కెర మోవికి చాంగుభళా

కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సళుపు జూపులకు చాంగుభళా
పలుకుల సొంపుల బతితో గసరెడి
చలముల యలుకకు చాంగుభళా

కిన్నెరతో పతి కెలన నిలుచు తన
చన్ను మెఱుగులకు చాంగుభళా
ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి చాంగుభళా

జందెపు ముత్యపు సరులహారముల
చందన గంధికి చాంగుభళా
విందయి వెంకట విభుబెన చినతన
సంది దండలకు చాంగుభళా
=====================

35. పలుకు దేనెల తల్లి పవళించెను (రాగం - సాళంగనాట)

పలుకు దేనెల తల్లి పవళించెను
కలికి తనముల విభుని గలసినది గాన

నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర
పగలైన దాక జెలి పవళించెను
తెగని పరిణతులతో తెల్లవారినదాక
జగదేక పతి మనసు జట్టి గొనె గాన

కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి
బంగారు మేడపై బవళించెను
చెంగలువ కనుగొనల సింగారములు దొలక
అంగజ గురునితోడ నలసినదిగాన

మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై
పరవశంబున దరుణి పవళించెను
తిరు వేంకటాచలా ధిపుని కౌగిట గలసి
అరవిరై నును జెమలు నంటినదిగాన
=====================

36. వలదన నొరులకు వసమటవే (రాగం - సామంతం)

వలదన నొరులకు వసమటవే
తలచినట్లు నిది దైవమె చేసె

తరుణి కుచములను తామర మొగుడలు
విరిసేనో యని వెరపునను
సరగున బతి నఖ చంద్రశకలములు
దరుల గలుగ నివి దైవమె చేసె

పొలతి వదనమను పున్నమ చంద్రుడు
బలిమి నెగయునని భయమునను
మెలుత చికుర ధమ్మిల్లపు రాహువు
తల జెదరగ నిది దైవమె సేసె

వనితకు వాడునొ వలపు తాపమున
తనులతిక యనుచు దమకమున
ఘన వేంకటపతి కౌగిట చెమటల
దనివి దీర్చనిది దవమె సేసె
=====================

37. ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము మఱి (రాగం - ముఖారి)

ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము మఱి
యిదిగాక వైభవం బిక నొకటి కలదా

అతివ జన్మము సఫలమై పరమయోగివలె
నితర మోహాపేక్ష లిన్నియును విడిచె
సతి కోరికలు మహాశాంతమై యిదె చూడ
సతత విజ్ఞాన వాసన వోలె నుండె

తరుణి హృదయము కృతార్థత బొంది విభుమీది
పరవశానంద సంపదకు నిరవాయ
సరసిజానన మనో జయ మంది యింతలో
సరిలేక మనసు నిశ్చలభావమాయ

శ్రీ వేంకటేశ్వరుని జింతించి పరతత్త్వ
భావంబు నిజముగా బట్టె జెలియాత్మ
దేవోత్తముని కృపాధీనురాలై యిపుడు
లావణ్యవతికి నుల్లంబు దిరమాయ
=====================

38. పొద్దికనెన్నడు వొడచునొ పోయిన చెలిరాదాయను (రాగం - సామంతం)

పొద్దికనెన్నడు వొడచునొ పోయిన చెలిరాదాయను
నిద్దుర గంటికి దోపదు నిమిషంబొక యేడు

కన్నుల నవ్వెడి నవ్వులు గబ్బితనంబుల మాటలు
నున్నవి యొయ్యారంబులు నొచ్చిన చూపులును
విన్నదనంబుల మఱపులు వేడుక మీరిన యలపులు
సన్నపు జెమటలు దలచిన ఝల్లనె నా మనసు

ఆగిన రెప్పల నీరును నగ్గలమగు పన్నీటను
దోగియు దోగని భావము దోచిన పయ్యెదయు
కాగిన దేహపు సెకలును కప్పిన పువ్వుల సొరబులు
వేగిన చెలి తాపమునకు వెన్నెల మండెడిని

దేవశిఖామణి తిరుమల దేవుని దలచిన బాయక
భావించిన యీ కామిని భావము లోపలను
ఆ విభుడే తానుండిక నాతడె తానెఱగగవలె
నీ వెలదికి గల విరహంబేమని చెప్పుదము
=====================

39. జవ్వాది మెత్తినది అది తన (రాగం - శంకరాభరణం)

జవ్వాది మెత్తినది అది తన
జవ్వనమే జన్నె వట్టినది

ముద్దుల మాటలది అది చెక్కు
టద్దముల కాంతి నలరినది
గద్దరి చూపులది అది తన
వొద్ది చెలియమీద నొరగున్నది

