Thursday, September 9, 2010

Andhra maha bharatha arambham

ఎవరికీ ఏదికావాలో అది మహా భారతంలో దొరుకుతుంది లోకంలో ఉన్నది భారతంలో లేకుండా లేదు... మహాభారతం భారతీయులకు ఒక మహా కావ్యమైంది..
నన్నయ్య భారత రచన..

హిమ కరుదొట్టి పూరు భారతదేశా కురు ప్రభు పాండు భుపతుల్
క్రమమున వంశకర్తలనగా మహినొప్పిన యస్మదీవయం
శమున(బ్రసిద్దులై విమల సద్గుణ శోబితులైన పాండవో
త్తముల చరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్టమేమ్మయిన్"

అని రాజరాజ నన్నయ్యను " నా వంశం వారి చరిత్ర వినాలని ఉంది కాబట్టి మహాభారతం రాయమని" కోరాడు. అయితే  సంస్కృత భారతం చాలా పెద్దది ఉన్నదంతా తెలుగులో రాయమని కోరలేదు..

"అమలిన తారకా సముదయంబుల నెన్నను సర్వవేదశా
స్త్రముల యశేషసారము  మదంబున బొందను బుద్ది బాహువి
క్రమమున దుర్గామార్ధజల గౌరవ భారత భారతీ సము
ద్రము దరియగ నీ(దను విదాత్రు కైనను నేర బోలునే..."
అన్నాడు. అంటే "ఆకాశంలో కనిపించే నక్షత్రాలను లెక్క కట్టడం సర్వ వేద శాస్త్రాల అశేష సారాన్ని  సంతోషంతో పొందడం, అడుగు పెట్టడానికి వేలులేని నిగూడార్ధ జాలం ఉన్న ఈ మహాభారతీయ సముద్రాన్ని బుద్ది అనే బలంతో ఈదడం సృష్టికర్త అయిన బ్రమ్హకైనా  చేతనవుతుందా ? అని అర్థం. తనకు ఆంధ్ర మహాభారత రచనలో నారాయణభట్టు సహాయ పడినాడని తెలిపాడు. కొందరు నారాయణభట్టు కూడా కొంత రాసి ఉంటాడని వ్యాఖ్యానించారు.  కానీ నన్నయ్య మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడి విధంగా సహాయపడినాడని చెప్పనే చెప్పాడు ..  అంటే రచనలో సలహాలను, సూచనలను తెలియజేసి ఉంటాడని మనం అనుకోవచ్చు.. మొత్తంమీద నన్నయ్య ఆదికవి, సభా పర్వాలను పూర్తిగాను, అరణ్యపర్వంలో కొంత భాగం మాత్రమే ఆంధ్రీకరించగలిగాడు...

No comments:

Post a Comment