Tuesday, March 1, 2011

శివరాత్రి

తడి తడి గుడి
జారుడు మెట్ల పాదగయ
కోడి కూయకముందే
కొలువు తీరిన కుక్కుటేశ్వరుడు.
అరుగు మీద అమ్మ నోము

(వాయనాల్లో వర్ణ భేదం)
అర్చనలు, అభిషేకాలు
నీరై ప్రవహించిన జనం.
కనిపించని రోడ్డు
కదల్లేని కారు
(ఒకటే ఉక్కపోత)
‘కప్ప ‘ ల బెకబెకలు
ఖర్జూరాల వాసనలు.
కాగితపు కళ్ళజోడులోంచి
రంగురంగుల లోకం
ఢమఢమాల బండి లాగే శబ్దప్రపంచం
ఎర్ర లక్క పిడతల
చిట్టి చిట్టి అందం
కొన్నవారికి కొన్నంత భాగ్యం.
ఉపవాసాలూ లేవు
జాగరణలూ లేవు
చిన్నప్పడు శివరాత్రంటే
ముచ్చటైన మూడురోజుల తీర్థం.
(పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరీ సమేత కుక్కుటేశ్వరస్వామికి)

No comments:

Post a Comment