Saturday, September 11, 2010

Telugu Pedda Samyakalu

10^10      సహస్ర కోటి (ఆర్బుదము)
10^11      న్యర్భుదము
10^12     ఖర్వము
10^13    మహా ఖర్వము
10^14    పద్మము
 10^15    మహా పద్మము
10^16    క్షోణి
 10^17   మహా క్షోణి
10^18    శంఖము
10^19    మహా శంఖము
 10^20    క్షితి
10^21    మహా క్షితి
10^22    క్షోభము
10^23   మహా క్షోభము
10^24    నిధి
10^25    మహా నిధి
10^26   పరతము
10^27   పరార్థము
10^28   అనంతము
 10^29 సాగరము
10^30  అవ్యాయము
10^31   అమృతము
10^32  అచింత్యము
10^33  అమేయము
10^34   భూరి
10^35    మహా భూరి

అన్నమయ్య సంకీర్తనాలు



















[Source: అన్నమయ్య పద సౌరభం - రెండవ భాగం
స్వరకర్త నేదునూరి కృష్ణమూర్తి
ప్రచురణ - నాదసుధాతరంగిణి]

1. అలమేలుమంగనీ వభినవరూపము (వాల్యూం 12-159)

అలమేలుమంగనీ వభినవరూపము
జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మ

గరుడాచలాధీశు ఘనవక్షముననుండి
పరమానంద సంభిరతవై
నెరతనములు జూపి నిరంతరమునాథుని
హరుషింపగ జేసి తిగదమ్మ

శశికిరణములకు చలువలచూపులు
విశదముగా మీద వెదజల్లుచు
రసికత పెంపున కరగించి ఎప్పుడు నీ
వశముజేసుకొంటి వల్లభునోయమ్మ

రట్టడి శ్రీవేంకటరాయనికి నీవు
పట్టపురాణివై పరగుచు
వట్టిమాకులిగిరించు వలపుమాటలవిభు
జట్టిగొని వురమునసతమైతివమ్మ
=====================

2. వలదననొరులకు (వాల్యూం 4-17)

వలదననొరులకు వశమటవే
తలచినట్లనిది దైవమెచేసె

తరుణికుచములను తామరమొగుడలు
విరిసేనోయని వెరపునను
సరగునపతినఖ చంద్రశకలములు
దరులుగలుగనిది దైవమెచేసె

పొలతివదనమను పున్నమచంద్రుడు
బలిమినెగయునని భయమునను
మెలుతచికురధ మ్మిల్లపురాహువు
తలచెదరగనిది దైవమెచేసె

వనితకువాడునొ వలపుతాపమున
తనులతికయనుచు తమకమున
ఘనవేంకటపతి కౌగిటచమటల
తనివి దీర్చనిది దైవమె చేసె
=====================

3. పురుషోత్తముడవీవు (వాల్యూం 2-53)

పురుషోత్తముడవీవు పురుషాధముడనేను
ధరలోననాయందు మంచితనమేది

అనంతాపరాధములు అటునేముసేసివి
అనంతమైనదయ అది నీది
నినునెఱగకుండేటి నీచ గుణము నాది
ననునెడయకుండేటి గుణము నీది

సకలయాచకమే సరుసనాకుపని
సకలరక్షకత్వము సరి నీపని
ప్రకటించినిన్ను దూరేపలుకేనా కెప్పుడూను
వెకలివైనను గాచేవిధమునీది

నేరమింతయు నాది నేరుపింతయు నీది
సారెకు అజ్ఞాని నేను జ్ఞానివి నీవు
యీరీతి వేంకటేశయిట్టేనను నేలితివి
ధారుణిలో నిండెను ప్రతాపమునీది
=====================

4. భక్తికొలది వాడే (వాల్యూం 1-410)

భక్తికొలది వాడే పరమాత్ముడు
భుక్తిముక్తి తానెయిచ్చు భువి పరమాత్ముడు

పట్టినవారిచే బిడ్డ పరమాత్ముడు
బట్టబయటి ధనము పరమాత్ముడు
పట్టపగటి వెలుగు పరమాత్ముడు
యెట్టనెదుటనే వున్నాడిదె పరమాత్ముడు

పచ్చిపాలలోనివెన్న పరమాత్ముడు
బచ్చనవాసినరూపు పరమాత్ముడు
బచ్చుచేతివొరగల్లు పరమాత్ముడు
యిచ్చుకొలదివాడువో యీ పరమాత్ముడు

పలుకులలోనితేట పరమాత్ముడు
ఫలియించునిందరికి పరమాత్ముడు
బలిమిశ్రీ వేంకటాద్రి పరమాత్ముడు
యెలమి జీవులప్రాణమీ పరమాత్ముడు
=====================

5. ఏమొకో చిగురుటధరమున (వాల్యూం 12-82)

ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా

కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన
చెలువంబిప్పుడిదేమో చింతింపరేచెలులు
నలువున ప్రాణేశ్వరునిపై నాటినయాకొనచూపులు
నిలువునపెరుకగనంటిన నెత్తురుకాదుకదా

పడతికి చనుగవమెరుగులు పైపై పయ్యెద వెలుపల
కడుమించిన విధమేమో కనుగొనరే చెలులు
వుడుగని వేడుకతో ప్రియుడొత్తిన నఖశశిరేఖలు
వెడలగవేసవికాలపు వెన్నెలకాదుకదా

ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల
వొద్దికలాగులివేమో ఊహింపరే చెలులు
గద్దరి తిరువేంకటపతి కొగిటియధరామృతముల
అద్దిన సురతపు చెమటల అందము కాదు కదా
=====================

6. తెలిసిన వారికి దేవుండితడే (వాల్యూం 3-480)

తెలిసిన వారికి దేవుండితడే
వలవని దుష్టుల వాదములేల

పురుషులలోపల పురుషోత్తముడు
నరులలోన నరనారాయణుడు
పరదైవములకు పరమేశ్వరుడు
వరుసమూఢుల కెవ్వరోయితడు

పలుబ్రహ్మలకును పరబ్రహ్మము
మలయునీశులకు మహేశుడితడు
ఇలనాత్మలలో నిటుపరమాత్ముడు
ఖలులకెట్లుండునో కానము యితడు

వేదంబులలో వేదాంతవేద్యుడు
సోదించకరిగాచుచో నాదిమూలము
యీదెస శ్రీ వేంకటేశుడిందరికి
గాదిలి మతులను గైకొనడితడు
=====================

7. కొలిచిన వారల (వాల్యూం 3-419)

కొలిచిన వారల కొంగుపైడితడు
బలిమి తారక బ్రహ్మమీతడు

యినవంశాంబుధి నెగసిన తేజము
ఘన యజ్ఞంబుల గల ఫలము
మనుజరూపమున మనియెడి బ్రహ్మము
నినుపుల రఘుకుల నిథానమితడు

పరమాన్నములోపలి సారపుజవి
పరగినదివిజుల భయహరము
మరిగినసీతా మంగళ సూత్రము
ధరలో రామావతారంబితడు

చకితదానవుల సంహారచక్రము
సకలవన చరుల జయకరము
వికసితమగు శ్రీవేంకట నిలయము
ప్రకటిత దశరథ భాగ్యంబితడు
=====================

8. అంతరంగమెల్ల (వాల్యూం 1-437)

అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటె
వింతవింత విధముల వీడునా బంధములు

మనుజుడై ఫలమేది మరిజ్ఞాని యౌదాకా
తనువెత్తి ఫలమేది దయగలుగుదాకా
ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాకా
పనిమాలి ముదిసితే పాసెనా భవము

చదివియు ఫలమేది శాంతము కలుగుదాకా
పెదవెత్తి ఫలమేది ప్రియమాడు దాకా
మదిగల్గి ఫలమేది మాధవుదలచు దాకా
యెదుట తాను రాజైతే ఏలేనాపరము

పావనుడై ఫలమేది భక్తి కలిగిన దాకా
జీవించి ఫలమేది చింత దీరుదాకా
వేవేల ఫలమేది వేంకటేశుగన్నదాక
భావించితా దేవుడైతే ప్రత్యక్షమౌనా
=====================

9. భక్తినీపై దొకటె పరమసుఖము (వాల్యూం 3-322)

భక్తినీపై దొకటె పరమసుఖము
యుక్తిజూచిన నిజం బొక్కటేలేదు

కులమెంత గలిగెనది కూడించు గర్వంబు
చలమెంత గలిగెనది జగడమే రేచు
తలపెంత పెంచినా తగిలించు కోరికలు
యెలమి విజ్ఞానంబు యేమిటాలేదు

ధనమెంత గలిగెనది దట్టమౌలోభంబు
మొనయు చక్కదనంబు మోహములు రేచు
ఘనవిద్య గలిగినను కప్పు పై పై మదము
యెనయగ పరమ పద మించుకయులేదు

తరుణులెందరు అయిన తాపములు సమకూడు
సిరులెన్ని గలిగినను చింతలేపెరుగు
యిరవయిన శ్రీవేంకటేశు నినుకొలువగా
పెరిగె నానందంబు బెళకులికలేవు
=====================

10. విశ్వరూపమిదివో (వాల్యూం 3-409)

విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో
శాశ్వతులమైతిమింక జయము నాజన్మము

కొండవంటి హరిరూపు గురుతైన తిరుమల
పండిన వృక్షములే కల్పతరువులు
నిండిన మృగాదులెల్ల నిత్యముక్తజనములు
మెండుగ ప్రత్యక్షమాయె మేలువోనాజన్మము

మేడవంటి హరిరూపు మించైనపైడి గోపుర
మాడనే వాలిన పక్షుల మరులు
వాడల కోనేటి చుట్ల వైకుంఠ నగరము
యీడమాకు పొడచూపె ఇహమేపోపరము

కోటిమదనులవంటి గుడిలో చక్కని మూర్తి
యీటులేని శ్రీ వేంకటేశుడితడు
వాటపు సొమ్ములు ముద్ర వక్షపుటలమేల్మంగ
కూటువైనన్నేలితి యెక్కువనోనాతాపము
=====================

11. అవధారు రఘుపతి (వాల్యూం 3-492)

అవధారు రఘుపతి అందరిని చిత్తగించు
యివలనిండే కొలువిదెనదె సముఖాన

రామరాఘవరామ రామచంద్రప్రభో
శ్రీమదయోధ్యాధిపతి సీతాపతి
ప్రేమనారదుడు పాడిపెక్కురంభాదులాడేరు
మోమెత్తి కపులెల్ల మ్రొక్కేరదివో

యినవంశకుల జాత ఇక్ష్వాకుకులతిలక
ఘనదశరథసుత కౌశికప్రియ
మునులు దీవించేరు ముందట భరతుడదె
వెనక లక్ష్మణుడు సేవించీ వింజామర

కందువకౌసల్యాగర్భ రత్నాకర
చెందిన శ్రీవేంకటాద్రి శ్రీనివాస
సందడి కుశలవులు చదివేరు వొకవంక
చెంది నీరాజసము చెప్పరాదు రామ
=====================

12. రామచంద్రుడితడు (వాల్యూం 10-147)

రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములీయ గలిగెనిందరికి

గౌతము భార్యపాలిటి కామధేనువితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి యితడు
యీతడు దాసుల పాలిటి యిహపర దైవము

పరగసుగ్రీవుపాలి పరమ బంధువితడు
సరిహనుమంతుపాలి సామ్రాజ్యము
నిరతి విభీషణునిపాలి నిధానము యీతడు
గరిమజనకు పాలి ఘనపారిజాతము

తలప శబరిపాలి తత్వపు రహస్యము
అలరిగుహునిపాలి ఆదిమూలము
కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి
వెలయ శ్రీవేంకటాద్రి విభుడితడు
=====================

13. పలువిచారము లేల (వాల్యూం 3-100)

పలువిచారములేల పరమాత్మనీవు నాకు
కలవు కలవు ఉన్న కడమలేమిటికి

నీపాదముల చెంత నిబిడమైతే చాలు
యేపాతకములైన ఏమిసేసును
యేపార నీభక్తి ఇంత గలిగిన చాలు
పై పై సిరులచ్చట పాదుకొని నిలుచు

సొరిదినీ శరణము జొచ్చితినంటే చాలు
కరుణించి యప్పుడట్టే కాతువు నీవు
సరుస నీముద్రలు భుజములనుంటే చాలు
అరుదుగా చేతనుండు అఖిలలోకములు

నేరకవేసిన చాలు నీమీద ఒక పువ్వు
కోరిన కోరికలెల్ల కొనసాగును
మేరతో శ్రీవేంకటేశ నిన్నుగొలిచితి నేను
యేరీతినుండిన గాని యిన్నిటా ఘనుడను
=====================

14. ఇతరములిన్నియు (వాల్యూం 1-86)

ఇతరములిన్నియు నేమిటికి
మతిచంచలమే మానుటపరము

ఎక్కడి సురపుర మెక్కడి వైభవ
మెక్కడి విన్నియునేమిటికి
యిక్కడనే పరహితమును పుణ్యము
గక్కున జేయగ గలదిహ పరము

యెవ్వరు చుట్టములెవ్వరు బంధువు
లెవ్వరిందరును నేమిటికి
రవ్వగు లక్ష్మీరమణుని దలపుచు
యివ్వలదా సుఖియించుట పరము

యెందరు దైవము లెందరు వేల్పులు
యెందరిందరును నేమిటికి
కందువెఱిగి వేంకటగిరి రమణుని
చిందులేక కొలిచినదిహ పరము
=====================

15. నారాయణాచ్యుతానంత (వాల్యూం 2-423)

నారాయణాచ్యుతానంత గోవింద హరి
సారముగ నీకునే శరణంటిని

చలువయును వేడియును నటల సంసారంబు
తొలకు సుఖమొకవేళ దుఃఖమొకవేళ
ఫలములివె యీ రెండు పాపములు పుణ్యములు
పులుసు దీపును గలపి భుజియించినట్లు

పగలు రాత్రులరీతి బహుజన్మ మరణాలు
తగుమేను పొడచూపు తనుదానె తొలగు
నగియించు నొకవేళ నలగించు నొకవేళ
వొగరు కారపు విడెము ఉబ్బించినట్లు

యిహము పరమును వలెనె యెదిటికల్లయు నిజము
విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని
సహజ శ్రీ వేంకటేశ్వర నన్ను కరుణింప
బహువిధంబుల నన్ను పాలించవే
=====================

16. ఏటి సుఖము (వాల్యూం 1-135)

ఏటి సుఖము మరి ఏటి సుఖము
ఒకమాట మాత్రము నటమటమైన సుఖము

కొనసాగు దురితములె కూడైన సుఖము
తను విచారములలో దాకొన్న సుఖము
పనిలేని యాసలకు బట్టయిన సుఖము
వెనక ముందర జూడ వెరగైన సుఖము

నిందలకులోనైన నీరసపు సుఖము
బొందికిని లంచంబు పుణికేటి సుఖము
కిందుపడి పరులముంగిలి గాచు సుఖము
పందివలె తనుదానె బ్రతికేటి సుఖము

ధృతిమాలి యిందరికి దీనుడగు సుఖము
మతిమాలి భంగములు మరపించు సుఖము
పతి వేంకటేశు కృప పడసినది సుఖము
యితరంబులన్నియును నీ పాటి సుఖము
=====================

17. నవనీతచోర (వాల్యూం 3-24)

నవనీతచోర నమోనమో నవమహిమార్ణవ నమోనమో

హరినారాయణ కేశవాచ్యుతకృష్ణ
నరసింహ వామన నమోనమో
మురహర పద్మనాభ ముకుంద గోవింద
నరనారాయణ నమోనమో

నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవ
నగధర నందగోప నమోనమో
త్రిగుణాతీతదేవ త్రివిక్రమ ద్వారక
నగరాధినాయక నమోనమో

వైకుంఠ రుక్మిణీ వల్లభ చక్రధర
నాకేశవందిత నమోనమో
శ్రీకర గుణనిధి శ్రీవేంకటేశ్వర
నాకజనుత నమోనమో
=====================

18. ఆలాగు పొందులును (వాల్యూం 1-30)

ఆలాగు పొందులును అటువంటి కూటములు
యీలాగు లౌటనేడిదె చూడనైతి

అడియాస చూపులకు నాసగించితిగాని
వెడమాయలనిలోను వెదకలేనైతి
కడువేడుకల దగిలి గాసిబొందితిగాని
యెడలేని పరితాప మెఱగలేనైతి

చిరునగవుమాటలకు చిత్తగించితిగాని
తరితీపులని లోను తలుపలేనైతి
వరుసమోహపు బసలవలల చిక్కితిగాని
గరువంపు పొలయలుక గానలేనైతి

శ్రీ వేంకటేశ్వరుని చింతజేసితిగాని
దేవోత్తమునిలాగు తెలియలేనైతి
యీ వైభవముపై నిచ్చగించితి గాని
యీ వైభవానంద మిది పొందనైతి
=====================

19. రాముడు లోకాభిరాముడు (వాల్యూం 2-219)

రాముడు లోకాభిరాముడు త్రైలోక్య
ధాముడు రణరంగ భీముడు వాడే

వరుడు సీతకు, ఫలాధరుడు మహోగ్రపు
శరుడు రాక్షస సంహరుడు వాడే
స్థిరుడు సర్వగుణాకరుడు కోదండ దీక్షా
గురుడు సేవకశుభకరుడు వాడే

ధీరుడు లోకైకవీరుడు సకలా
ధారుడు భవబంధదూరుడు వాడే
శూరుడు ధర్మవిచారుడు రఘువంశ
సారుడు బ్రహ్మసాకారుడు వాడే

బలుడు యిన్నిటా రవికులుడు భావించ, ని
ర్మలుడు నిశ్చలుడవికలుడు వాడే
వెలసి శ్రీ వేంకటాద్రి నిజనగరములోన
తలకొనె పుణ్యపాదతలుడు వాడే
=====================

20. కొలనిలోన (వాల్యూం 2-214)

కొలనిలోనమునుగోపికలు
మొలకనవ్వులతో మ్రొక్కిరి నీకు

పిరుదులు దాటిన పింఛపు టలకల
తురుములు వీడగ తొయ్యెలులు
అరిది నితంబులందునెదాచుక
మురిపెపు కరముల మ్రొక్కిరినీకు

నిద్దపు మానము నెలతలు లోగుచు
గద్దరి తొడలనె గట్టుచును
ముద్దుటుంగరంబుల కరములతో
ముద్దులు గునియుచు మ్రొక్కిరి నీకు

పాలిండ్ల పెనుభారంబుల
మూలపు మెరుగులు ముంచగను
వేలపు ప్రియముల వేంకటేశనిను
మూలకుపిలుచుచు మ్రొక్కిరి నీకు
=====================

21. అమరాంగనలదె (వాల్యూం 10-26)

అమరాంగనలదె ఆడేరు
ప్రమదంబుననదె పాడేరు

గరుడవాహనుడు కనక రథముపై
ఇరవుగ వీధుల నేగేని
సురలును మునులును సొంపుగ మోకులు
తెరలిచి తెరలిచి తీసేరు

ఇలధరుడదివో ఇంధ్రరథముపై
కెలయుచు దిక్కులు గెలిచీని
బలు శేషాదులు బ్రహ్మశివాదులు
చెలగి సేవలటు సేసేరు

అలమేల్మంగతో నటు శ్రీవేంకట
నిలయుడరదమున నెగడేని
నలుగడ ముక్తులు నారదాదులును
పొలుపు మీరకడు పొగడేరు
=====================

22. పసిడియక్షంతలివె (వాల్యూం 3-194)

పసిడియక్షంతలివె పట్టరో వేగమె రారో
దెసల పేరంటాండ్లు దేవుని పెండ్లికిని

శ్రీవేంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి
దైవికపు పెండ్లిముహూర్తము నేడు
కావించి భేరులు మ్రోసె గరుడధ్వజంబెక్కె
దేవతలు రారో దేవుని పెండ్లికిని

కందర్ప జనకునకి కమలాదేవికి పెండ్లి
పందిలిలోపల తలంబాలు నేడు
గంధమూ విడెమిచ్చేరు కలువడాలు గట్టిరి
అందుక మునులు రారో హరి పెండ్లికిని

అదె శ్రీ వేంకటపతికి అలమేలు మంగకును
మొదలి తిరుణాళ్ళకు మ్రొక్కేము నేడు
యెదుట నేగేరు వీరెయిచ్చేరు వరములివె
కదలిరారో పరుష ఘనుల పెండ్లికిని
=====================

23. పాపపుణ్యముల రూపము (వాల్యూం 1-28)

పాపపుణ్యముల రూపము దేహమిది దీని
దీపనంబణగింప తెరువెందులేదు

అతిశయంబైన దేహాభిమానము దీర
గతిగాని పుణ్యసంగతి బొందరాదు
మతిలోని దేహాభిమానంబు బిడుచుటకు
రతిపరా~జ్ముఖుడు గాక రవణంబు లేదు

సరిలేని మమకారజలధి దాటినగాని
అరుదైన నిజసౌఖ్యమది వొందరాదు
తిరువేంకటాచలాధిపుని గొలిచినగాని
పరగు బ్రహ్మానంద పరుడుతాకాడు
=====================

24. సకలశాంతికరము (వాల్యూం 3-377)

సకలశాంతికరము సర్వేశ నీపై భక్తి సర్వేశ
ప్రకటమై మాకు నబ్బె బతికించు నిదియె సర్వేశ

మనసులో పాపబుద్ధి మరియెంత దలచిన
నినుదలచినంతనే నీఱౌను
కనుగొన్న పాపములు కడలేనివైనాను
ఘనుడనిన్ను జూచితే కడకు దొలగును

చేతనంటి పాతకాలు సేనగానే జేసినాను
ఆతల నీకు మ్రొక్కితే నన్నియు బాయు
ఘాతలజెవుల వినగా నంటిన పాపము
నీతితో నీ కథ వింటే నిమిషానబాయును