పుత్తడి బోలినది అది తన
చిత్తము ని సొమ్ము చేసినది
గుత్తపు గుబ్బలది అది అల
చిత్తజుని లెక్క సేయనిది

ఎమ్మెలు యెఱుగనిది అది తన
కెమ్మోవి జిరునవ్వు గెరలున్నది
కమ్ముకొనగ వెంకటరాయా నీ
కమ్మని కౌగిట గలశున్నది
=====================

40. విరహపు రాజదె విడిదికి రాగా (రాగం - సామంతం)

విరహపు రాజదె విడిదికి రాగా
సిరుల జేసె నిదె సింగారములూ

నెలత నుదుటిపై నీలపు గురులనె
తొలుతనె కట్టెను దోరణము
మొలక చెమటలనె ముత్యపు మ్రుగ్గులు
అలరిచె మదనుండదె చెలిమేన

దట్టముగా జింతా లతనే వడి
బెట్టి జప్పరము పెనగొనగ
పట్టిన మైతావులు పరిమళములు
కట్టించెను చెంగట వలరాజు

విందగు వేంకట విభుని ప్రేమచే
బొందగ బెట్టెను బోనాలు
ఇందువదనకీ యిందిరావిభుని
కందుదేర నలు కలు చలి చేసె
=====================

41. కొమ్మ తన ముత్యాల కొంగు జారగ బగటు (రాగం - ఆహిరి)

కొమ్మ తన ముత్యాల కొంగు జారగ బగటు
కుమ్మరింపుచు దెచ్చు కొన్నదీ వలపు

ఒయ్యారమున విభుని వొరపు గనుగొని రెప్ప
మయ్యు నేరక మహా మురిపెమునను
కయ్యంపు గూటమికి గాలు దువ్వుచు నెంతె
కొయ్యతనమున దెచ్చు కొన్నదీ వలపు

పైపైనె ఆరగింపకుము పన్నీరు గడు
తాపమవునని చెలులు దలకగానే
తోపు సేయుచు గెంపు దొలకు గన్నుల కొనల
కోపగింపుచు దెచ్చు కొన్న దీవలపు

ఎప్పుడును బతితోడ నింతేసి మేలములు
ఒప్పదని చెలిగోర నొత్తగానే
యెప్పుడో తిరువేంకటేశు కౌగిట గూడి
కొప్పుగులుకుచు దెచ్చు కొన్నదీవలపు
=====================

42. చేరి యశోదకు శిశువితడు (రాగం - శుద్ధవసంతం)

చేరి యశోదకు శిశువితడు
ధారుణి బ్రహ్మకు దండ్రియు నితడు

సొలసి చూచినను సూర్య చంద్రులను
లలి వెద చల్లెడు లక్షణుడు
నిలిచిన నిలువున నఖిల దేవతల
కలిగించు సురల గనివో యితడు

మాటలాడినను మరి యజాండములు
కోటులు వొడమెటి గుణరాశి
నీటగు నూర్పుల నిఖిల వేదములు
చాటువ నూరెటి సముద్ర మితడు

ముంగిట మొలసిన మోహన మాత్మల
బొంగించే ఘన పురుషుడు
సంగతి మావంటి శరణాగతులకు
సంగము శ్రీ వేంకటాధిపు డితడు
=====================

43. మొత్తకురే అమ్మలాల ముద్దులాడు వీడె (రాగం - కాంభోజి)

మొత్తకురే అమ్మలాల ముద్దులాడు వీడె
ముత్తెమువలె నున్నాడు ముద్దులాడు

చక్కని యశోద తన్ను సలిగతో మొత్తరాగా
మొక్క బోయీ గాళ్ళకు ముద్దులాడు
వెక్కసాన రేపల్లె వెన్నలెల్లమాపుదాక
ముక్కున వయ్యగ దిన్న ముద్దులాడు

రువ్వెడి రాళ్ళదల్లి రోల దన్ను గట్టెనంట
మువ్వల గంటల తోడి ముద్దులాడు
నవ్వెడి జెక్కుల నిండ నమ్మిక బాలునివలె
మువ్వురిలో నెక్కుడైన ముద్దులాడు

వేల సంఖ్యల సతుల వెంట బెట్టుకొనిరాగా
మూల జన్నుగుడిచీని ముద్దులాడు
మేలిమి వెంకటగిరి మీదనున్నాడిదె వచ్చి
మూలభూతి దానైన ముద్దులాడు
=====================

44. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు (రాగం - సాళంగనాట)

ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు

అంత నింత గొల్లెతల అరచేతి మాణికము
పంత మాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ బూస
చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు

రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు

కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము
యేలేటి శ్రీ వేంకటాద్రి యింద్రనీలము
పాల జలనిధి లోన బాయని దివ్య రత్నము
బాలునివలె దిరిగీ బద్మ నాభుడు
=====================

45. ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని (రాగం - దేవగాంధారి)

ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని
బట్టి తెచ్చి పొట్టనిండ బాలు వోయరే

గామిడై పారితెంచి కాగెడి వెన్నెలలోన
చేమ పూవు కడియాల చేయి పెట్టి
చీమ గుట్టెనని తన చెక్కిట గన్నీరు జార
వేమరు వాపోయే వాని వెడ్డు వెట్టరే

ముచ్చువలె వచ్చి తన ముంగ మురువుల చేయి
తచ్చెడి పెరుగులోన దగబెట్టి
నొచ్చెనని చేయిదీసి నోర నెల్ల జొల్లుగార
వొచ్చెలి వాపోవువాని నూరడించరే

ఎప్పుడు వచ్చెనో మా యిల్లు చొచ్చి పెట్టెలోని
చెప్పరాని వుంగరాల చేయి పెట్టి
అప్పడైన వేంకటాద్రి అసవాలకుడు గాన
తప్పకుండ బెట్టె (బట్టి) వాని తలకెత్తరే
=====================

46. ఉగ్గు వెట్టరే వోయమ్మా చె (రాగం - భైరవి)

ఉగ్గు వెట్టరే వోయమ్మా చె
య్యొగ్గీనిదె శిశు వోయమ్మా

కడుపులోని లోకమ్ములు గదలీ
నొడలూచకురే వోయమ్మా
తొడికెడి సరుగున దొలగ దీయరే
వుడికెడి పాలివి వోయమ్మా

చప్పలు వట్టుక సన్నపు బాలుని
నుప్పర మెత్తకు రోయమ్మా
అప్పుడె సకలము నదిమీనోరనె
వొప్పదు తియ్యరె వోయమ్మా

తొయ్యలు లిటు చేతుల నలగించక
వుయ్యల నిడరే వోయమ్మా
కొయ్య మాటలను కొండల తిమ్మని
నొయ్యన తిట్టకు రోరమ్మా
=====================

47. పలుమరు వుట్ల పండుగను (రాగం - ముఖారి)

పలుమరు వుట్ల పండుగను
చిలుకు చిడుక్కని చిందగను

ఊళ్ళవీధుల వుట్లు కృష్ణుడు
తాళ్ళు దెగిపడ దన్నుచును (న్నగను?)
పెళ్ళు కఠిల్లు పెఠిల్లని
పెళ్ళుగ మ్రోసె పెనురవము

బంగా(గ)రు బిందెల బాలు బెరుగులు
ముంగిట నెగయుచు మోదగను
కంగు కళింగు కఠింగు ఖణింగని
రంగు మీరు పెను రవములై

నిగ్గుగ వేంకట నిలయుడుట్టిపా
లగ్గలిక బగుల నడువగను
భగ్గు భగిల్లని పరమామృతములు
గుగ్గిలి పదనుగ గురియగను
=====================

48. ఘమ్మని యెడి శృతి గూడగను (రాగం - పాడి)

ఘమ్మని యెడి శృతి గూడగను
కమ్మని నేతులు కాగగ జెలగె

నీలవర్ణుడని నీరజాక్షుడని
బాలుని నతివలు పాడేరో
పాలు పిదుకుచును బానల కాగుల
సోలిపెరుగు త్రచ్చుచు జెలరేగి

మందరధరుడని మాధవుడని గో
విందుని బాడేరు వెలదులిదే
నందవ్రజమున నలుగడనావుల
మందల బేయల మంచిరవముల

వెంకటపతియని వేదనిలయుడని
పంకజనాభుని బాడేరు
అంకుల చేతను నలరు రవంబుల
బింకపు మాటల బృందావనమున
=====================

49. ఉయ్యాలా బాలునూచెదరు కడు (రాగం - శంకరాభరణం)

ఉయ్యాలా బాలునూచెదరు కడు
నొయ్య నొయ్య నొయ్యనుచు

బాలయవ్వనలు పసిడివుయ్యాల
బాలుని వద్ద పాడేరు
లాలి లాలి లాలి లాలెమ్మ
లాలి లాలి లాలి లాలనుచు

తమ్మిరేకు గనుదమ్ముల నవ్వుల
పమ్ము జూపుల బాడేరు
కొమ్మలు మట్టెల గునుకుల నడపుల
ధిమ్మి ధిమ్మి ధిమ్మి ధిమ్మనుచు

