తెలుగు సాహిత్యానికి పునప్రతిష్ఠ చేసిన మహోన్నత వ్యక్తిగా సి.పి.బ్రౌన్.
1825 ప్రాంతాల్లో దాదాపు అంధకారం కప్పివేయబడివున్న తెలుగుకు వెలుగులు నింపి నేటి వైభవానికి కారణభూతుడైన బ్రౌన్‌ను అభిమానించని తెలుగువాడు ఉండడు. దేశం నలుమూలలా చెల్లాచెదురుగా పడివున్న సాహిత్య గ్రంధాలన్నింటినీ సేకరించి, విభిన్న తాళపత్రాలలో నిక్షిప్తమైయున్న కావ్యాలను కాగితాల మీదకు ఎక్కించి, పండితుల చేత సవరింపజేసి తెలుగు జాతికి తెలుగు సాహితీ సంపదను దానం చేసిన సాహితీ కర్ణుడు బ్రౌన్