కాయమున జేసేటి కర్మపు పాపములెల్ల
కాయపునీ ముద్రలచే గ్రక్కున వీడు
యేయెడ వేంకటేశ యేయేపాతకమైనా
అయమైన నీ శరణాగతిచే నణగు
=====================

25. చాలుచాలును (వాల్యూం 12-45)

చాలుచాలును భోగసమయమున మైమఱపు
పాలుపడునట యేటి బ్రతుకురా ఓరీ

ఇందుముఖినిను కౌగిలించి లోపలి జగము
కందునని నీ బిగువు కౌగిలే వదలె
పొందైన వారితో పొసగ కౌగిట జేర్ప
పొందుగాదట యేటి పొందురా ఓరీ

నెలత నీ వాలు కన్నులు మూసి జగమెల్ల
కలయ చీకట్లైన గక్కనను వదలె
వలచిన అంగనలు తమ వలసిన విలాసముల
వలను నెఱపనిదేటి వలపురా ఓరీ

కొమ్మ నీ ఉరముపై గోరు దివియుచునాత్మ
నిమ్మైన ననుతాక నిద్దరిని తాకె
దిమ్మరివి కోనేటి తిమ్మ నీపై ప్రియము
కుమ్మరించని దేటి కోర్కిరా ఓరీ
=====================

26. తరుణినీయలుక (వాల్యూం 12-70)

తరుణినీయలుకకెంతటిది ఇంతినీ వేళ
కరుణించగదర వేంకటశైలనాథ

ఒకమారు సంసారమొల్ల బొమ్మని తలచు
ఒక మారు విధిసేతలూహించి పొగడు
ఒక మారు తనుజూచి వూరకే తలవూచు
నొకమారు హర్షమున నొందిమేమఱచు

నినుజూచివొకమారు నిలువెల్ల పులకించు
తనుజూచి వొకమారు తలపోసి నగును
కనుదెరచి నినుజూచి కడు సిగ్గువడి నిలిచి
యిన్నియును తలపొసి యింతలో మఱచు

వదలైన మొలనూలు గదియించు నొకమారు
చెదరిన కురులెల్ల చెరుగునొకమారు
అదనెరిగి తిరువేంకటాధీశ పొందితివి
చదురుడవునిను బాయ జాలదొకమారు
=====================

27. ఆకటి వేళల అలపైన వేళలను (వాల్యూం 1-158)

ఆకటి వేళల అలపైన వేళలను
తేకువ హరినామమే దిక్కుమరి లేదు

కొఱమాలియున్నవేళ కులముచెడినవేళ
చెరవడి వొరులచే జిక్కిన వేళల
వొరపైన హరినామ మొక్కటే గతిగాక
మరచి తప్పిననైన మఱిలేదు తెఱగు

ఆపదవచ్చినవేళ యారడిబడినవేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామ మొక్కటే గతిగాక
మాపుదాకా బొరలిన మరిలేదు తెఱగు

సంకెళ బెట్టిన వేళ చంపబలిచిన వేళ
అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వెంకటేశు నామమే విడిపించగతిగాక
మంకుబుద్ధి పొరలిన మరిలేదు తెఱగు
=====================

28. అదె చూడరే (వాల్యూం details not given in the book! )

అదె చూడరే మోహన రూపం
పది కోట్లుగల భావజ రూపం

వెలయగ పదారువేల మగువలను
అలమిన ఘన మోహన రూపం
వలచిన నంద వ్రజము గొల్లెతల
కులుకు చూపులకు గురియగు రూపం

ఇందిరా వనిత నెప్పుడు తన ఉర
మందు నిలిపిన మోహన రూపం
కందువ భూసతి కౌగిటి సొంపుల
విందులు మరగిన వేడుక రూపం

త్రిపురసతుల బోధించి రమించిన
అపురూపపు మోహన రూపం
కపురుల శ్రీ వేంకటపతి యైయిల
ఉపమించగ రాని ఉన్నత రూపం
=====================

29. ప్రతిలేని పూజదలపంగ (వాల్యూం 12-300)

ప్రతిలేని పూజదల పంగకోటి మణుగులై
అతివ పరవశము బ్రహ్మానందమాయె

మానినీమణిమనసు మంచియాసనమాయె
ఆనందబాష్పజల మర్ఘ్యాదులాయె
మీనాక్షి కనుదోయి మించుదీపములాయె
ఆనన సుధారసంబభిషేకమాయె

మగువచిరునవ్వులే మంచి క్రొవ్విరులాయె
తగుమేనితావి చందనమలదుటాయె
నిగనిగనీతనుకాంతి నీరాజనంబాయె
జగడంపుటలుకలుపచారంబులాయె

ననుపైన పొందులె నైవేద్య తతులాయె
తనివోని వేడుకలు తాంబూలమాయె
వనిత శ్రీ వేంకటేశ్వరుని కౌగిట జేయు
వినయ వివరంబు లరవిరిమ్రొక్కులాయె
=====================

30. మరలిమరలి జయమంగళము (వాల్యూం 1-448)

మరలి మరలి జయమంగళము
సొరిదినిచ్చలును శుభమంగళము

కమలారమణికి కమలాక్షునకును
మమతల జయజయ మంగళము
అమరజననికిని అమరవంద్యునకు
సుముహూర్తముతో శుభమంగళము

జలధికన్యకును జలధిశాయికిని
మలయుచును శుభమంగళము
కలిమికాంత కాకలికి విభునికిని
సుళువుల యారతి శుభమంగళము

చిత్తజు తల్లికి శ్రీ వేంకటపతికి
మత్తిల్లిన జయ మంగళము
యిత్తల నత్తల యిరువురకౌగిటి
జొత్తుల రతులకు శుభమంగళము
==================================================
Source: అన్నమాచార్యుల సంకీర్తనలు TTD Publ. Series No.128
==================================================

31. విన్నపాలు వినవలె వింత వింతలు (రాగం - భూపాళం)

విన్నపాలు వినవలె వింత వింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా

తెల్లవారె జామెక్కె దేవతలు మునులు
అల్లనల్ల నంతనింత నదిగోవారే
చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు
మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా

గరుడ కిన్నరయక్ష కామినులు గములై
విరహపు గీతముల వింతాలాపాల
పరిపరివిధముల బాడేరునిన్నదివో
సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా

పొంకపు శేషాదులు తుంబురునారదాదులు
పంకజభవాదులు నీ పాదాలు చేరి
అంకెలనున్నారు లేచి అలమేలుమంగను
వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా
=====================

32. అలరులు గురియగ నాడెనదే (రాగం - శంకరాభరణం)

అలరులు గురియగ నాడెనదే
అలకల గులుకుల నలమేలుమంగ

అరవిరి సొబగుల నతివలు మెచ్చగ
అర తెర మరుగున నాడె నదే
వరుసగ పూర్వదు వాళపు తిరుపుల
హరి గరగింపుచు నలమేలుమంగ

మట్టపు మలపుల మట్టెలకెలపుల
తట్టెడి నడపుల దాటెనదే
పెట్టిన వజ్రపు పెండెపు దళుకులు
అట్టిట్టు చిమ్ముచు నలమేలుమంగ

చిందుల పాటల శిరిపొలయాటల
అందెల మ్రోతల నాడె నదే
కందువ తిరువెంకటపతి మెచ్చగ
అందపు తిరుపుల నలమేలుమంగ
=====================

33. కులుకక నడవరో కొమ్మలాలా (రాగం - దేసాళం)

కులుకక నడవరో కొమ్మలాలా
జలజల రాలీని జాజులు మాయమ్మకు

ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాదతాకు కాంతులాలా
పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మిద
అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు

చల్లెడి గందవొడియై జారీ నిలువరో
పల్లకి వట్టిన ముద్దు బణతులాల
మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర
గల్లనుచు గంకణాలు గదలీమాయమ్మకు

జమళి ముత్యాల తోడి చమ్మాళిగ లిడరో
రమణికి మణుల నారతు లెత్తరో
అమరించి కౌగిట నలమేలు మంగనిదె
సమకూడె వేంకటేశ్వరుడు మా యమ్మకు
=====================

34. చక్కని తల్లికి చాంగుభళా తన (రాగం - పాడి)

చక్కని తల్లికి చాంగుభళా తన
చక్కెర మోవికి చాంగుభళా

కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సళుపు జూపులకు చాంగుభళా
పలుకుల సొంపుల బతితో గసరెడి
చలముల యలుకకు చాంగుభళా

కిన్నెరతో పతి కెలన నిలుచు తన
చన్ను మెఱుగులకు చాంగుభళా
ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి చాంగుభళా

జందెపు ముత్యపు సరులహారముల
చందన గంధికి చాంగుభళా
విందయి వెంకట విభుబెన చినతన
సంది దండలకు చాంగుభళా
=====================

35. పలుకు దేనెల తల్లి పవళించెను (రాగం - సాళంగనాట)

పలుకు దేనెల తల్లి పవళించెను
కలికి తనముల విభుని గలసినది గాన

నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర
పగలైన దాక జెలి పవళించెను
తెగని పరిణతులతో తెల్లవారినదాక
జగదేక పతి మనసు జట్టి గొనె గాన

కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి
బంగారు మేడపై బవళించెను
చెంగలువ కనుగొనల సింగారములు దొలక
అంగజ గురునితోడ నలసినదిగాన

మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై
పరవశంబున దరుణి పవళించెను
తిరు వేంకటాచలా ధిపుని కౌగిట గలసి
అరవిరై నును జెమలు నంటినదిగాన
=====================

36. వలదన నొరులకు వసమటవే (రాగం - సామంతం)

వలదన నొరులకు వసమటవే
తలచినట్లు నిది దైవమె చేసె

తరుణి కుచములను తామర మొగుడలు
విరిసేనో యని వెరపునను
సరగున బతి నఖ చంద్రశకలములు
దరుల గలుగ నివి దైవమె చేసె

పొలతి వదనమను పున్నమ చంద్రుడు
బలిమి నెగయునని భయమునను
మెలుత చికుర ధమ్మిల్లపు రాహువు
తల జెదరగ నిది దైవమె సేసె

వనితకు వాడునొ వలపు తాపమున
తనులతిక యనుచు దమకమున
ఘన వేంకటపతి కౌగిట చెమటల
దనివి దీర్చనిది దవమె సేసె
=====================

37. ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము మఱి (రాగం - ముఖారి)

ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము మఱి
యిదిగాక వైభవం బిక నొకటి కలదా

అతివ జన్మము సఫలమై పరమయోగివలె
నితర మోహాపేక్ష లిన్నియును విడిచె
సతి కోరికలు మహాశాంతమై యిదె చూడ
సతత విజ్ఞాన వాసన వోలె నుండె

తరుణి హృదయము కృతార్థత బొంది విభుమీది
పరవశానంద సంపదకు నిరవాయ
సరసిజానన మనో జయ మంది యింతలో
సరిలేక మనసు నిశ్చలభావమాయ