చల్లు జూపుల జవరాండ్లురే
పల్లె బాలుని బాడేరు
బల్లిదు వేంకటపతి జేరి యందెలు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లనుచు
=====================

50. దీనుడనేను దేవుడవు నీవు (రాగం - శుద్ధవసంతం)

దీనుడనేను దేవుడవు నీవు
నీ నిజ మహిమే నెరపుట గాక

మతి జనన మెరుగ మరణం బెరుగను
ఇతవుగ నినునిక నెరిగేనా
క్షితి బుట్టించిన శ్రీపతి నీవే
తతి నాపై దయ దలతువు గాక

తలచ బాపమని తలచ బుణ్యమని
తలపున ఇక నిను దలచేనా
అలరిన నాలో అంతర్యామివి
కలుష మెడయ నను గాతువు గాక

తడవ నా హేయము తడవ నా మలినము
తడయక నీ మేలు దడవేనా
విడువలేని శ్రీ వేంకట విభుడవు
కడదాక నిక గాతువు గాక
=====================

51. నానాటి బదుకు నాటకము (రాగం - ముఖారి)

నానాటి బదుకు నాటకము
కానక కన్నది కైవల్యము

పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాటకము
యెట్ట నెదుట గల దీ ప్రపంచము
కట్ట గడపటిది కైవల్యము

కుడిచే దన్నము కోక చుట్టెడిది
నడ మంత్రపు పని నాటకము
వొడి గట్టుకొనిన వుభయ కర్మములు
గడి దాటినపుడె కైవల్యము

తెగదు పాపము తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము
యెగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము
=====================

52. భావములోనా బాహ్యమునందును (రాగం - దేసాక్షి)

భావములోనా బాహ్యమునందును
గోవింద గోవిందయని కొలువవో మనసా

హరి యవతారములే యఖిల దేవతలు
హరి లోనివే బ్రహ్మాండంబులు
హరి నామములే అన్ని మంత్రములు
హరి హరి హరి హరి యనవో మనసా

విష్ణుని మహిమలే విహిత కర్మములు
విష్ణుని పొగడెడి వేదంబులు
విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు
విష్ణువు విష్ణువని వెదకవో మనసా

అచ్యుతుడితడే ఆదియు నంత్యము
అచ్యుతుడే యసురాంతకుడు
అచ్యుతుడు శ్రీవేంకటాద్రి మీదనిదె
అచ్యుత యచ్యుత శరణనవో మనసా
=====================

53. నారాయణతే నమో నమో (రాగం - పాడి)

నారాయణతే నమో నమో
నారద సన్నుత నమో నమో

మురహర భవహర ముకుంద మాధవ
గరుడ గమన పంకజనాభ
పరమపురుష భవబంధ విమోచన
నరమృగశరీర నమో నమో

జలధిశయన రవి చంద్రవిలోచన
జలరుహ భవనుత చరణయుగ
బలిబంధన గోపవధూవల్లభ
నలినోదర తే నమో నమో

ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహన రూప
వేదోద్ధర శ్రీ వేంకటనాయక
నాదప్రియ తే నమో నమో
=====================

54. జయ జయరామా సమరవిజయ రామా (రాగం - గుండక్రియ)

జయ జయరామా సమరవిజయ రామా
భయ హర నిజ భక్త పారీణరామా

జలధి బంధించిన సౌమిత్రి రామా
సెలవిల్లు విరచిన సీతారామా
అల సుగ్రీవు నేలిన అయోధ్య రామా
కలిగి యజ్ఞముగాచే కౌసల్య రామా

అరి రావణాంతక ఆదిత్యకుల రామా
గురు మౌనులను గాచే కోదండ రామా
ధర నహల్యపాలిటి దశరథ రామా
హరురాణి నుతుల లోకాభిరామా

అతి ప్రతాపముల మాయామృగాంతకరామా
సుత కుశలవ ప్రియ సుగుణ రామా
వితత మహిమల శ్రీ వెంకటాద్రి రామా
మతిలోన బాయని మనువంశ రామా
=====================

55. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీసతి వల్లభా (రాగం -
మాళవి)

శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీసతి వల్లభా
శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయకా

కమలధరుడును కమలమిత్రుడు కమలశత్రుడు పుత్రుడు
క్రమముతో మీకొలువు కిప్పుడు కాచినా రెచ్చరికయా

అనిమిషేంద్రులు మునులు దిక్పతులమర కిన్నర సిద్ధులు
ఘనతతో రంభాదికాంతలు కాచినా రెచ్చరికయా

ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను గొలువగ వచ్చిరీ
విన్నపము వినవయ్య తిరుపతి వేంకటాచలనాయకా
=====================

56. దేవ దేవం భజే దివ్యప్రభావం (రాగం - ధన్నాసి)

దేవ దేవం భజే దివ్యప్రభావం
రావణాసురవైరి రణపుంగవం

రాజవరశేఖరం రవికులసుధాకరం
ఆజానుబాహు నీలాభ్రకాయం
రాజారి కోదండ రాజ దీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రం

నీలజీమూత సన్నిభశరీరం ఘనవి
శాలవక్షం విమల జలజనాభం
తాలాహినగహరం ధర్మసంస్థాపనం
భూలలనాధిపం భోగిశయనం

పంకజాసన వినుత పరమనారాయణం
శంకరార్జిత జనక చాపదళనం
లంకా విశోషణం లాలితవిభీషణం
వెంకటేశం సాధు విబుధ వినుతం
=====================

57. ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు (రాగం - భూపాళం)

ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు
అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి

అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి
ప్రతిలేని గోపుర ప్రభలు గంటి
శతకోటి సూర్య తేజములు వెలుగగ గంటి
చతురాస్యు బొడగంటి చయ్యన మేల్కొంటి

కనకరత్న కవాట కాంతు లిరుగడగంటి
ఘనమైన దీపసంఘములు గంటి
అనుపమ మణీమయమ్మగు కిరీటము గంటి
కనకాంబరము గంటి గ్రక్కన మేల్కొంటి

అరుదైన శంఖ చక్రాదు లిరుగడ గంటి
సరిలేని యభయ హస్తము గంటి
తిరువేంకటాచలాధిపుని జూడగ గంటి
హరి గంటి గురు గంటి నంతట మేల్కంటి
=====================

58. చేరి కొల్వరో యీతడు శ్రీదేవుడు (రాగం - శ్రీరాగం)

చేరి కొల్వరో యీతడు శ్రీదేవుడు
యీ రీతి శ్రీ వెంకటాద్రి నిరవైన దేవుడు

అలమేలుమంగ నురమందిడుకొన్న దేవుడు
చెలగి శంఖ చక్రాల చేతి దేవుడు
కల వరద హస్తము గటి హస్తపు దేవుడు
మలసీ శ్రీ వత్స వనమాలికల దేవుడు

ఘన మకర కుండల కర్ణముల దేవుడు
కనక పీతాంబర శృంగార దేవుడు
ననిచి బ్రహ్మాదుల నాభి గన్న దేవుడు
జనించె బాదాల గంగ సంగతైన దేవుడు

కోటి మన్మథాకార సంకులమైన దేవుడు
జూటపు గిరీటపు మించుల దేవుడు
వాటపు సొమ్ముల తోడి వసుధాపతి దేవుడు
యీటులేని శ్రీవేంకటేశుడైన దేవుడు
=====================

59. పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము (రాగం - అట్టతాళం)

పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము
నెడయకవయ్య కోనేటి రాయడా

కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల
నేరిచి పెద్దలిచ్చిన నిధానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు
చేరువజిత్తములోని శ్రీనివాసుడా

భావింప గైవసమైన పారిజాతమా, మమ్ము
చేవదేర గాచినట్టి చింతామణీ
కావించి కోరికలిచ్చే కామధేనువా, మమ్ము
తావై రక్షించేటి ధరణీధరా

చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగా
లడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము
గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా

=====================

60. ఇతరులకు నిను నెఱుగదరమా (రాగం - శ్రీరాగం)

ఇతరులకు నిను నెఱుగదరమా

సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విర
హితు లెఱుంగుదురు నిను నిందిరా రమణా

నారీకటాక్ష పటు నారాచ భయరహిత
శూరు లెఱుగుదురు నిను జూచేటి చూపు
ఘోర సంసార సంకుల పరిచ్ఛేదులగు
ధీరు లెఱుగుదురు నీ దివ్య విగ్రహము

రాగభోగవిదూర రంజితాత్ములు మహా
భాగు లెఱుగుదురు నిను బ్రణుతించు విధము
ఆగమోక్త ప్రకారాభిగమ్యులు మహా
యోగు లెఱుగుదురు నీ వుండేటి వునికి

పరమ భాగవత పద పద్మసేవా నిజా
భరణు లెఱుగుదురు నీ పలికేటి పలుకు
పరగు నిత్యానంద పరిపూర్ణ మానస
స్థిరు లెఱుంగుదురు నిను తిరు వేంకటేశ