Tuesday, September 21, 2010

poem written by Devulapalli Ramanuja Rao from his essay మా ఊరు ఓరుగల్లు, from the book he wrote called పచ్చ తోరణం

కాబోలు నియ్యది కాకతీయులొకప్డు
కరకు నెత్తుట కత్తికడుగు చోటు

కాబోలు నీద్వార కల్యాణ వేదిక
అలికి ముగ్గులు పెట్టె తెలుగు పడుచు
కాబోలు నీజీర్ణకమనీయ సౌధాన
సుకుమార శిల్పముల్ సొంపులొలికె
కాబోలు నీవీధికాపురంబొనరించె
పైడి మేడలలోన భాగ్యలక్ష్మి
ఇచటనే నిల్చి కాబోలు నిందుముఖులు
ఆయుధంబులు పూజించియరుగుదెంచు
ఆంధ్రసేనకు కపురంపుటారతులను
ఇచ్చి వారల శౌర్యంబు మెచ్చినారు

No comments:

Post a Comment