శ్రీ వేంకటేశ్వరుని జింతించి పరతత్త్వ
భావంబు నిజముగా బట్టె జెలియాత్మ
దేవోత్తముని కృపాధీనురాలై యిపుడు
లావణ్యవతికి నుల్లంబు దిరమాయ
=====================

38. పొద్దికనెన్నడు వొడచునొ పోయిన చెలిరాదాయను (రాగం - సామంతం)

పొద్దికనెన్నడు వొడచునొ పోయిన చెలిరాదాయను
నిద్దుర గంటికి దోపదు నిమిషంబొక యేడు

కన్నుల నవ్వెడి నవ్వులు గబ్బితనంబుల మాటలు
నున్నవి యొయ్యారంబులు నొచ్చిన చూపులును
విన్నదనంబుల మఱపులు వేడుక మీరిన యలపులు
సన్నపు జెమటలు దలచిన ఝల్లనె నా మనసు

ఆగిన రెప్పల నీరును నగ్గలమగు పన్నీటను
దోగియు దోగని భావము దోచిన పయ్యెదయు
కాగిన దేహపు సెకలును కప్పిన పువ్వుల సొరబులు
వేగిన చెలి తాపమునకు వెన్నెల మండెడిని

దేవశిఖామణి తిరుమల దేవుని దలచిన బాయక
భావించిన యీ కామిని భావము లోపలను
ఆ విభుడే తానుండిక నాతడె తానెఱగగవలె
నీ వెలదికి గల విరహంబేమని చెప్పుదము
=====================

39. జవ్వాది మెత్తినది అది తన (రాగం - శంకరాభరణం)

జవ్వాది మెత్తినది అది తన
జవ్వనమే జన్నె వట్టినది

ముద్దుల మాటలది అది చెక్కు
టద్దముల కాంతి నలరినది
గద్దరి చూపులది అది తన
వొద్ది చెలియమీద నొరగున్నది

పుత్తడి బోలినది అది తన
చిత్తము ని సొమ్ము చేసినది
గుత్తపు గుబ్బలది అది అల
చిత్తజుని లెక్క సేయనిది

ఎమ్మెలు యెఱుగనిది అది తన
కెమ్మోవి జిరునవ్వు గెరలున్నది
కమ్ముకొనగ వెంకటరాయా నీ
కమ్మని కౌగిట గలశున్నది
=====================

40. విరహపు రాజదె విడిదికి రాగా (రాగం - సామంతం)

విరహపు రాజదె విడిదికి రాగా
సిరుల జేసె నిదె సింగారములూ

నెలత నుదుటిపై నీలపు గురులనె
తొలుతనె కట్టెను దోరణము
మొలక చెమటలనె ముత్యపు మ్రుగ్గులు
అలరిచె మదనుండదె చెలిమేన

దట్టముగా జింతా లతనే వడి
బెట్టి జప్పరము పెనగొనగ
పట్టిన మైతావులు పరిమళములు
కట్టించెను చెంగట వలరాజు

విందగు వేంకట విభుని ప్రేమచే
బొందగ బెట్టెను బోనాలు
ఇందువదనకీ యిందిరావిభుని
కందుదేర నలు కలు చలి చేసె
=====================

41. కొమ్మ తన ముత్యాల కొంగు జారగ బగటు (రాగం - ఆహిరి)

కొమ్మ తన ముత్యాల కొంగు జారగ బగటు
కుమ్మరింపుచు దెచ్చు కొన్నదీ వలపు

ఒయ్యారమున విభుని వొరపు గనుగొని రెప్ప
మయ్యు నేరక మహా మురిపెమునను
కయ్యంపు గూటమికి గాలు దువ్వుచు నెంతె
కొయ్యతనమున దెచ్చు కొన్నదీ వలపు

పైపైనె ఆరగింపకుము పన్నీరు గడు
తాపమవునని చెలులు దలకగానే
తోపు సేయుచు గెంపు దొలకు గన్నుల కొనల
కోపగింపుచు దెచ్చు కొన్న దీవలపు

ఎప్పుడును బతితోడ నింతేసి మేలములు
ఒప్పదని చెలిగోర నొత్తగానే
యెప్పుడో తిరువేంకటేశు కౌగిట గూడి
కొప్పుగులుకుచు దెచ్చు కొన్నదీవలపు
=====================

42. చేరి యశోదకు శిశువితడు (రాగం - శుద్ధవసంతం)

చేరి యశోదకు శిశువితడు
ధారుణి బ్రహ్మకు దండ్రియు నితడు

సొలసి చూచినను సూర్య చంద్రులను
లలి వెద చల్లెడు లక్షణుడు
నిలిచిన నిలువున నఖిల దేవతల
కలిగించు సురల గనివో యితడు

మాటలాడినను మరి యజాండములు
కోటులు వొడమెటి గుణరాశి
నీటగు నూర్పుల నిఖిల వేదములు
చాటువ నూరెటి సముద్ర మితడు

ముంగిట మొలసిన మోహన మాత్మల
బొంగించే ఘన పురుషుడు
సంగతి మావంటి శరణాగతులకు
సంగము శ్రీ వేంకటాధిపు డితడు
=====================

43. మొత్తకురే అమ్మలాల ముద్దులాడు వీడె (రాగం - కాంభోజి)

మొత్తకురే అమ్మలాల ముద్దులాడు వీడె
ముత్తెమువలె నున్నాడు ముద్దులాడు

చక్కని యశోద తన్ను సలిగతో మొత్తరాగా
మొక్క బోయీ గాళ్ళకు ముద్దులాడు
వెక్కసాన రేపల్లె వెన్నలెల్లమాపుదాక
ముక్కున వయ్యగ దిన్న ముద్దులాడు

రువ్వెడి రాళ్ళదల్లి రోల దన్ను గట్టెనంట
మువ్వల గంటల తోడి ముద్దులాడు
నవ్వెడి జెక్కుల నిండ నమ్మిక బాలునివలె
మువ్వురిలో నెక్కుడైన ముద్దులాడు

వేల సంఖ్యల సతుల వెంట బెట్టుకొనిరాగా
మూల జన్నుగుడిచీని ముద్దులాడు
మేలిమి వెంకటగిరి మీదనున్నాడిదె వచ్చి
మూలభూతి దానైన ముద్దులాడు
=====================

44. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు (రాగం - సాళంగనాట)

ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు

అంత నింత గొల్లెతల అరచేతి మాణికము
పంత మాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ బూస
చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు

రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు

కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము
యేలేటి శ్రీ వేంకటాద్రి యింద్రనీలము
పాల జలనిధి లోన బాయని దివ్య రత్నము
బాలునివలె దిరిగీ బద్మ నాభుడు
=====================

45. ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని (రాగం - దేవగాంధారి)

ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని
బట్టి తెచ్చి పొట్టనిండ బాలు వోయరే

గామిడై పారితెంచి కాగెడి వెన్నెలలోన
చేమ పూవు కడియాల చేయి పెట్టి
చీమ గుట్టెనని తన చెక్కిట గన్నీరు జార
వేమరు వాపోయే వాని వెడ్డు వెట్టరే

ముచ్చువలె వచ్చి తన ముంగ మురువుల చేయి
తచ్చెడి పెరుగులోన దగబెట్టి
నొచ్చెనని చేయిదీసి నోర నెల్ల జొల్లుగార
వొచ్చెలి వాపోవువాని నూరడించరే

ఎప్పుడు వచ్చెనో మా యిల్లు చొచ్చి పెట్టెలోని
చెప్పరాని వుంగరాల చేయి పెట్టి
అప్పడైన వేంకటాద్రి అసవాలకుడు గాన
తప్పకుండ బెట్టె (బట్టి) వాని తలకెత్తరే
=====================

46. ఉగ్గు వెట్టరే వోయమ్మా చె (రాగం - భైరవి)

ఉగ్గు వెట్టరే వోయమ్మా చె
య్యొగ్గీనిదె శిశు వోయమ్మా

కడుపులోని లోకమ్ములు గదలీ
నొడలూచకురే వోయమ్మా
తొడికెడి సరుగున దొలగ దీయరే
వుడికెడి పాలివి వోయమ్మా

చప్పలు వట్టుక సన్నపు బాలుని
నుప్పర మెత్తకు రోయమ్మా
అప్పుడె సకలము నదిమీనోరనె
వొప్పదు తియ్యరె వోయమ్మా

తొయ్యలు లిటు చేతుల నలగించక
వుయ్యల నిడరే వోయమ్మా
కొయ్య మాటలను కొండల తిమ్మని
నొయ్యన తిట్టకు రోరమ్మా
=====================

47. పలుమరు వుట్ల పండుగను (రాగం - ముఖారి)

పలుమరు వుట్ల పండుగను
చిలుకు చిడుక్కని చిందగను

ఊళ్ళవీధుల వుట్లు కృష్ణుడు
తాళ్ళు దెగిపడ దన్నుచును (న్నగను?)
పెళ్ళు కఠిల్లు పెఠిల్లని
పెళ్ళుగ మ్రోసె పెనురవము

బంగా(గ)రు బిందెల బాలు బెరుగులు
ముంగిట నెగయుచు మోదగను
కంగు కళింగు కఠింగు ఖణింగని
రంగు మీరు పెను రవములై

నిగ్గుగ వేంకట నిలయుడుట్టిపా
లగ్గలిక బగుల నడువగను
భగ్గు భగిల్లని పరమామృతములు
గుగ్గిలి పదనుగ గురియగను
=====================

48. ఘమ్మని యెడి శృతి గూడగను (రాగం - పాడి)

ఘమ్మని యెడి శృతి గూడగను
కమ్మని నేతులు కాగగ జెలగె

నీలవర్ణుడని నీరజాక్షుడని
బాలుని నతివలు పాడేరో
పాలు పిదుకుచును బానల కాగుల
సోలిపెరుగు త్రచ్చుచు జెలరేగి

మందరధరుడని మాధవుడని గో
విందుని బాడేరు వెలదులిదే
నందవ్రజమున నలుగడనావుల
మందల బేయల మంచిరవముల

వెంకటపతియని వేదనిలయుడని
పంకజనాభుని బాడేరు
అంకుల చేతను నలరు రవంబుల
బింకపు మాటల బృందావనమున
=====================

49. ఉయ్యాలా బాలునూచెదరు కడు (రాగం - శంకరాభరణం)

ఉయ్యాలా బాలునూచెదరు కడు
నొయ్య నొయ్య నొయ్యనుచు

బాలయవ్వనలు పసిడివుయ్యాల
బాలుని వద్ద పాడేరు
లాలి లాలి లాలి లాలెమ్మ
లాలి లాలి లాలి లాలనుచు

తమ్మిరేకు గనుదమ్ముల నవ్వుల
పమ్ము జూపుల బాడేరు
కొమ్మలు మట్టెల గునుకుల నడపుల
ధిమ్మి ధిమ్మి ధిమ్మి ధిమ్మనుచు

చల్లు జూపుల జవరాండ్లురే
పల్లె బాలుని బాడేరు
బల్లిదు వేంకటపతి జేరి యందెలు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లనుచు
=====================

50. దీనుడనేను దేవుడవు నీవు (రాగం - శుద్ధవసంతం)

దీనుడనేను దేవుడవు నీవు
నీ నిజ మహిమే నెరపుట గాక

మతి జనన మెరుగ మరణం బెరుగను
ఇతవుగ నినునిక నెరిగేనా
క్షితి బుట్టించిన శ్రీపతి నీవే
తతి నాపై దయ దలతువు గాక

తలచ బాపమని తలచ బుణ్యమని
తలపున ఇక నిను దలచేనా
అలరిన నాలో అంతర్యామివి
కలుష మెడయ నను గాతువు గాక

తడవ నా హేయము తడవ నా మలినము
తడయక నీ మేలు దడవేనా
విడువలేని శ్రీ వేంకట విభుడవు
కడదాక నిక గాతువు గాక
=====================

51. నానాటి బదుకు నాటకము (రాగం - ముఖారి)

నానాటి బదుకు నాటకము
కానక కన్నది కైవల్యము

పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాటకము
యెట్ట నెదుట గల దీ ప్రపంచము
కట్ట గడపటిది కైవల్యము

కుడిచే దన్నము కోక చుట్టెడిది
నడ మంత్రపు పని నాటకము
వొడి గట్టుకొనిన వుభయ కర్మములు
గడి దాటినపుడె కైవల్యము

తెగదు పాపము తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము
యెగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము
=====================

52. భావములోనా బాహ్యమునందును (రాగం - దేసాక్షి)

భావములోనా బాహ్యమునందును
గోవింద గోవిందయని కొలువవో మనసా

హరి యవతారములే యఖిల దేవతలు
హరి లోనివే బ్రహ్మాండంబులు
హరి నామములే అన్ని మంత్రములు
హరి హరి హరి హరి యనవో మనసా

విష్ణుని మహిమలే విహిత కర్మములు
విష్ణుని పొగడెడి వేదంబులు
విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు
విష్ణువు విష్ణువని వెదకవో మనసా

అచ్యుతుడితడే ఆదియు నంత్యము
అచ్యుతుడే యసురాంతకుడు
అచ్యుతుడు శ్రీవేంకటాద్రి మీదనిదె
అచ్యుత యచ్యుత శరణనవో మనసా
=====================

53. నారాయణతే నమో నమో (రాగం - పాడి)

నారాయణతే నమో నమో
నారద సన్నుత నమో నమో

మురహర భవహర ముకుంద మాధవ
గరుడ గమన పంకజనాభ
పరమపురుష భవబంధ విమోచన
నరమృగశరీర నమో నమో

జలధిశయన రవి చంద్రవిలోచన
జలరుహ భవనుత చరణయుగ
బలిబంధన గోపవధూవల్లభ
నలినోదర తే నమో నమో

ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహన రూప
వేదోద్ధర శ్రీ వేంకటనాయక
నాదప్రియ తే నమో నమో
=====================

54. జయ జయరామా సమరవిజయ రామా (రాగం - గుండక్రియ)

జయ జయరామా సమరవిజయ రామా
భయ హర నిజ భక్త పారీణరామా

జలధి బంధించిన సౌమిత్రి రామా
సెలవిల్లు విరచిన సీతారామా
అల సుగ్రీవు నేలిన అయోధ్య రామా
కలిగి యజ్ఞముగాచే కౌసల్య రామా

అరి రావణాంతక ఆదిత్యకుల రామా
గురు మౌనులను గాచే కోదండ రామా
ధర నహల్యపాలిటి దశరథ రామా
హరురాణి నుతుల లోకాభిరామా

అతి ప్రతాపముల మాయామృగాంతకరామా
సుత కుశలవ ప్రియ సుగుణ రామా
వితత మహిమల శ్రీ వెంకటాద్రి రామా
మతిలోన బాయని మనువంశ రామా
=====================

55. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీసతి వల్లభా (రాగం -
మాళవి)

శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీసతి వల్లభా
శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయకా

కమలధరుడును కమలమిత్రుడు కమలశత్రుడు పుత్రుడు
క్రమముతో మీకొలువు కిప్పుడు కాచినా రెచ్చరికయా

అనిమిషేంద్రులు మునులు దిక్పతులమర కిన్నర సిద్ధులు
ఘనతతో రంభాదికాంతలు కాచినా రెచ్చరికయా

ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను గొలువగ వచ్చిరీ
విన్నపము వినవయ్య తిరుపతి వేంకటాచలనాయకా
=====================

56. దేవ దేవం భజే దివ్యప్రభావం (రాగం - ధన్నాసి)

దేవ దేవం భజే దివ్యప్రభావం
రావణాసురవైరి రణపుంగవం

రాజవరశేఖరం రవికులసుధాకరం
ఆజానుబాహు నీలాభ్రకాయం
రాజారి కోదండ రాజ దీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రం

నీలజీమూత సన్నిభశరీరం ఘనవి
శాలవక్షం విమల జలజనాభం
తాలాహినగహరం ధర్మసంస్థాపనం
భూలలనాధిపం భోగిశయనం

పంకజాసన వినుత పరమనారాయణం
శంకరార్జిత జనక చాపదళనం
లంకా విశోషణం లాలితవిభీషణం
వెంకటేశం సాధు విబుధ వినుతం
=====================

57. ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు (రాగం - భూపాళం)

ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు
అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి

అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి
ప్రతిలేని గోపుర ప్రభలు గంటి
శతకోటి సూర్య తేజములు వెలుగగ గంటి
చతురాస్యు బొడగంటి చయ్యన మేల్కొంటి

కనకరత్న కవాట కాంతు లిరుగడగంటి
ఘనమైన దీపసంఘములు గంటి
అనుపమ మణీమయమ్మగు కిరీటము గంటి
కనకాంబరము గంటి గ్రక్కన మేల్కొంటి

అరుదైన శంఖ చక్రాదు లిరుగడ గంటి
సరిలేని యభయ హస్తము గంటి
తిరువేంకటాచలాధిపుని జూడగ గంటి
హరి గంటి గురు గంటి నంతట మేల్కంటి
=====================

58. చేరి కొల్వరో యీతడు శ్రీదేవుడు (రాగం - శ్రీరాగం)

చేరి కొల్వరో యీతడు శ్రీదేవుడు
యీ రీతి శ్రీ వెంకటాద్రి నిరవైన దేవుడు

అలమేలుమంగ నురమందిడుకొన్న దేవుడు
చెలగి శంఖ చక్రాల చేతి దేవుడు
కల వరద హస్తము గటి హస్తపు దేవుడు
మలసీ శ్రీ వత్స వనమాలికల దేవుడు

ఘన మకర కుండల కర్ణముల దేవుడు
కనక పీతాంబర శృంగార దేవుడు
ననిచి బ్రహ్మాదుల నాభి గన్న దేవుడు
జనించె బాదాల గంగ సంగతైన దేవుడు

కోటి మన్మథాకార సంకులమైన దేవుడు
జూటపు గిరీటపు మించుల దేవుడు
వాటపు సొమ్ముల తోడి వసుధాపతి దేవుడు
యీటులేని శ్రీవేంకటేశుడైన దేవుడు
=====================

59. పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము (రాగం - అట్టతాళం)

పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము
నెడయకవయ్య కోనేటి రాయడా

కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల
నేరిచి పెద్దలిచ్చిన నిధానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు
చేరువజిత్తములోని శ్రీనివాసుడా

భావింప గైవసమైన పారిజాతమా, మమ్ము
చేవదేర గాచినట్టి చింతామణీ
కావించి కోరికలిచ్చే కామధేనువా, మమ్ము
తావై రక్షించేటి ధరణీధరా

చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగా
లడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము
గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా

=====================

60. ఇతరులకు నిను నెఱుగదరమా (రాగం - శ్రీరాగం)

ఇతరులకు నిను నెఱుగదరమా

సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విర
హితు లెఱుంగుదురు నిను నిందిరా రమణా

నారీకటాక్ష పటు నారాచ భయరహిత
శూరు లెఱుగుదురు నిను జూచేటి చూపు
ఘోర సంసార సంకుల పరిచ్ఛేదులగు
ధీరు లెఱుగుదురు నీ దివ్య విగ్రహము

రాగభోగవిదూర రంజితాత్ములు మహా
భాగు లెఱుగుదురు నిను బ్రణుతించు విధము
ఆగమోక్త ప్రకారాభిగమ్యులు మహా
యోగు లెఱుగుదురు నీ వుండేటి వునికి

పరమ భాగవత పద పద్మసేవా నిజా
భరణు లెఱుగుదురు నీ పలికేటి పలుకు
పరగు నిత్యానంద పరిపూర్ణ మానస
స్థిరు లెఱుంగుదురు నిను తిరు వేంకటేశ

వేమన పద్యాలు

వేమన సూక్తి ముత్కావళి


1) అగ్నిచేతబట్టి యా పరమేశుని
నిమ్దచేసి నరులు నీరుకారె?
దక్షు క్రతవులోని తల్లడమెఋఉగరా?
విశ్వదాభిరామ వినురవేమ.


2) అమ్తరమ్గమమ్దు నపరాధములు చేసి
మమ్చివానివలెనె మనుజుడుమ్డు
ఇతరు లెఋఉగకున్న నీశ్వరుడెఋఉగడా?
విశ్వదాభిరామ వినురవేమ.


3) అమ్తరాత్మగనక యల్పబుధ్ధులతోడ
మెలగెడు జనులెల్ల మేదినిపయి
యముని నరకమునకు నరుగమ్గ సాక్ష్యము
విశ్వదాభిరామ వినురవేమ.


4) అధికుడైన రా జొకల్పుని జేపట్ట
వానిమాట చెల్లు వసుధలోన
గణకు లొప్పియున్న గవ్వలు చెల్లవా?
విశ్వదాభిరామ వినురవేమ.


5) ఇనుము విఋఇగెనేని యినుమాఋఉ ముమ్మాఋఉ
కాచి యతుకనేర్చు గమ్మరీడు
మనసు విఋఇగినేని మఋఇయమ్ట నేర్చునా?
విశ్వదాభిరామ వినురవేమ.


6) ఎమ్త సేవచేసి యేపాటు పడినను
రాచమూక నమ్మరాదురన్న
పాముతోడిపొమ్దు పదివేలకైనను
విశ్వదాభిరామ వినురవేమ.


7) ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ?
వివరమెఋఇగి చూడు వ్రుత్తియమ్దు
నేర్పులేనివాని నెఋఅయోధుడమ్దురా?
విశ్వదాభిరామ వినురవేమ.


8) ఒకరి నోరుకొట్టి యొకరు భక్షిమ్చిన
వాని నోరు మిత్తి వరుసగొట్టు
చేపపిమ్డు బెద్ద చేపలు చమ్పును
చేపలన్ని జనుడు చమ్పు వేమ.


9) కల్ల నిజముజేసి కపటభావముజేమ్ది
ప్రల్లదమ్బులాడు భక్తిలేక
మాయలాడుఖలుడు మహితాత్ముసాటియా?
విశ్వదాభిరామ వినురవేమ.


10) గుఋఋఅమునకు దగిన గుఋఉతైన రౌతున్న
గుఋఋఅములు నడచు గుఋఉతుగాను
గుర్తు దుర్జనులకు గుణము లిట్లుమ్డురా
విశ్వదాభిరామ వినురవేమ.


11) ఎడ్డెవానికి గురుతోర్చి చెప్పినగాని
తెలియబడునె యాత్మ దెలివిలేక
చెడ్డ కొడుకు తమ్డ్రి చెప్పిన వినడయా
విశ్వదాభిరామ వినురవేమ.


12) కమ్డ చక్కెఋఅయును గలియ బాల్పోసిన
తఋఇమి పాము తన్నుదాకుగాదె
కపటమున్నవాని గన్పెట్టవలె సుమీ
విశ్వదాభిరామ వినురవేమ.


13) కలియుగమ్బునమ్దు ఘనతకు నైచ్యము
ఘనత నైచ్యమునకు గలుగుచుమ్డు
శ్రధ్ధ భక్తులుడిగి జనులుమ్ద్రు కావున
విశ్వదాభిరామ వినురవేమ


14) కల్లుకుమ్డకెన్ని ఘనభూషణము లిడ్డ
అమ్దులోని కమ్పు చిమ్దులిడదె?
తులవ పదవిగొన్న దొలి గుణమేమగు?
విశ్వదాభిరామ వినురవేమ.


15) కానివానితోడగలసి మెలమ్గిన
హానివచ్చు నెమ్తవానికైన
కాకిగూడి హమ్స కష్టమ్బు పొమ్దదా?
విశ్వదాభిరామ వినురవేమ.


16) కూళ కూళ్ళుమేయు గుణమమ్త చెడనాడి
నెట్టివారు మెచ్చరట్టివాని
కొయ్యదూలమునకు గుదురునా ఞానమ్బు?
విశ్వదాభిరామ వినురవేమ.


17) కైపుమీఋఉవేళ గడకుజేరగరాదు
అనువుదప్పి మాటలాడరాదు
సమయమెఋఉగనతడు సరసుమ్డుకాడయా?
విశ్వదాభిరామ వినురవేమ.


18) కొమ్డగుహలనున్న గోవెలమ్దున్న
మెమ్డుగాను బూది మెత్తియున్న
దుష్టబుధ్ధులకును దుర్బుధ్ధి మానునా?
విశ్వదాభిరామ వినురవేమ.


19) కోతిబట్టి తెచ్చి క్రొత్తపుట్టముగట్టి
కొమ్డమ్రుచ్చులెల్ల గొలిచినట్లు
నీతిహీనునొద్ద నిర్భాగ్యులుమ్దురు
విశ్వదాభిరామ వినురవేమ.


20) గమ్గపాఋఉచుమ్డ గదలని గతితోడ
ముఋఇకివాగు పాఋఉ మ్రోతతోడ
అధికుడొర్చునట్టు లధముడోర్వగలేడు
విశ్వదాభిరామ వినురవేమ.


21) చదువులన్ని చదివి చాలవివేకియై
కలుషచిత్తుడైన ఖలుని గుణము
దాలిగుమ్టగుక్క తలచిన చమ్దమౌ
విశ్వదాభిరామ వినురవేమ.


22) చమ్పగూడ దెట్టి జమ్తువునైనను
చమ్పవలయు లోకశత్రుగుణము
తేలుకొమ్డిగొట్ట దేలేమిచేయురా
విశ్వదాభిరామ వినురవేమ.


23) ఛర్ధి పుట్టినప్డు సాపడసైపదు
నాతిగన్న యప్డు నీతి తగదు
చేటు మూడినపుడు మాటలు తోచవు
విశ్వదాభిరామ వినురవేమ.


24) టక్కరులను గూడి యొక్క సక్కెములాడ
నిక్కమైన ఘనుని నీతిచెడును
ఉల్లితోట బెరుగు మల్లెమొక్కకరణి
విశ్వదాభిరామ వినురవేమ.


25) డెమ్దమమ్దు దలచు దెప్పరమెప్పుడు
నోర్వలేనిహీను డొరునికట్టె
తనకు మూడుసుమ్మి తప్పదెప్పటికైన
విశ్వదాభిరామ వినురవేమ.


26) తనకుగలుగు పెక్కు తప్పులటుమ్డగా
పరులనేరుచుమ్డు నరుడు తెలియ
డొడలెఋఉమ్గ డనుచు నొత్తి చెప్పమ్గవచ్చు
విశ్వదాభిరామ వినురవేమ.


27) తనర న్రుపతితోడ దగ దుర్జనునితోడ
అగ్నితోడ బరుని యాలితోడ
హాస్యమాడుటెల్ల నగును ప్రాణామ్తము
విశ్వదాభిరామ వినురవేమ.


28) తేలుకుమ్డును తెలియగొమ్డి విషమ్బు
ఫణికినుమ్డు విషము పమ్డ్లయమ్దు
తెలివిలేని వామ్డ్ర దేహమెల్ల విషమ్బు
విశ్వదాభిరామ వినురవేమ.


29) దాసరయ్య తప్పు దమ్డమ్బుతో సరి
మోసమేది తన్ను ముమ్చుకున్న?
నీచుడై చెడునటు నీచుల నమ్మిన
విశ్వదాభిరామ వినురవేమ.


30) దుమ్డగీడు కొడుకు కొమ్డీడు చెలికాడు
బమ్డరాజునకును బడుగుమమ్త్రి
కొమ్డముచ్చునకును కోతియె సరియగు
విశ్వదాభిరామ వినురవేమ.








31) దుష్టజనులు మీఋఇ తుమ్టరిపనులను
శిష్టకార్యములుగ జేయుచుమ్ద్రు
కూడదనెడువారి గూడ నిమ్దిమ్తురు
విశ్వదాభిరామ వినురవేమ.


32) దూరద్రుష్టిగనరు తూగిదనుకను
బారుపట్టెఋఉగౌ పడినదనుక
దమ్డసాధ్యులరయ ధర్మసాధ్యులుకారు
విశ్వదాభిరామ వినురవేమ.


33) నేరని జనులకును నేరముల నేర్పుచు
చక్కచేయరిల నసాధులెపుడు
ఒప్పు దుర్జనములు తప్పగనెమ్తురు
విశ్వదాభిరామ వినురవేమ.


34) నొసలు బత్తుడయ్యె నోరు తోడేలయ్యె
మనసు భూతమువలె మలయగాను
శివుని గామ్తు ననుచు సిగ్గేలగాదురా?
విశ్వదాభిరామ వినురవేమ.


35) పరులు చదువజూచి నిరసనబుధ్ధితో
వట్టిమాటలాడు వదరుబోతు
అట్టి ఖలుని జాడలరయుట దోసము
విశ్వదాభిరామ వినురవేమ.


36) పాలు పమ్చదార పాపరపమ్డ్లలో
చాలబోసి వమ్డ జవికిరావు
కుటిలమానవులకు గుణమేల కల్గురా?
విశ్వదాభిరామ వినురవేమ.


37) బిడియ మిమ్తలేక పెద్దను నేనమ్చు
బొమ్కములను బల్కు సమ్కఠునకు
ఎచ్చు కలుగదిచట జచ్చిన రాదట
విశ్వదాభిరామ వినురవేమ.


38) మాటలాడు టొకటి మనసులో నొక్కటి
ఒడలిగుణ మదొకటి నడత యొకటి
ఎట్లుకలుగు ముక్తి యిట్టులుమ్డగ తాను
విశ్వదాభిరామ వినురవేమ.


39) ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు
పరగ మూలికలకు బనికివచ్చు
నిర్దయుమ్డు ఖలుడు నీచుడెమ్దులకగు?
విశ్వదాభిరామ వినురవేమ.


40) రేగుపుచ్చకాయ రేయెల్ల దన్నిన
మురగ దమ్తకమ్త పెరుగుగాని
ఒరులు ఛీయన్నను నోగు సిగ్గెఋఉగునా?
విశ్వదాభిరామ వినురవేమ.








41) వమ్పుకఋఋఅగాచి వమ్పు తీర్చగవచ్చు
కొమ్డలన్ని పిమ్డిగొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరగిమ్పరాదు
విశ్వదాభిరామ వినురవేమ.


42) వాక్కు శుధ్ధిలేని వైనదమ్డాలు
ప్రేమ కలిగినట్టు పెట్టనేల?
నొసట బత్తిజూపు నోరు తోడేలయా
విశ్వదాభిరామ వినురవేమ.


43) ఎమ్త చదువు చదివి యెన్ని నేర్చినగాని
హీనుడవగుణమ్బు మానలేడు
బొగ్గు పాలగడుగ బోవునా మలినమ్బు
విశ్వదాభిరామ వినురవేమ.


44) వేము బాలుపోసి వేయేమ్డ్లు పెమ్చిన
జేదు విడిచి తీపి జెమ్దబోదు
ఓగు గుణము విడిచి యుచితఞుడగు నెట్లు?
విశ్వదాభిరామ వినురవేమ.


45) వేఋఉ పురుగుచేరి వ్రుక్షమ్బు జెఋఉచును
చీడపురుగుచేరి చెట్టుజెఋఉచు
కుచ్చితుమ్డు చేరి గుణవమ్తు జెరుచురా
విశ్వదాభిరామ వినురవేమ.


46) సారవిద్యలమ్దు సరణి దెలియలేక
దూరమమ్దు జేరు దుర్జనుమ్డు
పరముదెలియ నతడు భావఞుడెట్లగు?
విశ్వదాభిరామ వినురవేమ.


47) అభిజాత్యముననె యాయువున్నమ్తకు
దిరుగుచుమ్డ్రు భ్రమల దెలియలేక
మురికి భామ్డమునను ముసరునీగలరీతి
విశ్వదాభిరామ వినురవేమ.


48) ఇహమునమ్దుబుట్టి ఇమ్గిత మెఋఉగని
జనుల నెమ్చి చూడ స్థావరములు
జమ్గమాదులనుట జగతిని పాపమ్బు
విశ్వదాభిరామ వినురవేమ.


49) ఎడ్డెదెల్పవచ్చు నేడాదికైనను
మౌనిదెల్పవచ్చు మాసముననె
మొప్పెదెల్పరాదు ముప్పదేమ్డ్లకునైన
విశ్వదాభిరామ వినురవేమ.


50) ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన
నలుపు నలుపేకాని తెలుపు కాదు
కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా?
విశ్వదాభిరామ వినురవేమ.




51) ఔనటమ్చు నొక్కడాడిన మాటకు
కాదటమ్చు బలుక క్షణము పట్టు
దాని నిలువదీయ దాతలు దిగివచ్చు
విశ్వదాభిరామ వినురవేమ.




52) ఔర! యెమ్తవార లల్లరి మానవుల
ప్రభువైన గేలిపఋఅతు రెన్న
దా దెగిమ్చువాడు దమ్డియౌ భువిలోన
విశ్వదాభిరామ వినురవేమ.




53) కన్నులమ్దు మదము కప్పి కానరుగాని
నిరుడు ముమ్దటేడు నిన్న మొన్న
దగ్ధులైనవారు తమకమ్టె తక్కువా?
విశ్వదాభిరామ వినురవేమ.


54) కర్మగుణములన్ని కడబెట్టి నడువమి
దత్త్వమెట్లు తన్ను దగులుకొనును?
నూనె లేక దివ్వె నూవుల వెల్గునా?
విశ్వదాభిరామ వినురవేమ.


55) కసరు తినును గాదె పసర్మ్బు లెప్పుడు
చెప్పినట్లు వినుచుజేయు బనులు
వానిసాటియైన మానవుడొప్పడా?
విశ్వదాభిరామ వినురవేమ.


56) కసవును దినువాడు ఘనఫలమ్బుల రుచి
గానలేడుగాదె వానియట్లు
చిన్నచదువులకును మిన్నఞానమురాదు
విశ్వదాభిరామ వినురవేమ.


57) ఖరముపాలు తెచ్చి కాచి చక్కెఋఅవేయు
భక్ష్యమగునె యెన్న భ్రష్టుడట్లె
యెమ్త చెప్పి చివరనెసగిన బొసగునే?
విశ్వదాభిరామ వినురవేమ.


58) గాడ్దెమేనుమీద గమ్ఢమ్బు పూసిన
బూదిలోన బడచుబొరలు మరల
మోటువాని సొగసు మోస్తరియ్యది సుమీ
విశ్వదాభిరామ వినురవేమ.


59) గ్రుడ్డువచ్చి పిల్ల గోరడాలాడిన
విధముగా నెఋఉగక వెఋఋఇజనులు
ఞానులైనవారి గర్హిమ్తు రూరక
విశ్వదాభిరామ వినురవేమ.


60) చెఋఅకు తీపిలేమి జెత్తనాబడునట్లు
పరగ గుణములేని పమ్డితుమ్డు
దూఋఅపడునుగాదె దోషమటుమ్డగ
విశ్వదాభిరామ వినురవేమ.




61) చదివి చదివి కొమ్త చదువమ్గ చదువమ్గ
చదువుచదివి యిమ్కజదువు చదివి
చదువుమర్మములను చదువలేడయ్యెను
విశ్వదాభిరామ వినురవేమ


62) తగదు తగదటమ్చు తగువారు చెప్పిన
వినడు మొఋఅకు చెడును గొనకు నిజము,
మునులు చెప్పు ధర్మముల మీర్నిమ్తెకా
విశ్వదాభిరామ వినురవేమ.


63) తన్నుజూచి యొరులు తగమెచ్చవలెనని
సొమ్ములెఋఅవుదెచ్చి నెమ్మిమీఋఅ
నొరులకొరకుతానె యుబ్బుచునుమ్డును
విశ్వదాభిరామ వినురవేమ


64) తల్లి యున్నయపుడె తనదు గారాబము
లామె పోవ దన్ను నరయ రెవరు
మమ్చికాలమపుడె మర్యాద నార్జిమ్పు
విశ్వదాభిరామ వినురవేమ


65) తుమ్మచెట్టు ముమ్డ్లు తోడనేపుట్టును
విత్తులోననుమ్డి వెడలునట్లు
మూర్ఖునకును బుధ్ధి ముమ్దుగాబుట్టును
విశ్వదాభిరామ వినురవేమ


66) నీటిలోని వ్రాత నిలువకయున్నట్లు
పాటిజగతిలేదు పరములేదు
మాటిమాటికెల్ల మాఋఉను మూర్ఖుమ్డు
విశ్వదాభిరామ వినురవేమ


67) పాముకన్న లేదు పాపిష్టి యగు జీవి
యట్టి పాము చెప్పినట్టు వినును
ఇలను మూర్ఖుజెప్ప నెవ్వరి తరమయా
విశ్వదాభిరామ వినురవేమ


68) పొట్లకాయ రాయి పొదుగ ద్రాటను గట్ట
లీలతోడ వమ్క లేక పెరుగు
కుక్కతోకగట్ట గుదురునా చక్కగా?
విశ్వదాభిరామ వినురవేమ


69) మమ్చివారు లేరు మహిమీద వెదకిన
కష్టులెమ్దఋఐన గలరు భువిని
పసిడి లేదుగాని పదడెమ్త లేదయా
విశ్వదాభిరామ వినురవేమ


70) మ్రాను దిద్దవచ్చు మఋఇ వమ్కలేకుమ్డ
దిద్దవచ్చు రాయి తిన్నగాను
మనసు దిద్దరాదు మహిమీద నెవరికి
విశ్వదాభిరామ వినురవేమ


71) అమ్తరమ్గ మెఋఉగ హరుడౌను గురుడౌను
అమ్తరమ్గ మెఋఉగ నార్యుడగును
అమ్తరమ్గ మెఋఇగి నతడెపో శివయోగి
విశ్వదాభిరామ వినురవేమ.


72) అనల మిమ్చుకైన గనలి మమ్డునుగాని
చనువుగాని యొఋఉక మనికి నిడదు
తనువు మఋఅచువాడె తత్త్వఞుడగునయా
విశ్వదాభిరామ వినురవేమ.


73) చదువులన్ని చదివి చాల వివేకియౌ
కపటికెన్నడైన గలదెముక్తి?
నిర్మలాత్మకునకె నిశ్చలమ్పు సమాధి
విశ్వదాభిరామ వినురవేమ.


74) జక్కి నెక్కి వీధిజక్కగా వెలువడ
గుక్క విన్నివెమ్ట కూయదొడగు
ఘనున కోర్వలేని కాపురుషులు నిట్లె
విశ్వదాభిరామ వినురవేమ.


75) నేరనన్నవాడు నెఋఅజాణ మహిలోన
నేర్తునన్నవాడు వార్తకాడు
ఊరకున్నవాడె యుత్తమోత్తముడయా
విశ్వదాభిరామ వినురవేమ.


76) ఆత్మ తనలోన గమనిమ్చి యనుదినమ్బు
నిర్గుణాత్మార్చనముజేసి నిత్యమమ్ర
ప్రత్యగాత్మను లోనెమ్చి ప్రబల్యోగి
సచ్చిదానమ్ద పదమమ్దు సతము వేమ.


77) ఇమ్టిలోని జ్యోతి యెమ్తయు వెలుగగా
బొరుగువారి యగ్గి కరుగరెపుడు
తాను దైవమాయె, దైవము గొలుచునా?
విశ్వదాభిరామ వినురవేమ.


78) కస్తరి నటు చూడ గామ్తి నల్లగ నుమ్డు
పరిమళిమ్చు దాని పరిమళమ్బు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ.


79) కలుష మానసులకు గాన్పిమ్ప గారాదు
అడుసు లోన భాను డడగినట్లు
తేట నీరు పుణ్య దేహ మట్లుమ్డురా
విశ్వదాభిరామ వినురవేమ.


80) మాటలాడవచ్చు మనసు దెల్పగలేడు
తెలుప వచ్చు దన్ను తెలియలేడు
సురియబట్టవచ్చు శూరుడు కాలేడు
విశ్వదాభిరామ వినురవేమ.


81) ఊగియూగి లాగి యున్నది కనగోరు
సాగలాగి పట్టు సాక్షిగాను
యోగమమర ముక్తి నొమ్దును ప్రాఞుమ్డు.
విశ్వదాభిరామ వినురవేమ




82) కనగ సొమ్ము లెన్నొ కనకమ్బ దొక్కటి
పసుల వన్నె లెన్నొ పాలొకటియె
పుష్పజాతులెన్నొ పూజ యొక్కటె సుమీ.
విశ్వదాభిరామ వినురవేమ




83) కల్ల గురుడు గట్టు కర్మచయమ్బులు
మధ్య గురుడు గట్టు మమ్త్రచయము
ఉత్తముమ్డు గట్టు యోగ సామ్రాజ్యమ్బు.
విశ్వదాభిరామ వినురవేమ




84) చెఋఅకు తోటలోన జెత్త కుప్పుమ్డిన
కొమ్చమైన దాని గుణము చెడదు
ఎఋఉక గలుగు చోట నెడ్డె వాడున్నట్లు.
విశ్వదాభిరామ వినురవేమ




85) వెఋఋఇవాని మిగుల విసిగిమ్పగా రాదు
వెఋఋఇవాని మాట వినగ రాదు
వెఋఋఇ కుక్క బట్టి వేటాడగా రాదు
విశ్వదాభిరామ వినురవేమ




86) అల్పబుధ్ధివాని కధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పుతినెడికుక్క చెఋఅకు తీపెఋఉగున?
విశ్వదాభిరామ వినురవేమ.




87) అలమెఋఉగు యోధు డల్పుని జేరిన
మార్పుచేత బుధ్ధి మరిగి తిరుగు
మ్రానుమ్రాను తిరుగు మర్కట రీతిని
విశ్వదాభిరామ వినురవేమ.




88) కమ్డ చక్కెఋఅయును గలియ బాల్పోసిన
తఋఇమి పాము తన్నుదాకుగాదె
కపటమున్నవాని గన్పట్టవలె సుమీ
విశ్వదాభిరామ వినురవేమ.




89) కసినిగల్గి పాపకర్ముల బీడిమ్తు
రల్ల ప్రభులు యముని యల్లభటులు
వ్రుశ్చికమ్బుగన్న విడుతురే చమ్పక
విశ్వదాభిరామ వినురవేమ.




90) కులములో నొకడు గుణహీనుడుమ్డిన
(నెట్లో బుర్ర చెడినవాడు నోటికొచ్చిన్ట్లు ఫేలిన)
కులముచెడును వాని గుణమువలన
(నెట చెడును వాని దుర్గుణమువలన
ఎలమి చెఋఅకునమ్దు నెన్ను పుట్టినయల్లు
(చెడ్డవాని నోటికి విరేచనములు పట్టీన, మమ్చివారి
నోరులు మూయబడును.)
విశ్వదాభిరామ వినురవేమ




91) కుళ్ళుబోతునొద్ద గూడి మాటాడిన
గొప్ప మ్ర్మములను చెప్పరాదు
పేరు తీరుదెల్ప నూరెల్ల ముట్టిమ్చు
విశ్వదాభిరామ వినురవేమ.




92) కొమ్డముచ్చు పెమ్డ్లి కోతిపేరమ్టాలు
మొమ్డివాని హితుడు బమ్డవాడు
దుమ్డగీడునకును కొమ్డెడు దళవాయి
విశ్వదాభిరామ వినురవేమ.




93) కొమ్డెగాడు చావ గొమ్పవాకిటికిని
వచ్చిపోదురిమ్తె వగపులేదు
దూడ వగచునె భువిదోడేలు చచ్చిన
విశ్వదాభిరామ వినురవేమ




94) గాడ్దెయేమెఋఉమ్గు గమ్ధపువాసన
కుక్కయేమెఋఉమ్గు గొప్పకొద్ది
అల్పుడేమెఋఉమ్గు హరుని గొల్చు విరక్తి
విశ్వదాభిరామ వినురవేమ.


(ఎమ్త చదువు (దెగ్రీలు) వున్ననూ
ఎన్ని లక్షల డోలర్లు ఆర్జిమ్చిననూ
అల్పునకు ఞానమన్న రుచిమ్పదు, బుర్రకెక్క్దు.)




95) చమ్ద్రునమ్తవాడె శాపమ్బు చేతను
కళల హైన్యమమ్ద గలిగె గదర!
పుడమి జనులకెల్ల బుధ్ధు లిట్లుమ్డురా.
విశ్వదాభిరామ వినురవేమ.




96) వాదమాడడెపుడు వరుస నెవ్వరితోడ
జేరరాడు తాను చేటుదేడు
ఞాని యగుచు బుధుడుఘనత బొమ్దగజూచు
విశ్వదాభిరామ వినురవేమ.


------------------------------------------------------------------------
97 to 119 missing
------------------------------------------------------------------------


Verses on Women
********************




120) వలపు గలిగెనేని వనజాక్షి యధరమ్బు
పమ్చదారకుప్ప పాలకోవ
చూత ఫలరసమ్బు జున్నుసమానము
విశ్వదాభిరామ వినురవేమ


121) వలపు తీరెనేని వనజాక్షి యధరమ్బు
ములక పమ్టి గిజరు ముష్టిరసము
చిమ్త పోమ్త యగును జీడి సమానమౌ
విశ్వదాభిరామ వినురవేమ


122) రూపులేని వనిత రూఢి పతివ్రత
నీటు లేనివాడు పోటు బమ్టు
తెలుపవచ్చు నెట్లు దేవరభమ్టుమ
విశ్వదాభిరామ వినురవేమ


123) మొగము జూచినపుడె మోహమ్బు ఘనమౌను
ధనము జూచినపుడె తగులు మనసు
కూలి నష్టమైన గొరునే కొఋఅగామి
విశ్వదాభిరామ వినురవేమ


124) పచ్చదనము చూచి ఇచ్చను కాముకుల
చిచ్చులో బడుదురు క్షితితలమున
ఇచ్చ కలుగజేయు హెచ్చుగా మోహమ్బు
విశ్వదాభిరామ వినురవేమ


125) పమ్కజాక్షి గన్న బమ్గరు బొడగన్న
దిమ్మపట్టియుమ్డు తెలివియొప్పు
మనుజులకును తత్త్వ మహిమెట్లు కల్గురా
విశ్వదాభిరామ వినురవేమ


126) చక్కెఋఅ కలిపి తినమ్గా
ముక్కిన తవుడైన లెస్స మోహము కదుర
న్వెక్కుడు బానిసయైనన
మక్కువ గను దివ్యభామ మహిలో వేమా


127) కన్నెల నవలోకిమ్పగ
జన్నులపై ద్రుష్టి పాఋఉ సహజమ బిలలో
కన్నుల కిమ్పగు ద్రుష్టిని
తన్నెఋఉగుట ముక్తికిరవు తగునిది వేమా


128) ఆలు రమ్భయైన నతిశీలవతియైన
జారపురుషుడేల జాడమాను
మాలవాడకుక్క మఋఅగిన విడుచునా
విశ్వదాభిరామ వినురవేమ


129) వారకామ్తలెల్ల వలపిమ్చి వత్తురు
బుధ్ధులెల్ల తొలగబుచ్చు కొఋఅకు
మాట రూఢిగాగ మగలెల్ల వత్తురు
విశ్వదాభిరామ వినురవేమ


130) రాజసమ్బు చెమ్ది రమణుల పొమ్దాస
పడెడువాడు గురుని ప్రాపెఋఉగునె
విటుల మరుగు యువతి విభుభక్తి యెఋఉగునా
విశ్వదాభిరామ వినురవేమ


131) పడుచు నూఋఅకేల బాఋఅచూచెదరొక్కొ
ఎమ్త వారలైన భ్రామ్తి చెమ్ది
లోన మీఋఉ కాము లొమ్గజేయగలేక
విశ్వదాభిరామ వినురవేమ


132) పడతి మోసె నొకడు పడతి మేసె నొకమ్డు
పడతి సురము జేర్చి బ్రతికె నొకడు
పడతి కొఋఅకె పెక్కు పాట్లను బడిరయా
విశ్వదాభిరామ వినురవేమ


*****
ఠిస అర్తిచ్లె చొన్తైనిన వేమన పద్యాలు ఫ్రొమ 132 తొ 166 ఇస మిస్సిన.
ఈఫ అన్యొనె సవెద, మైల ఇత ఒత న్పరినన@చస.ఒర
*****


166) చదివి నతని కన్న చాకలియే మేలు
కులము వేల్పు కన్న కుక్క మేలు
సకల సురల కన్న జారభామిని మేలు
విశ్వదాభిరామ వినురవేమ.


167) జమ్త్ర మమ్త్ర మహిమ జాతవేదుడెఋఉమ్గు
మమ్త్రవాది యెఋఉగు దమ్త్ర మహిమ
తమ్త్రిణీక మహిమ దినువాడెఋఉమ్గును
విశ్వదాభిరామ వినురవేమ.


168) తగిన కులజుడైన తన యెత్తు ధనమైన
పరపురుషుని నేల పట్ట వచ్చు?
పరమ సాధ్వి చూడ నొరుల నమ్టదు సుమా
విశ్వదాభిరామ వినురవేమ.


169) ఝషము నీరు వెడల జచ్చుటే సిద్ధము
నీట నుమ్డె నేని నిక్కి పడును
అమ్డ తలగు నెడల నమ్దఋఇ పని యట్లె
విశ్వదాభిరామ వినురవేమ.


170) జన్మములను మఋఇయు జన్నియల ననేక
ముల నొనర్చియున్న ఫలము కాన
రాక యుమ్డు నీతి లేకున్న మాత్రాన
విశ్వదాభిరామ వినురవేమ.


171) డీకొనమ్గ దగదు డెమ్ద మెఋఉమ్గక
యడుగ వచ్చి కొమ్త యనిన వాని
చెప్పునమ్త నినియు మెప్పుగా బలుకుమీ
విశ్వదాభిరామ వినురవేమ.


172) తగవు తీర్చువేళ ధర్మమ్బు దప్పిన
మానవుమ్డు ముక్తి మానియుమ్డు
ధర్మమునె పలికిన దైవమ్బు తోడగు
విశ్వదాభిరామ వినురవేమ


173) ఇచ్చకము భువి నవశ్యము
కుచ్చిత మిహిలోక నిమ్ద కోవిదునకు నీ
తచ్చననె హాని వచ్చును
మచ్చరమే తన్ను చెఋఅచు మహిలో వేమా.


174) నిజము లాడు వాని నిమ్దిమ్చు జగమెల్ల
నిజము బల్కరాదు నీచుల కడ
నిజ మహాత్ము గూడ నిజమాడ వలయురా
విశ్వదాభిరామ వినురవేమ.


175) నీతి జ్యోతిలేక నిర్మలమ్బగు నేది
ఎట్లు కలగు బర మదెమ్తయైన
ధనము గలిగియున్న దైవమ్బు గలుగదు
విశ్వదాభిరామ వినురవేమ.


176) పతక మమ్దు నొప్పు పలు రత్నముల పెమ్పు
బమ్గరమమ్దు కూర్ప బరువు గనును
గాని ఇతరలోహమైన హీనము గాదె!
విశ్వదాభిరామ వినురవేమ.


177) పదుగురాడు మాట పాటియై ధరజెల్లు
నొక్కడాడు మాట యొక్క దెమ్దు
ఊఋఅకుమ్డు వాని కూరెల్లు నోపదు
విశ్వదాభిరామ వినురవేమ


178) మాల మాల కాడు మహి మీద నేప్రొద్దు
మాట తిరుగు వాడె మాల గాక
వాని మాల యున్న వాడె పో పెనుమాల
విశ్వదాభిరామ వినురవేమ.


179) మాటలాడవచ్చు మనసు నిల్పగలేడు
తెలుపవచ్చు దన్ను తెలియలేడు
సురియ బట్టవచ్చు శూరుడు కాలేడు
విశ్వదాభిరామ వినురవేమ.






180) ఏది కులము నీకు? నేది స్థలమ్బురా?
పాదుకొనుము మదిని పక్వమెఋఇగి
యాదరిమ్చు దాని నవలీల ముట్టరా
విశ్వదాభిరామ వినుర వేమ.


181) తన కులగోత్రము లాకృఉతి
తన సమ్పద కలిమి బలిమి తనకేలనయా?
తన వెమ్ట రావు నిజమిది
తన సత్యమె తోడవచ్చు దనతో వేమా.


182) నరకులమున దా బుట్టియు
నరకులమున దాను పెరిగి నరుడయ్యును దా
నరకులమును ఛీ ఛీ యని
హరకులమున దిరుగునేని హరుడౌ వేమా.


183) శూద్రతనము పోయె శూద్రుడుగానని
ద్విజుడనుకొనుటెల్ల దెలివిలేమి
ఇత్తడెసగు పసిడి కీడనవచ్చునా
విశ్వదాభిరామ వినుర వేమ.


184) శూద్ర యువతి కొడుకు శుధ్ధామ్తరమ్గుడై
వేద వేద్యమైన పాదు దెలిసి
బ్రహ్మపదవి గన్న బ్రాహ్మణుడే గదా!
విశ్వదాభిరామ వినుర వేమ.


185) శూద్రులనుచు భువిని శూద్రుల భోనాడు
మాలకన్నదుడుకు మహిని లేడు
నరకమునకు నేగు నష్టమైన వెనుక
విశ్వదాభిరామ వినుర వేమ.


186) మాల మాల కాడు మహి మీద నేప్రొద్దు
మాట తిరుగు వాడె మాల గాక
వాని మాల యన్న వాడె పో పెనుమాల
విశ్వదాభిరామ వినుర వేమ.


187) కులము కలుగువారు గోత్రమ్బు కలవారు
విద్యచేత విఋఋఅవీగువారు
పసిడికల్గువాని బానిసకొడుకులు
విశ్వదాభిరామ వినుర వేమ.


189) కులము లేనివాడు కలిమిచే వెలయును
కలిమిలేనివాని కులము దిగును
కులము కన్న నెన్న గలిమి ప్రధానమ్బు
విశ్వదాభిరామ వినుర వేమ


190) అమ్టుముట్టునెమ్చి యదలిమ్చి పడవైచి
దూరమమ్దు జేరి దూఋఉచుమ్ద్రు
పుట్టి చచ్చు జనులు పూర్ణమ్బు నెఋఉగరు
విశ్వదాభిరామ వినుర వేమ.


191) జాతి నీతి వేఋఉ జన్మమ బదొక్కటి
>రయ దిమ్డ్లు వేఋఎ యౌను గాక
దర్శనములు వేఋఉ దైవమౌ నొక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ.


192) ఇన్ని జాతులమ్దు నేజాతి ముఖ్యమన
ఎఋఉక గల్గువారె హెచ్చువారు
ఎఋఉక లేనివార లేజాతినున్నను
హీనజాతియమ్చు నెఋఉగు వేమ.


---వేమన